'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Dec 28, 2011

పాడుతా తీయగా

      సంగీత ప్రపంచంలోకి అభిమానులని తీసుకుని విహరింప చేస్తున్న కార్యక్రమం పాడుతా  తీయగా.  ఈ టీవీ లో ప్రతి సోమవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ ప్రోగ్రాం. 

     శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఈ ప్రోగ్రాంకి వాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. పార్తిసిపంట్స్ పాడే పాటలతో పాటు ఆ పాటతో తనకి కలిగిన అనుబంధాన్ని వివరిస్తూ ప్రేక్షకులని కట్టిపడేస్తున్నారు.

       అంతే కాదు ఈ కార్యక్రమంకి జడ్జీగ వచ్చిన వాళ్ళు సైతం ఆకట్టుకుంటున్నారు. ఈ వారం ప్రోగ్రాంకి వనమాలి గీత రచయిత విచ్చేసారు. తను రాసిన పాటల గురించి మాట్లాడారు. ఇంకా తను ఏ పాటకు కష్టపడ్డారో కూడా తెలియజేసారు. అయన తెలియ జేసినా పాటలలో నన్ను విశేషం గ ఆకట్టుకున్న పాట "నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే". ఈ పాట సిద్ధార్ద్ నటించిన "180 " చిత్రం లోనిది. ఈ పాట రాయడానికి వనమాలి గారికి నెల రోజులు పట్టిందట. ఇటువంటి పాటలకి అవార్డ్స్ రావాలని బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. 

 ఎంతైనా సంగీతమనే లోకంలోకి ఈ ప్రోగ్రాం ద్వార మనలాంటి ప్రేక్షకులని తీసుకెళుతూ మనకి ఆనందాన్ని కలిగింపచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారికి, ఈ టీవీ వారికీ మనందరి తరపున నా అభినందనలు. 

ప్రేక్షకుల స్పందన
"ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అన్నిటిలోకి మిన్న ఈ టీవీ వారి పాడుతా తీయగా" - సుభద్రా దేవి.

 

Dec 23, 2011

జై శ్రీకృష్ణ - అదుర్స్


జెమిని టీవీ లో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమవుతున్న జై శ్రీకృష్ణ సీరియల్ ఎంతో మంది అభిమానుల ఆదరాభిమానాలను పొందుతోంది. ప్రత్యేకించి ఈ సీరియల్ లో చెప్పుకోవలసిన విషయమేమిటంటే, ఇందులో నటించిన ద్రుతి భాటియా (చిన్ని కృష్ణుడు) అందరి మన్ననలు అందుకుంటోంది, చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటోంది.
 ప్రస్తుతం ఎవ్వరు మాట్లాడుకున్న ధృతి భాటియా గురించే మాట్లాడుకుంటున్నారు. అంతగా శ్రీకృష్ణుడి పాత్రలో ఆ అమ్మాయి లీనమైపోయింది.
రెండు సంవత్సరాల  పది నెలల ప్రాయంలోనే అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ టాక్ అఫ్ ది ఇండియన్ టెలివిజన్ అయ్యింది ధృతి. తను రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు షూటింగ్ లో పాల్గుంటుంది.
తను చాల అల్లరి పిల్ల అని, షూటింగ్ బ్రేక్ లో మస్తీ చేస్తుందని ఆమె తండ్రి చెబుతున్నారు.
అంత చిన్న వయసులో ఆమె అద్బుతమైన నటనను చుసిన వాళ్ళు పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతను గుర్తుచేసుకుంటున్నారు.
స్క్రిప్ట్ ను చదివి ధృతి కి అర్ధం అయ్యేటట్టు చెప్తాము అని ధృతి తండ్రి చెప్పారు.
దేవుడి దయ వల్లే తమ కూతురి ఇంత చిన్న వయసులోనే అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందని  అతను తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

ప్రేక్షకుల స్పందన
"చిన్నితెర మీద జై శ్రీకృష్ణ ఆధ్యాత్మిక విప్లవం. ఇందులో నటిస్తున్న కళాకారుల ప్రతిభ అనుపమానం అసమానం. చూస్తున్న కొద్ది చూడాలనిపించే కళా సృజనకు జోహారు" - నాగ సాయి రమ్య, సికింద్రాబాద్.Dec 22, 2011

ఇవాళ ఏమైందంటే...

నా లాంటి ప్రేక్షకులకి, ఇంకా టీవీ సీరియల్ వీరాభిమనులకి నా వందనాలు, అభివందనాలు.

ప్రతీ రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ టీవీ లో వచ్చే భార్యామణి సీరియల్ చూడక పోతే ఆ రోజు నాకు గడిచినట్టే ఉండదు. ఎందుకంటే అంతలా ఆ సీరియల్ లో లీనమైపోయనన్నమాట .
అందుకే ఇవాళ నేనొకటి డిసైడ్ అయ్యాను. అదేంటంటే, నా లాగే ఎంతో మంది ఎన్నో సీరియల్స్ కి అలాగే ప్రానాలిచ్చే వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి కదా. ఏమంటారు??  అలాంటి వాళ్ళు ఒక రోజు సీరియల్ ని మిస్సైతే ఇక అంతే సంగతి. ఆరోజు అన్నం తినాలనిపించదు, మొగుడితో మాట్లాడలనిపించదు.

కాబట్టి, సాటి సీరియల్ ప్రేక్షకులకి నేను చెప్పోచేదేంటంటే ఇవాల్టి నుంచి నేను చుసిన సీరియల్ లో ఇవాళ ఏం జరిగిందో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా మిస్ అయతే నా ఈ పోస్ట్ చదివి ఆనందించాలని కోరుకుంటున్నాను.

సదా టీవీ వీరాభిమానుల సేవలో మీ లాస్య.