'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Oct 31, 2012

పెర్షియా మిద దాడి చేసిన అరబ్స్, సౌతేర్న్ యూరోప్ కి ఈ ఆటని తీసుకెళ్ళారు.


చదరంగం ఆటలో కిక్కు నాకిన్నాళ్ళు అర్ధం కాలేదు. ఒక సారి నేర్చుకున్నాక ఇక చదరంగం అట అపాలనిపించదు

ఈ మధ్యనే నేని గేమ్ నేర్చుకున్నాను. సో ఈ అట బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకొవాలనిపించిది. అఫ్ కోర్సు, చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో చదరంగం గురించి ఒక లెస్సన్ ఉండేది. కానీ అప్పుడంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ ఒక సారి గేమ్ లో  ఇన్వాల్వ్  అయ్యాక ఇది ఒక వ్యసనం ల మనల్ని వెంటాడుతుంది (నన్ను). అంటే అంత ఇంటరెస్టింగ్ గా ఉంటుందన్న మాట ఈ ఆట.

కాబట్టి సరదాగా ఈ ఆట గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.

చదరంగానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. భారత దేశం లో నే ఈ ఆట ప్రాణం పోసుకుందని చరిత్ర చెబుతోంది. చదరంగాన్ని చతురంగ అని పిలిచేవారు. ఇక్కడి నుండి పెర్షియా కి వ్యాప్తించింది. పెర్షియా మిద దాడి చేసిన అరబ్స్, సౌతేర్న్ యూరోప్ కి ఈ ఆటని తీసుకెళ్ళారు. వర్తమాన కాలంలో వాడుకలో ఉన్న చదరంగం ఆట పరిణామక్రమంలో యూరోప్ లోని 15వ శతాబ్దంలో  రూపుదిద్దుకుంది.

19వ శతాబ్దం ద్వితియార్ధం లో ఆధునిక  చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి(Modern chess tournament). మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 1886 లో నిర్వహించబడినది. 20వ శతాబ్దంలో వరల్డ్ చెస్ ఫెడరేషన్ (World Chess Federation) ఏర్పడింది.

 లాస్య రామకృష్ణ  Oct 24, 2012

విజయ దశమి కథలు


సరదాగా దసరా వెనుక కథలు ఒక సారి గుర్తుతెచ్చుకుందామా

అజ్ఞాత వాసం పూర్తి

ద్వాపర యుగంలో పాండవులు కౌరవుల చేతిలో ఓడిపోయారు. పందెంలో షరతు ప్రకారం, పాండవులు పన్నెండేళ్ళ వనవాసాసంలో , ఒక సంవత్సరం అజ్ఞాత వాసంలో గడపాలి. పన్నెండేళ్ళ వనవాసం తర్వాత విరాట రాజు కొలువులోకి అజ్ఞాత వాసం గడిపేందుకు వెళ్ళే ముందు పాండవులు తమ ఆయుధాలని శమ్మి చెట్టు కున్న తొర్రలో దాచి ఉంచుతారు. అజ్ఞాత వాసం పూర్తి కాగానే, విజయ దశమి రోజున తమ ఆయుధాలని శమ్మి చెట్టు మీంచి తీసుకుని, తామెవరో తెలియచేసి, విరాట రాజు ని కూడా మోసపరచిన కౌరవుల తో పోరాడి విజయం సాధిస్తారు.

ఆరోజు నుండి శమ్మి ఆకులు విజయానికి, మంచికి చిహ్నంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కనిపిస్తూనే ఉంది. ఆయుధాలను, శమ్మి చెట్టును దసరా నాడు పూజిస్తారు.

మహిషాసరుడు ని వధించిన మహా శక్తి  

కొందరు రాక్షసులు దేవతలపై యుద్ధం ప్రకటించి, వేధిస్తూ స్వర్గాన్ని కైవసం చేసుకోవాలని భావించేవారు. అటువంటి రాక్షసుడే మహిషాసురుడు. అల్లకల్లోలం సృష్టించసాగాడు. మహిషాసరుడి అండతో మిగతా రాక్షసులు కూడా దేవతలను ఓడించారు. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కూడా మహిషాసురుడిని ఎదిరించలేకపోయారు.

ఆ రాక్షసుడి నిరంకుశత్వం తో ముల్లోకాలూ నాశనం కాసాగాయి. పరిస్తితి విషమించడంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మహిషాసురుడిని అంతం చెయ్యడానికి తమ శక్తులన్నీ కలిపి "శక్తి" గా మారారు. మహా శక్తి దుర్గా దేవి ఈ విధంగా అవతరించింది.

మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసింది మహాశక్తి దుర్గా దేవి. పదవ రోజున, అశ్వినా శుక్ల పక్షం నాడు, మహిషాసురుడు చంపబడ్డాడు. ప్రపంచానికి పట్టిన దుష్ట శక్తి అంతరించింది.

మహిషాసురుడి పై దుర్గా దేవి విజయాన్ని అందరూ సంతోషంగా "దసరా" పండగగా  చేసుకుంటారు.

రావణుడి పై రాముడి విజయం

విష్ణుమూర్తి ఏడవ అవతారం అయిన శ్రీ రామచంద్రుడు త్రేతాయుగంలో  సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని తన సోదరుడు లక్ష్మణుడు, బంటు హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో పది రోజుల పాటు సాగిన భీకరమైన యుద్ధం తరువాత అంతమొందిస్తాడు.

రావణుడిని అంతమొందించడానికి దుర్గా దేవి ఆశీస్సులు చండీ హోమం ద్వారా శ్రీరాముడు అందుకున్నాడు. తద్వారా రావణుడి రాజ్యం లంక లోనే రావణాసురుడు చంపబడ్డాడు. 

పిమ్మట, సీతా రామ లక్ష్మణులు అయోధ్యకి అశ్విన శుక్ల దశమి నాడు అడుగుపెట్టారు. రావణుడి పై రాముడి విజయానికి సంకేతంగా "విజయ దశమి " జరుపుకుంటారు.

అంతే కాదు,  రావణాసురుడు, కుంభకర్ణుడు మరియు మేఘానందుడి ఎత్తైన విగ్రహాలను నిలిపి ప్రజలు పండుగ వేడుకలలో భాగంగా  ఈ  దసరా పది రోజులు ఆ  విగ్రహాలను కాల్చివేస్తారు.

విజయ దశమి సందర్భంగా నా ఈ బ్లాగు వందటపాలు దాటినందుకు నా శ్రేయాభిలాషులందరికి హృదయపూర్వక ధన్యవాదములు.

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.

- లాస్య రామకృష్ణ 

Oct 23, 2012

నవరాత్రులలో తొమ్మిదవ రోజు


 


 మాతా సిద్ధిధాత్రి 

నవరాత్రులలో తొమ్మిదవ రోజున మాతా సిద్ధిధాత్రిని కొలుస్తారు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకమ్య, లిశిత్వ మరియు వశిత్వ అనబడు ఎనిమిది సిద్దులని మాత ప్రసాదిస్తుంది. మాతని పూజించడం ద్వారా పరమశివుడు ఈ ఎనిమిది సిద్దులను గెలుచుకున్నాడు.  అమ్మ కృప వలన, పరమ శివుని శరీరం సగం అమ్మవారిగా మారి, "అర్ధనారీశ్వరుడు " గా పూజింపబడుతున్నాడు. అమ్మవారి వాహనం సింహం. అమ్మవారు కలువ పూవు పై ఆసీనులై ఉంటారని కుడా ప్రసిద్ది. దేవుళ్ళు, ఋషులు, మునీశ్వరులు, సిద్ధ యోగులు, ఇలా అందరిచేత అరాధించబడిన దేవత సిద్ధిధాత్రి.

- లాస్య రామకృష్ణ 

నవరాత్రులలో ఎనిమిదవ రోజు

మాతా మహా గౌరీ 
నవరాత్రులలో ఎనిమిదవ రోజు మాతా మహా గౌరీ ని ఆరాధిస్తారు. మాత చంద్రునివలే మరియూ మల్లెపూల వలె తెల్లగా ఉంటారు. అమ్మవారికి మూడు కళ్ళు, నాలుగు చేతులు. శాంతి, కరుణ కురిపిస్తారు మాత.  ఢంకా ఒక చేతిలో, త్రిశూలం ఒక చేతిలో కలిగి ఉంటారు. వాహనం ఎద్దు.

- లాస్య రామకృష్ణ 


Oct 22, 2012

నవరాత్రులలో ఏడవ రోజు


కాళరాత్రి మాత

నవరాత్రులలో ఏడవ రోజు కాళరాత్రి మాత ని ఆరాధిస్తారు. ఆవిడ నలుపు రంగులో ఉంటారు. జుట్టు విరబుసుకుని ఉంటారు. మూడు కళ్ళు, నాలుగు చేతులు. వాహనం గాడిద. చీకటిని, అజ్ఞానాన్ని తరిమి వేసే దేవత.  తనను ఆరాధించేవారికి సకల సంపదలు కలగచేస్తారు కాబట్టి "శుభంకారి" అని కూడా ఆరాధిస్తారు.

- లాస్య రామకృష్ణ 

Oct 21, 2012

నవరాత్రులలో ఆరవ రోజుకాత్యాయని మాత 

నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయని మాతని ఆరాధిస్తారు. కాత్యాయనుడు దుర్గా మాతని తన పుత్రికగా జన్మించమని కోరాడు. కాత్యాయనుడి తపస్సుకి మెచ్చి కాత్యయనుడి కి దుర్గా మాత పుత్రిక గా జన్మించింది.  అందుకే కాత్యాయనీ మాత అని పేరు వచ్చింది.

కాత్యాయని మాత  మూడు కళ్ళు, నాలుగు చేతులు కలిగి ఉంటారు. ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో కలువ పువ్వు ఉండగా, మరో చేతిని అభయహస్తంగా చూపిస్తూ, మరో చేతిని వరాలు ప్రసాదించే విధంగా దర్శనం ఇస్తారు. వాహనం సింహం.

శ్రీ కృష్ణుడు తమ భర్తగా రావాలని గోపికలు కాత్యాయని మాతని ఆరాదించారని ప్రసిద్ది. 

మాతా కాత్యయనిని ఆరాధించడం ద్వారా సకల శుభములు జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళికాని వారు కాత్యాయని వ్రతం చేస్తే త్వరగా వివాహం జరుగుతుంది.

- లాస్య రామకృష్ణ  

Oct 20, 2012

నవరాత్రులలో అయిదవ రోజు

స్కంద మాత 


నవరాత్రులలో అయిదవ రోజు స్కంద మాతని పూజిస్తారు. తన పుత్రుడు 'స్కంద' ని తన తొడ పై కూర్చోపెట్టుకుని ఉంటారు. అమ్మవారికి మూడు కళ్ళు మరియు నాలుగు చేతులు. రెండు చేతులలో కలువ పూవులు కలిగి ఉండగా, మరో రెండు చేతులు వరాన్ని ప్రసాదించేవిగా మరియు అభయహస్తంగా ఉంటాయి. స్కంద మాత దయ వల్ల ఒక పామరుడు కూడా పండితుడిగా మారిపోతాడు అని ప్రసిద్ది. మహాకవి కాళిదాసు మీద స్కందమాత దయ అపారం. అమ్మవారి వాహనం సింహం.

- లాస్య రామకృష్ణ 


Oct 19, 2012

నవరాత్రులలో నాలుగవ రోజు


మాతా కుష్మాండ


నవరాత్రులలో నాలుగవ రోజు మాత కుష్మాండ దేవిని కొలుస్తారు. ఆరు చేతులలో ఆయుధాలు కలిగి ఉంటారు. ఒక చేతిలో జపమాల మరొక చేతిలో కలువ కలిగి ఉంటారు. వాహనం సింహం

- లాస్య రామకృష్ణ 

Oct 18, 2012

నవరాత్రులలో మూడవ రోజు

మాత చంద్రఘంట 

నవరాత్రులలో మూడవ రోజున మాత చంద్రఘంటను కొలుస్తారు. మాత  ప్రకాశవంతమైన వదనం కలవారు. వాహనం పులి. పది చేతులు, మూడు నయనాలు కలిగిన అమ్మవారు చంద్రఘంట మాత. ఎనిమిది చేతులలో ఆయుధాలు కలిగి ఉంటారు. ఒక చేయి వరాన్ని ప్రసాదించడానికి మరొక చేయి ఎటువంటి హాని తన భక్తులకు కలగకుండా అభయం ఇస్తున్నట్టు గా ఉంటారు.

- లాస్య రామకృష్ణ 


Oct 17, 2012

నవరాత్రులలో రెండవ రోజు

మాత బ్రహ్మచారిణి

నవరాత్రులలో రెండవ రోజు మాత బ్రహ్మచారిణిని కొలుస్తారు. మాత తన కుడి చేతిలో జపమాలని ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి ఉంటారు. 'ఉమా', 'తపచారిని' అని కూడా మాత బ్రహ్మచారిణిని కొలుస్తారు. తనను ఆరాధించేవారికి సకల సంపదలు ప్రసాదిస్తారు.- లాస్య రామకృష్ణ 

Oct 16, 2012

నవరాత్రులలో మొదటి రోజు


'నవ' అనగా తొమ్మిది 'రాత్రి' అనగా రాత్రులు అని అర్ధం. నవరాత్రి అనగా తొమ్మిది రాత్రులు. మహాశక్తి దుర్గాదేవిని మనం ఈ తొమ్మిది రాత్రులు తొమ్మిది రూపాలలో కొలుస్తాము. 

ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా


నవరాత్రులలో మొదటి రోజు 
పర్వత రాజు కుమార్తె శైలపుత్రి. అమ్మవారి తొమ్మిది అవతారాలలో మొదటి అవతారం. ముందుజన్మలో ఈవిడ  దక్షుని కుమార్తె. మాత శైలపుత్రి ని పార్వతి దేవిగా కూడా కొలుస్తారు, శివునిని వరించింది. నవరాత్రులలో మొదటి రోజున త్రిశూలధారిణి పార్వతి దేవిని కొలుస్తారు. వామ హస్తంలో కలువ పువ్వు కలిగి ఉంటారు.ఆహ్లాదకరమైన చిరునవ్వుతో దర్సనమిస్తారు. ఆవిడ వాహనం 'ఎద్దు'.   

- లాస్య రామకృష్ణ  

Oct 15, 2012

శ్రీ సాయిబాబా వారి ఏకాదశ సూత్రములు

1.షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.

2.ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు.

3.నా భౌతికదేహానంతరం నేను అప్రమత్తుడను.

4.నా భక్తులకు రక్షణము నా సమాధి నుండి వెలువడుచుండును

5.నా సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును.

6.నన్ను ఆశ్రయించిన వారిని, నా శరణు జొచ్చినవారిని రక్షించుటయే నా కర్తవ్యం.

7.నా సమాధి నుండియే నేను సర్వ కార్యములు నిర్వహింతును.

8.నా యందు ఎవరికీ దృష్టియో వారి యందే నా కటాక్షము.

9.మీ భారములు నా పై వుంచుడు. నేను భరించెదను.

10.నా సహాయముగాని, సలహాను గాని కోరిన తక్షణమే ఒసంగెదను.

11.నా భక్తుల ఇంట లేమి అనునదియుండదు.
సేకరణ 
-లాస్య రామకృష్ణ  

Oct 13, 2012

ఈ చిన్నారులకు సాయం చేయండి

మానవ సేవే మాధవ సేవ

దయచేసి ఈ పోస్ట్ ని చదివి ఈ చిన్నారులకు సాయం చేయండి. వీరి గురించి మరింత మందికి తెలియజేయండి.

లంకె - ఈ చిన్నారులకు సాయం చేయండి

- లాస్య రామకృష్ణ.

Oct 9, 2012

మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే

అది ఒక రియాలిటీ షో. 

ఆరేళ్ళ పిల్ల ఒక పిచ్చి తల్లిలాగ అభినయించి ఆక్సిడెంట్ లో చనిపోయిన తన బిడ్డనూహించుకుంటూ పాట పాడి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది.

ఆ అమ్మాయి అభినయిస్తున్నంత  సేపు ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

డాన్సు అయిపోగానే వాఖ్యాత ఆ అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కంట నీరుతో స్టేజి మీదకి వచ్చి ప్రేమగా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంది.

తనే నలుగురు పిల్లల్ని కనీ  పెంచినట్టు ఆరేళ్ళ ఆ అమ్మాయి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది. 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో "7G బృందావన్ కాలని" లోని ఒక  "తలచి తలచి చూస్తే" అనే పాట ని పియానో తో ప్లే చేసారు.

అంతా బాగానే ఉంది, ఇక్కడ నాకర్ధం కాని విషయం చిన్న పిల్లలచేత ఇన్ని భావోద్వేగాలు పలికించాలనుకోవడం ఎంత వరకు సమంజసం.

అది డాన్సు షో. వాటిలో ఈ మధ్య చిన్నపిల్లలకి రకరకాల పాటలకు ఐటెం సాంగ్స్ కి మించిపోయేట్టు రకరకాలుగా డాన్సు స్టెప్పులు Choreograph చేస్తున్నారు. వాళ్ళ వయసు(మనసు)కి మించి వారితోటి రకరకాల భావోద్వేగాల్ని పలికిస్తున్నారు.

చిన్నపట్నించి పిల్లలకి చదువుతో పటు రక రకాల కళలపై ఆసక్తి కలిగించాలనుకోవడం అభినందించదగ్గ విషయం. కానీ వాటికే వారిని అంకితం చేయడం ఎంత వరకు న్యాయం.

పిల్లలకి వెంటనే పేరు వచ్చేయాలి అనే తాపత్రయంతో పెద్దలు పిల్లలకి జన్మ హక్కు అయిన ఒక వరాన్ని అందకుండా చేస్తున్నారు. ఆ వరం పేరే బాల్యం.అటువంటి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి. పిల్లల్ని అందమైన బాల్యానికి దూరం చేయకండి. వారు పెద్దయ్యాక మిమ్మల్ని తెమ్మన్నా తిరిగి తేలేరు వారి 'బాల్యాన్ని'.

మహాకవి శ్రీ శ్రీ గారి కవిత మరో సారి మనం గుర్తుచేసుకుందాం.

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!
అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!
గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు
ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు

- లాస్య రామకృష్ణ 
 

Oct 7, 2012

ప్రముఖ సంస్థ నిర్మించబోయే ఒక మెగా డైలీ సీరియల్ కి కెమెరామెన్ కావలెను
అర్హతలు :- 
  • అక్షరాలూ చదవగలిగే జ్ఞానం చాలు.
  • వయసుతో  నియమం లేదు.
  • చాలా ఓపిక గలవారు సహనం గలవారికి ప్రాముఖ్యత.
  • హఠాత్తుగా వచ్చే కెమెరా ఎఫ్ఫెక్ట్స్ తో జనాలకి గుండెదడ వచ్చేలా పిక్చరైజ్ చెయ్యగలగాలి.
  • అందంగా లేని నటులను సైతం అందం గా చిత్రికరించగలగాలి.
  • అందంగా ఉన్న నటులను సైతం వారి పాత్రల ప్రకారం అసహ్యంగా చిత్రికరించగలగాలి.
  • డైలీ సీరియల్ గనక జనాలకి బోర్ కొట్టకుండా చిత్రీకరణ సాగాలి.
  • హారర్ సినిమా లు తీయడంలో అనుభవం కలిగిన కెమెరామెన్ లకి ప్రాముఖ్యం ఇవ్వబడును.
  • కెమెరాని ఎన్ని రకాలుగా పడితే అన్ని రకాలుగా వాడడం తెలిస్తే వారికి మరికొన్ని రాబోయే ప్రాజెక్ట్స్ లో కూడా అవకాశం ఇవ్వబడును.
  • కొన్ని ఎపిసోడ్స్ కథ లేకుండా నడవాల్సి వచ్చినప్పుడు కెమెరా మీదే సీరియల్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీకు అనుభవజ్ఞులైన సీరియల్ కెమెరామెన్స్ శిక్షణ ఇస్తారు.
ఆసక్తి గలవారు మా సంస్థ ప్రసారం చేసే సీరియల్స్ విరామ సమయంలో ఇవ్వబడిన నెంబర్ కి కాల్ చేసి తమ పేరుని, వివరాలని తెలుపగలరు.


- లాస్య రామకృష్ణ 


Oct 5, 2012

హాస్పిటల్ మిస్టరీ - ఐ సి యు లో ఉండే ఆ బెడ్ లో అడ్మిట్ అయ్యే ప్రతి పేషెంట్ కరెక్ట్ గా రాబోయే ఆదివారం ఉదయం 11.00 గంటలకల్లా ప్రాణాలు విడిచేవారు. అసలేం జరుగుతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు.

అది ఒక ప్రముఖ హాస్పిటల్. ప్రపంచంలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచే హాస్పిటల్. కానీ ఆ హాస్పిటల్ లో ని వీడని ఒక మిస్టరీ ఉంది. 

అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్ధం కావట్లేదు. 

ఐ సి యు లో ఉండే ఆ బెడ్ లో అడ్మిట్ అయ్యే ప్రతి పేషెంట్ కరెక్ట్ గా రాబోయే ఆదివారం ఉదయం 11.00 గంటలకల్లా ప్రాణాలు విడిచేవారు. అసలేం జరుగుతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. 

ఆ హాస్పిటల్ లోని డాక్టర్స్ అందరిలోనూ ఒక అలజడి. ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే తాపత్రయం. సమస్య పరిష్కరించాలనే తపన. ఏవైనా మానవాతీత శక్తులు తిరుగుతున్నాయా అని అనుమానం. భయం. బెంగ...

అడ్మిట్ అయ్యే వారు ప్రత్యేకించి ఆ బెడ్ ని తప్ప వేరే బెడ్ ని కోరేవారు.

క్రమంగా హాస్పిటల్ కి జనాలు తగ్గుముఖం పట్టారు. ఇప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని డాక్టర్స్ టీం అంతా డిసైడ్ అయ్యారు.

ఒక ఆదివారం ఉదయం, 11:00 గంటలకి సరిగ్గా పది నిమిషాల ముందు డాక్టర్స్ అందరూ  ICU బయట దాక్కుని ఈ మిస్టరీ వెనుక హిస్టరీ తెలుసుకుందామని ఎదురుచూస్తున్నారు. సమయం చక చకా పరిగెడుతోంది. 

కొందరు డాక్టర్స్ దేవుడి పుస్తకాలు కుడా తెచ్చుకున్నారు.

సమయం 

10:57          
 అందరికి ముచ్చెమటలు పడుతున్నాయి 

10:58                                
దేవుడి ప్రార్ధనలు ఎక్కువవుతున్నాయి 

10:59                                
గుండె దడ మరీ ఎక్కువైంది 

10:59:58                            
ఇంకొద్ది క్షణాల్లో ఏం  జరగబోతోందో ...... 

11:00     
హాస్పిటల్ పనివాడు వచ్చి I C U లో ఉన్న లైఫ్ సపోర్ట్ సిస్టం(Life Support System) ప్లగ్ తిసేసాడు ఎందుకంటే వ్యాక్యూం క్లీనర్ (Vaccum cleaner) వాడుకోవడానికి.

- లాస్య రామకృష్ణ 
                            

Oct 3, 2012

వందేమాతరం! వందేమాతరం!

 బంకించంద్ర చటర్జీ

వందేమాతరం! వందేమాతరం!

సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం !

శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ !

సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం !

వందేమాతరం! వందేమాతరం! 

- సేకరణ 
లాస్య రామకృష్ణ 

Oct 2, 2012

గాంధీగారు చాలా మొహమాటస్తుడు


ఇవాళ గాంధీ 143 వ జయంతి. ఈ సందర్భంగా గాంధీ గారి జీవితంలో ఒక సంఘటనని ప్రస్తావించుకుందాం.

గాంధీగారు చాలా మొహమాటస్తుడు. చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే సరాసరి ఇంటికి వెళ్ళిపోయేవారు. తన తోటి పిల్లలు మాత్రం ఒకరితో ఒకరు ఆడుకోవటం కానీ, మాట్లాడుకోవటం కానీ చేసేవారు. తనని ఆపి ఎక్కడ తనని అపహాస్యం చేస్తారోనన్న భయం చిన్నప్పుడు గాంధీజీకి ఉండేది.

ఇలా ఉండగా ఒకసారి Mr.Giles (ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్) గాంధీ గారి స్కూల్ ని పర్యవేక్షించడానికి వచ్చారు. పిల్లలందరికీ అయిదు పదాలు చెప్పి వాటి స్పెల్లింగ్స్ రాయమని అడిగారు. గాంధీగారు అన్ని పదాలు కరెక్ట్ గా రాసి ఒక పదం మాత్రం తప్పుగా రాసారు. ఇది అర్ధం చేసుకున్న స్కూల్ మాష్టారు గాంధీని తోటి విద్యార్ధి నుండి చూచి రాయమని సైగ చేసాడు. కానీ గాంధీ మాత్రం ఆ విధంగా చెయ్యలేదు. Mr.Giles వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూల్ మాష్టారు గాంధీని కసురుకున్నాడు.

ఇంటికి చేరుకున్న గాంధీ మాత్రం బాధపడలేదు. చినప్పట్నుంచి తను నమ్మిన విలువలకి కట్టుబడిన మహనీయుడు గాంధీజీ.

- లాస్య రామకృష్ణ 

Oct 1, 2012

జనగణమన...రవీంద్రనాధ్ ఠాగూర్
జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ  వంగా 
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ
దాయక జయ హే
భారత భాగ్య విధాతా
జయ హే జయ హే జయ హే
జయ జయ జయ జయ హే  
- సేకరణ 
లాస్య రామకృష్ణ