'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Apr 1, 2012

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే


శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
     సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

రాముడు. దేవుల్లందరిలో ఒక ప్రత్యేకత కలిగినవాడు. మానవుడు ఎలా జీవించాలి అని చెప్పినవాడు. ఉత్తముడైన రాజు, కొడుకు. అలాగే ఉత్తముడైన భర్త. ఎకపత్నీవ్రతుడు. 

రాముడు దశరధుని పుత్రుడు. అతనికి ముగ్గురు సహోదరులు, లక్ష్మన, భారత శతృజ్ఞులు. 

తండ్రి కోరిక మేరకు అడవులకి వెళ్ళడానికి కూడా వెనకాడని వాడు.

సీత కోరిక తో బంగారు జింక ను తేవడానికి బయలుదేరినవాడు.
చాకలి అన్న మాటలు విని తన భార్య సీతను అడవులకు పంపినవాడు. 

అంటే రాముడు, ఏ పరిస్తితులలో ఎలా జీవించాలో చెప్పదలచుకున్నాడా?
లేక వేరొకరి మాటల ప్రభావాలకి లొంగిపోయి అలా ప్రవర్తించడా?
అంటే ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావించుకోవాలి. మానవులకి ఎలా జీవించాలో అన్న విషయం లో స్పూర్తి అయినవాడు, పైన చెప్పిన సంఘటనలలో ప్రాక్టికల్ గా అలోచించి ఉండుంటే అసలు రామాయణమే ఉండేది కాదు. 


ఎందుకంటే ఒక సారి పరిశిలిద్దాం. 

ఒక వేళ తండ్రి మాటను ధిక్కరించి తను అడవులకు వెళ్ళకుండా ఉండుంటే, సీత బంగారు జింకని కోరి ఉండేది కాదు, తద్వారా లోకానికే ఇబ్బంది కలిగిస్తున్న రావణాసురిడిని శ్రీ రాముడు అంతరించి ఉండే వాడే కాదు.

అదే శ్రీ రాముడినిలోని గొప్పతనం. అయన చేసిన ప్రతి పని లోక కళ్యానార్ధమే.


- లాస్య రామకృష్ణ 

6 comments:

చిన్ని ఆశ said...

మీకూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

Anonymous said...

లాస్యరామకృష్ణ,
శ్రీరామనవమి శుభాకామనలు.శ్రీ రామునిలా సీతలా బతుకుదాం. కష్టమొచ్చినా, ఐశ్వర్యం ప్రలోభపెట్టినా, మనసు మారకుండా బతుకుదాం.

రాజి said...

మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

Lasya Ramakrishna said...

రాజి గారు, చిన్ని ఆశ గారు మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

kastephale గారు - మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

భారతి said...

శ్రీరామ యనెడు మంత్రం
తారకమని యెరిగి మదిని ధ్యానపరుండై
సారము గ్రోలిన నరునకు
చేరువగును పరమ పదము చేకురు వేమా
మీకూ, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Lasya Ramakrishna said...

భారతి గారు మీకూ, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.