'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Aug 12, 2013

ఈ మధ్య నాకు ఈ అలవాటు బాగా ఎక్కువైంది

ఇదివరకు కేవలం ఆకలి వేస్తే నే తినేదానిని. కాని ఇప్పుడు 

టైం పాస్ కి

 కోపం వస్తే


ఏమీ తోచకపోతే తినడం


 కంప్యూటర్ లో వర్క్ చేసుకుంటూ

 బాధ వేస్తే

టీవీ చూస్తూఇలా నన్ను చూసిన మా శ్రీవారు, "నువ్వు ఇలాగే తింటూ ఉంటే ఇలియానాలా ఉన్న నువ్వు కాస్తా గీతా సింగ్ లా అయిపోతే నాకు చాలా కష్టం." అని నొచ్చుకుంటున్నారు.

సో అప్పటినుంచి నేను చిప్స్ లాంటివి తినడం మానేసి కేవలం పాప్ కార్న్ మాత్రమే తినడం  ప్రారంభించాను.

అన్నట్టూ, పాప్ కార్న్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. అవి మీ అందరితో వచ్చే టపాలో పంచుకుంటాను. మరి ఉండనా పాప్ కార్న్ తినే టైం అయింది.

-   లాస్య రామకృష్ణ 

Aug 11, 2013

"పరుపుకింద పైజమా"


నేను ఇటివలే హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు నాన్నగారి దగ్గర 'పురాణం సీత' గారు రచించిన "ఇల్లాలి ముచ్చట్లు" అనే బుక్ చూసాను. అ పుస్తకం లోని రచనలు నన్నెంతగానో  ఆకర్షించాయి. నేను తిరిగి బెంగుళూరు వచ్చేటప్పుడు ఆ బుక్ నాతో పాటే తెచ్చుకున్నాను.

ఆ పుస్తకపు విశేషాలు మీతో పంచుకోవాలనిపించింది. మీకోసం ఆ పుస్తకానికి సంబందించిన కొన్ని విషయాలు.......

ఇందులోని వ్యాసాలు 1960 దశకంలో మొదలై 1990 దాకా ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో వెలువడ్డాయి." ఈ వ్యాసాలలో చమత్కారం నాకు బాగా నచ్చింది. అలాంటి కోవకే చెందినా ఒక వ్యాసం "పరుపు కింద పైజమా" గురించి మీతో పంచుకుంటున్నాను.

"పరుపుకింద పైజమా"

ఒకసారి సితగారి కజిన్ లలిత అనే అమ్మాయి ఉన్నట్టుండి ఏడుస్తూ పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి ఆరో నెలో ఏడో నెలో అట.  ఏడుస్తూ సడన్ గా ఎందుకు వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచి ఉన్నాయ్ కదా కొంత కాలం ఆగాక అసలు విషయం అడగవచ్చని ఊరుకుంటారు.

సరే కొంత సమయం ఇచ్చి విషయం తెలుసుకుందామంటే ఎంతకీ ఆ అమ్మాయి  చెప్పనే  చెప్పదు. సరే తన వంతు ప్రయత్నంగా ఆ అమ్మాయని సంతోష పెట్టటానికి రక రకాల పిండి వంటలు చేసి పెడ్తుంది సీత. ఇంకా ఆ విషయం ఈ విషయం అని తన మనసు ని ధ్యాస మరల్చడానికి ప్రయత్నిస్తుంది.కానీ ఇవ్వేవి పలితాన్ని ఇవ్వవు, అన్ని తిని కూడా ఆ అమ్మాయి దిగులుగా ఉండేది.

ఇహ ఇలా కాదని ఆ అమ్మాయని మళ్ళి గట్టిగ ప్రశ్నిస్తే ఆ అమ్మాయ్ చెప్పిన విషయం ఏంటంటే
వాళ్ళ అయన క్యాంపు ల ఉద్యోగం చేస్తుంటాడు. అలా క్యాంపు ల మీద నెల అంతా తిరిగి ఇంటికి వచ్చిన ఒక రోజు ( సీత గారు వ్యక్తీకరణ ఇక్కడ చమత్కారంగా ఉంటుంది అందుకే తను రాసిన వాక్యాలే యదాతధంగా ఇక్కడ వ్రాస్తున్నాను) పొట్టపగిలేల భోంచేసి, తమలపాకులు నములుతూ గేదె దూడ లాగ  పందిరి మంచం మీద పవళించి లేచి ఎందుకో(నల్లికుట్టింది కాబోసు) పరుపు ఎత్తగానే దానికింద ఒక పైజమా చారల చారలది కనిపించిందట. దాంతో ఆగ్రహోదగ్రుడై గుడ్డ్లెర్ర జేస్తూ "ఈ పైజమా ఎవరిదే" అని అడిగి ఫో కులట ఫో పుట్టింటికని పనిమనిషి సహయం ఇచ్చి పంపించాడు.

ఈ పరుపు కింద పైజమా మిస్టరీ ఎంతకీ అంతుబట్టదు సితగారికి.

ఒకసారి, సితగారు ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి చెక్ అప్ కి తెసుకెలుతుంది. పన్లోపనిగా లేడీ డాక్టర్ని "'పరుపు కింద పైజమా గురించి మీకు తెలుసా" అని అడుగుతుంది. డాక్టర్ తెల్లబోయి సితగారిని "రండి మిమ్మల్ని చెక్ అప్ చెయ్యాలి అంటుంది" అప్పుడు "మీ పరుపు కింద పైజమా ఉందా" అని డాక్టర్ ని అడుగుతుంది. లేడీ డాక్టర్ అయిన పెళ్ళికాని లేడీ యే కనుక కొంచెం సిగ్గు పడి, కొంచెం ఎర్రబడి, ఇంకా అంత వరకు రాలేదన్నట్లు నవ్వి ఒక చీటి రాసిచ్చి, " ఈ బిళ్ళలు మూడు పుటల పుచ్చుకుని, పాలు తాగి పడుకో"మని చెప్పింది.

ఇంతకి ఈ సమస్య పరిష్కరించేది సీత గారి భర్త. అతను లలితతో "మీ ఇంట్లో చాకలి పద్దు ఎవరు వేస్తారు నువ్వా మీ ఇడియట్ వేస్తాడా  అని అడగగానే ఆ అమ్మాయికి విషయం అర్ధమయిపోయింది ఒక నవ్వు నవ్వుతుంది. వెంటనే లలిత మొగుడికి ఇతను విషయం వివరించి ఉత్తరం రాస్తాడు. వెంటనే ఆ అమ్మాయి మొగుడు వచ్చి లలితను తీసుకెళతాడు.

అసలు విషయం అర్ధం కానీ సితగారు అయోమయం లో ఉండగా ఆవిడా భర్త ఇలా వివరిస్తాడు. చాకలి ఇచ్చిన వేరేవరిదో పైజమా లలిత మొగుడు నిద్రమత్తులో తీసుకుని పరుపుకింద పెట్టి తర్వాత క్యాంపు కి వెళ్ళిపోయాడు. వచ్చాక ఆ విషయం మర్చిపోయి లలిత మీద అనుమానపడ్డాడు. ఇది జరిగిన కధ అని వివరిస్తాడు.

ఇంకొక విశేషమేమిటంటే పురాణం సీత పేరుతో రచనలు చేసింది ప్రసిద్ద రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ. 


-లాస్య రామకృష్ణ 

మంచి రోజు

- లాస్య రామకృష్ణ


Aug 9, 2013

తెలుగు తేజం - బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు

వరల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ లో సీనియర్లని సైతం ఆశ్చర్యానికి గురిచేసి సెమి ఫైనల్స్ కి దూసుకెళ్ళింది సింధు. తల్లిదండ్రులిద్దరూ ఒకప్పటి వాలీబాల్ ప్లేయర్స్ కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఈ విజయాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ గా రికార్డు ని సాధించింది. 

మరి సింధు సెమి ఫైనల్స్ తో పాటు ఫైనల్స్ లో కూడా నెగ్గాలని కోరుకుందాం. 

సింధు నీకు మా అందరి తరపున అభినందనలు. 


- లాస్య రామకృష్ణ 

Aug 4, 2013

స్నేహమేరా జీవితం


బ్లాగ్ మిత్రులందరికీ Friendship Day శుభాకాంక్షలు 

ఒక కొవ్వొత్తి గదిలో వెలుగుని నింపుతుంది. ఒక స్నేహం జీవితంలో వెలుగుని నింపుతుంది. అంధకారం లో ఉన్నప్పుడు వెలుగుకి దారి చూపించేది, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తోడ్పాటనందించేది స్నేహం. అటువంటి మధురమైన స్నేహం దొరకడం కూడా ఒక అదృష్టం. అమ్మా, నాన్నా లేని వాళ్ళు అనాధలు కాదు నిజమైన స్నేహితులు లేని వాళ్ళు అనాధలు.

పూర్తి వ్యాసం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

- లాస్య రామకృష్ణ