Thought for the day

అంతా మన మంచికే.

Saturday, April 28, 2012

మీకు తెలుసా

కొండల్లాంటి ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పడే మంచు నెమ్మదిగా గట్టిపడి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇలా ఇవి పల్లానికి జరుగుతూ నేలను కూడా కోతకు గురి చేస్తాయి. ఇవి కరిగినప్పుడు వీటి నుంచే నదులు ఏర్పడి కిందకి ప్రవహిస్తాయి.

లక్షలాది బరువుండే ఐస్ బర్గ్ లు తేలుతూ సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగగానే ఇవి చిన్న ముక్కలుగా విడిపోయి సముద్రంలో కలిసిపోతాయి. ఐస్ బర్గ్ ల వాళ్ళ ఓడలకు ప్రమాదమే. 

టైటానిక్ ఓడ ఐస్ బర్గ్ ను ఢీ కొట్టే మునిగిపోయిందని తెలుసుకదా. 

ఇన్నాళ్ళు బి-15 అనే ఐస్ బర్గ్ కు అతి పెద్దదిగా రికార్డ్ ఉంది. 2001 లో ఏర్పడిన ఇది ఏకంగా 295 కిలోమీటర్ల పొడవు, 37  కిలోమీటర్ల వెడల్పు ఉండేది. ఇక దీని బరువు 300 బిలియన్ టన్నులుగా అంచనా వేశారు. కొన్నేళ్ళకు ఇది ముక్కలైపోయింది. 

ఐస్ బెర్గ్ ను గమనిస్తే ఎక్కువ శాతం సముద్రభాగంలో ఉంటూ కొంత భాగం మాత్రమే మనకి కనిపిస్తుంది. 

ఈ ఐస్ బెర్గ్ లను ఉదాహరిస్తూ కూడా కార్పోరేట్ కంపెనీస్ లో శిక్షణ తరగతులు మనుషుల మనస్తత్వం గురించి తెలియజేయడానికి తీసుకుంటూ ఉంటారు.

నేను అటెండ్ అయిన మెజారిటీ ట్రైనింగ్ ల లో ఎక్కువ శాతం ఐస్ బెర్గ్ థియరీ ఆ ట్రైనింగ్ కి రిలేట్ చేస్తూ కోట్ చేసారు. 

ఉదాహరణకి ఈ పిక్చర్ చూడండి.


ఒక మనిషి యొక్క ప్రవర్తన (Behaviour ), ఆ వ్యక్తి యొక్క విలువలు(values ), నమ్మకాలూ (Beliefs ), వైఖరి (Attitude ),  ప్రేరణ (Motivation ) మొదలగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 

కానీ కనిపించేది ప్రవర్తన మాత్రమే. ప్రవర్తనని నిర్దేశించిన ఈ సున్నితమైన అంశాలు అంతర్లీనంగా ఉంటాయి.

- లాస్య రామకృష్ణ 




Saturday, April 21, 2012

హైకోర్ట్ నోటీసు - పాపం జెనిలియా


కేవలం డబ్బులు వస్తాయికదా అని ఏది పడితే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ప్రజలు మోసపోవడానికి కారణం అవుతున్నారు కొంత మంది బ్రాండ్ అంబాసిడర్లు. They have to judge theirselves about the product for which they will be acting as a brand ambassador. ఇలాంటి కేర్ తీసుకోని జెనిలియా పాపం ఎలా బుక్కయ్యిందో చూడండి.


ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ జెనీలియాని ఏప్రిల్ 25 వ తారీకున కోర్ట్ కి హాజరు కమ్మని నోటిసు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే,  జెనిలియా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆమె ప్రోమోట్ చెయ్యడం వల్ల ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కి విపరీతంగా ప్రజల స్పందన లభించింది. 

నాలుగేళ్ళ క్రితం తమ దగ్గర డబ్బులు తీసుకుని కనీసం ఇప్పటికి కూడా నిర్మాణం ప్రారంభించలేదని బాధితుల ఆవేదన. బాదితులు తము జెనిలియా ప్రోమోట్ చెయ్యడం వల్లే మోసపోయామని ఆరోపిస్తున్నారు.


Friday, April 20, 2012

టైటానిక్ తెలుగులో తీస్తే హీరో ఎవరు...

టైటానిక్ 3d మూవీ చూసాను. చాలా బాగుంది. ఎంతైనా టైటానిక్ ఒక గొప్ప లవ్ స్టొరీ కదా.

కానీ నాకొక అలవాటు ఉంది. నేను ఏదైనా పరభాషా చిత్రాలు చూసినప్పుడు ఆ సినిమా తెలుగులో తీస్తే పాత్రధారులు ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తాను.

ఈ సినిమా చూసినంత సేపు కూడా అదే ఆలోచన. హీరో ఎవరైతే బాగుంటుంది, హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది. ఇంకా ముఖ్యపాత్రధరులుగా ఎవరిని అడగవచ్చు అని. (అదేదో నేనే సినిమా తీసేసినట్టు)


సరదాగా కాసేపు 

మరి టైటానిక్ లాంటి సినిమా ఇప్పుడు తెలుగు లో తీస్తే, ఏ ఏ పాత్రలకు ఎవరిని మీరు సూచిస్తారు.



- లాస్య రామకృష్ణ