'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Oct 24, 2012

విజయ దశమి కథలు


సరదాగా దసరా వెనుక కథలు ఒక సారి గుర్తుతెచ్చుకుందామా

అజ్ఞాత వాసం పూర్తి

ద్వాపర యుగంలో పాండవులు కౌరవుల చేతిలో ఓడిపోయారు. పందెంలో షరతు ప్రకారం, పాండవులు పన్నెండేళ్ళ వనవాసాసంలో , ఒక సంవత్సరం అజ్ఞాత వాసంలో గడపాలి. పన్నెండేళ్ళ వనవాసం తర్వాత విరాట రాజు కొలువులోకి అజ్ఞాత వాసం గడిపేందుకు వెళ్ళే ముందు పాండవులు తమ ఆయుధాలని శమ్మి చెట్టు కున్న తొర్రలో దాచి ఉంచుతారు. అజ్ఞాత వాసం పూర్తి కాగానే, విజయ దశమి రోజున తమ ఆయుధాలని శమ్మి చెట్టు మీంచి తీసుకుని, తామెవరో తెలియచేసి, విరాట రాజు ని కూడా మోసపరచిన కౌరవుల తో పోరాడి విజయం సాధిస్తారు.

ఆరోజు నుండి శమ్మి ఆకులు విజయానికి, మంచికి చిహ్నంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కనిపిస్తూనే ఉంది. ఆయుధాలను, శమ్మి చెట్టును దసరా నాడు పూజిస్తారు.

మహిషాసరుడు ని వధించిన మహా శక్తి  

కొందరు రాక్షసులు దేవతలపై యుద్ధం ప్రకటించి, వేధిస్తూ స్వర్గాన్ని కైవసం చేసుకోవాలని భావించేవారు. అటువంటి రాక్షసుడే మహిషాసురుడు. అల్లకల్లోలం సృష్టించసాగాడు. మహిషాసరుడి అండతో మిగతా రాక్షసులు కూడా దేవతలను ఓడించారు. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కూడా మహిషాసురుడిని ఎదిరించలేకపోయారు.

ఆ రాక్షసుడి నిరంకుశత్వం తో ముల్లోకాలూ నాశనం కాసాగాయి. పరిస్తితి విషమించడంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మహిషాసురుడిని అంతం చెయ్యడానికి తమ శక్తులన్నీ కలిపి "శక్తి" గా మారారు. మహా శక్తి దుర్గా దేవి ఈ విధంగా అవతరించింది.

మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసింది మహాశక్తి దుర్గా దేవి. పదవ రోజున, అశ్వినా శుక్ల పక్షం నాడు, మహిషాసురుడు చంపబడ్డాడు. ప్రపంచానికి పట్టిన దుష్ట శక్తి అంతరించింది.

మహిషాసురుడి పై దుర్గా దేవి విజయాన్ని అందరూ సంతోషంగా "దసరా" పండగగా  చేసుకుంటారు.

రావణుడి పై రాముడి విజయం

విష్ణుమూర్తి ఏడవ అవతారం అయిన శ్రీ రామచంద్రుడు త్రేతాయుగంలో  సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని తన సోదరుడు లక్ష్మణుడు, బంటు హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో పది రోజుల పాటు సాగిన భీకరమైన యుద్ధం తరువాత అంతమొందిస్తాడు.

రావణుడిని అంతమొందించడానికి దుర్గా దేవి ఆశీస్సులు చండీ హోమం ద్వారా శ్రీరాముడు అందుకున్నాడు. తద్వారా రావణుడి రాజ్యం లంక లోనే రావణాసురుడు చంపబడ్డాడు. 

పిమ్మట, సీతా రామ లక్ష్మణులు అయోధ్యకి అశ్విన శుక్ల దశమి నాడు అడుగుపెట్టారు. రావణుడి పై రాముడి విజయానికి సంకేతంగా "విజయ దశమి " జరుపుకుంటారు.

అంతే కాదు,  రావణాసురుడు, కుంభకర్ణుడు మరియు మేఘానందుడి ఎత్తైన విగ్రహాలను నిలిపి ప్రజలు పండుగ వేడుకలలో భాగంగా  ఈ  దసరా పది రోజులు ఆ  విగ్రహాలను కాల్చివేస్తారు.

విజయ దశమి సందర్భంగా నా ఈ బ్లాగు వందటపాలు దాటినందుకు నా శ్రేయాభిలాషులందరికి హృదయపూర్వక ధన్యవాదములు.

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.

- లాస్య రామకృష్ణ 

2 comments:

భారతి said...

వంద టపాలు పూర్తిచేసుకున్నందుకు శుభాకాంక్షలు & అభినందనలు!
ఇలానే మంచి మంచి టపాలు మీ నుంచీ రావాలని ఆశిస్తూ...
మీకు మరియు మీ కుటుంబసభ్యులకు 'విజయదశమి శుభాకాంక్షలు'.

Lasya Ramakrishna said...

ధన్యవాదములు భారతి గారు. మీలాంటి వారి అభిమానం నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తుంది.