అర్హతలు :-
- అక్షరాలూ చదవగలిగే జ్ఞానం చాలు.
- వయసుతో నియమం లేదు.
- చాలా ఓపిక గలవారు సహనం గలవారికి ప్రాముఖ్యత.
- హఠాత్తుగా వచ్చే కెమెరా ఎఫ్ఫెక్ట్స్ తో జనాలకి గుండెదడ వచ్చేలా పిక్చరైజ్ చెయ్యగలగాలి.
- అందంగా లేని నటులను సైతం అందం గా చిత్రికరించగలగాలి.
- అందంగా ఉన్న నటులను సైతం వారి పాత్రల ప్రకారం అసహ్యంగా చిత్రికరించగలగాలి.
- డైలీ సీరియల్ గనక జనాలకి బోర్ కొట్టకుండా చిత్రీకరణ సాగాలి.
- హారర్ సినిమా లు తీయడంలో అనుభవం కలిగిన కెమెరామెన్ లకి ప్రాముఖ్యం ఇవ్వబడును.
- కెమెరాని ఎన్ని రకాలుగా పడితే అన్ని రకాలుగా వాడడం తెలిస్తే వారికి మరికొన్ని రాబోయే ప్రాజెక్ట్స్ లో కూడా అవకాశం ఇవ్వబడును.
- కొన్ని ఎపిసోడ్స్ కథ లేకుండా నడవాల్సి వచ్చినప్పుడు కెమెరా మీదే సీరియల్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీకు అనుభవజ్ఞులైన సీరియల్ కెమెరామెన్స్ శిక్షణ ఇస్తారు.
- లాస్య రామకృష్ణ

No comments:
Post a Comment