మాతా సిద్ధిధాత్రి
నవరాత్రులలో తొమ్మిదవ రోజున మాతా సిద్ధిధాత్రిని కొలుస్తారు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకమ్య, లిశిత్వ మరియు వశిత్వ అనబడు ఎనిమిది సిద్దులని మాత ప్రసాదిస్తుంది. మాతని పూజించడం ద్వారా పరమశివుడు ఈ ఎనిమిది సిద్దులను గెలుచుకున్నాడు. అమ్మ కృప వలన, పరమ శివుని శరీరం సగం అమ్మవారిగా మారి, "అర్ధనారీశ్వరుడు " గా పూజింపబడుతున్నాడు. అమ్మవారి వాహనం సింహం. అమ్మవారు కలువ పూవు పై ఆసీనులై ఉంటారని కుడా ప్రసిద్ది. దేవుళ్ళు, ఋషులు, మునీశ్వరులు, సిద్ధ యోగులు, ఇలా అందరిచేత అరాధించబడిన దేవత సిద్ధిధాత్రి.
- లాస్య రామకృష్ణ

No comments:
Post a Comment