'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Feb 21, 2013

అందిన ద్రాక్ష తియ్యనద్రాక్ష ని ఆహారం లో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో. అత్యంత పోషక విలువలు కలిగిన ద్రాక్ష ఆరోగ్యాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడం లో ద్రాక్ష పండు ప్రధాన పాత్ర పోషిస్తుందనడం లో సందేహం లేదు. అజీర్ణం, మలబద్దకం, మూత్రపిండాల సమస్యలు, ఆయాసం, అలసట, నీరసం, దృష్టి లోపములు, కంటి శుక్లాల నివారణ మొదలగు సమస్యల బారిన పడకుండా ద్రాక్ష తోడ్పడుతుంది. అత్యంత రుచికరమైన పళ్ళ లో ఒకటైన ద్రాక్షలో ఎ, సి, బి6 మరియు ఫోలేట్ విటమిన్లతో పాటు పొటాషియం, కాల్సియం, ఐరన్, ఫొస్ఫరస్, మెగ్నీషియం మరియు సేలేనియం వంటి మినరల్స్ కలవు.ద్రాక్ష వల్ల నయమయ్యే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు

ఆస్థమా :- ద్రాక్షలో ఉన్న ఔషదపరమైన గుణాలు ఆస్థమాను నయం చెయ్యడానికి ఉపయోగపడతాయి. గుండె సంబంధిత వ్యాధులు :- రక్తం లో ని నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలని పెంచడం ద్వారా రక్తం గడ్డ కట్టడాన్ని ద్రాక్ష నిరోధిస్తుంది. అందువల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తనాళాలని అడ్డగించే చెడ్డ కొవ్వు ని నిర్మూలించడానికి కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. మైగ్రేన్ : ఉదయాన్నే ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య నుండి బయటపడవచ్చు. మలబద్దకం : మలబద్దక సమస్యకు విరుగుడు ద్రాక్ష. అజీర్ణం : అజీర్తి ని నయం చేసేందుకు ద్రాక్ష ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేడి ని తగ్గించి పొట్టకి ఉపశమనం కలిగిస్తుంది. 


ద్రాక్ష వల్ల నయమయ్యే మరికొన్ని ఆరోగ్య సమస్యల గురించి తరువాతి టపాలో తెలుసుకుందాం.... 


- లాస్య రామకృష్ణ 

Feb 12, 2013

ప్రేమికులకు చిట్కాలు

హాయ్ ఫ్రెండ్స్,

ఎన్నో ప్రేమికుల రోజులు వస్తూ ఉన్నాయి. పోతూ ఉన్నాయి. ప్రేమకి ఒక రోజు అవసరమా? లేక ఈ రోజు ప్రత్యేకంగా ఎన్ని పనులున్న ప్రియమైన వారి కోసం కేటాయించాలనా. 

ఇవన్నీ ఎందుకులెండి. అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ ప్రేమికుల రోజు నాడు మీ ప్రియమైన వారిని ఎలా సంతోషపెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ టపా మీ కోసమే. 

ప్రేమికుల రోజు ని మరింత ప్రత్యేకంగా జరుపుకునేందుకు కొన్ని చిట్కాలు

1.కానుకలు ఏవైనా కానుకలని మీ ప్రియమైన వారికి బహుకరించండి. ఎప్పటినుంచో కొనుక్కోవాలని ఎదురు చూస్తున్న వస్తువు ని బహుకరిస్తే ఎంతో సంతోషిస్తారు. 

2.ట్రిప్ ప్రేమికుల రోజు ప్రత్యేకంగా ఏదైనా ట్రిప్ ప్లాన్ చెయ్యండి. సరదాగా రెండు రోజుల ట్రిప్ లేదా మూడు రోజుల ట్రిప్ ప్లాన్ చెయ్యండి. ఈ గజిబిజి జీవన నేపధ్యం లో నుండి దూరంగా చక్కటి ప్రకృతి ఒడిలో హాయిగా గడిపి రండి.

3.హోటల్ 


ఏదైనా మంచి హోటల్ కి వెళ్లి భోజనం చేసి రండి. ప్రశాంతం గా ఉండే హోటల్ ని ఎంచుకుని మీ భాగస్వామిని తీసుకుని వెళ్ళండి. 

4.ఇంట్లో 

ఇంట్లో కూడా ప్రేమికుల రోజుని అద్భుతంగా జరుపుకోవచ్చు. ఎలాగంటారా? చక్కగా మీ చేతితో మీ భాగస్వామికి నచ్చిన వంటకాలని వండండి.  ప్రేమికుల రోజు కోసం హృదయాకారం లో ఉన్న టేబుల్ మాట్స్ తో మీ డైనింగ్ టేబుల్ ని అలంకరించండి. ఒక చక్కటి ఫ్లవర్ వాజ్ ని డైనింగ్ టేబుల్ కి మధ్యలో అమర్చండి. ఫ్లవర్ వాజ్ చుట్టూ కొవ్వొత్తులని ఒక డిజైన్ లో వెలిగించండి. మత్తెక్కించే రూం స్ప్రే ని చల్లండి. మీ ఇద్దరికీ నచ్చిన సినిమా సి డి ని ప్లే చేస్తూ, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యండి. 

కెమెరా ని ఆటో మోడ్ లో ఉంచి ఇద్దరు కలిసి ఈ ప్రేమికుల రోజు సందర్భంగా తయారు చెయ్యబడిన విందు దగ్గర ఫోటో దిగడం మాత్రం మరచిపోవద్దు. 

మరి మీకు తెలిసిన చిట్కాలు నాతో పంచుకుంటారా....


- లాస్య రామకృష్ణ  
Feb 10, 2013

ఆపరేషన్ కి అయిదు లక్షల ఖర్చు

సాక్షి టీవీ లోఇవాళ ఓక ప్రోగ్రాం చూసాను


అందులో గుండెలో రంధ్రాలు కలిగిన తమ బాలుడి ఆపరేషన్ కి అయిదు లక్షల ఖర్చు అవుతుందని ఆ బాబు తల్లిదండ్రులు చెప్పారు.

సహాయం చేయాలనుకునే వారు ఈ క్రింది వివరాలని గమనించగలరు


హకిమున్నిసా 
A/C  62249002334
SBHY0020182
నకిరేకల్ బ్రాంచ్
నల్గొండ జిల్లా 
కాంటాక్ట్ : 8501025994

- లాస్య రామకృష్ణ 


Feb 2, 2013

"ఒంగోలు గిత్త" లో నగ్నం గా నటించిన ప్రకాష్ రాజ్ - ఈ సినిమా చూసే సాహసులు ఎవరో?

"ఒంగోలు గిత్త" సినిమాలో నగ్నంగా నటించిన ప్రకాష్ రాజ్ అని ఈ మధ్య ఒక న్యూస్ పేపర్ లో చదివాను.

హీరో రామ్ సినిమాలు ఏంతో ఆసక్తికరంగా ఉంటాయి.

కుటుంబ సమేతంగా చూసే లా ఉండే సినిమాలు దర్సకత్వం వహించడం లో భాస్కర్ పేరొందినవాడు.

ఈ రెండు కారణాల రీత్యా ఈ సినిమా చూడాలని అనుకున్నాను. 

కానీ వార్తల్లో ఈ కొత్త స్టేట్ మెంట్ చూసాక ఈ సినిమా చూడాలన్న ఆలోచన విరమించుకున్నాను.

మరి ఇలాంటి ఆలోచన భాస్కర్ కి ఎందుకు కలిగిందో. నాకైతే ఈ సినిమా చూడాలనే ఆసక్తి సన్నగిల్లింది.
Feb 1, 2013

పద్మ భూషణ్ అవార్డ్ ని కాదన్న మహా గాయని ఎస్ జానకి

అభిమానుల గుర్తింపే తనకి గొప్పదని, ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించిందని భావించిన జానకి పద్మ భూషణ్ అవార్డుని తిరస్కరించారు. - లాస్య రామకృష్ణ