'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Feb 26, 2012

మా ముద్దుల క్రిష్నయ్య మా చిన్ని క్రిష్నయ్యముద్దు ముద్దు మాటలతో 

చిట్టి చిట్టి చేష్టలతో 
వెన్న దొంగతనలతో 
గోపికల తో సరసాలతో 
మా ముద్దుల క్రిష్నయ్య మా చిన్ని క్రిష్నయ్య 


నీ వేణుగానం......
ఆహా ఎంత మధురం 
నా ప్రాణాలన్ని ఆ వేణుగానం లోనే ఉన్నాయయ్యా
వేణువైన కాకపోతిని కృష్ణుని ఉపిరి తగలగా నని 
ఎంతగానో విలపించితినయ్యా 
మా ముద్దుల క్రిష్నయ్య మా చిన్ని క్రిష్నయ్య 

చిరుప్రాయంలోనే యశోదకి 
నీ నోటిలో అండ పిండ బ్రహ్మాండాదులను చూపి ఆశ్చర్యచకితురాలిని చేసావు 
మా ముద్దుల క్రిష్నయ్య మా చిన్ని క్రిష్నయ్య నీ అల్లరి తగ్గించాలని 
యశోద నిను రాతికి కట్టేస్తే 
పాకురుకుంటూ వెళ్లి ఆ రాతితోనే 
రెండు చెట్లను డీ కొని మద్ది చెట్ల రూపంలో నున్న 
గంధర్వులకు శాపవిమోచనం కలిగించావు
మా ముద్దుల క్రిష్నయ్య మా చిన్ని క్రిష్నయ్య\

స్నేహమంటే గొప్పదని 
కుచేలుని అటుకులు సేవించితివి 
వారి బాధలను తీర్చితివి
మా ముద్దుల క్రిష్నయ్య మా చిన్ని క్రిష్నయ్య ప్రళయం వచ్చెను 
వ్రేపల్లె వాసులు భయం తో వనికెను
చిటికెన వేలితో ఎత్తావు గోవర్ధన గిరిని 
వ్రేపల్లె వాసులని ఆ గిరికిందకు చేర్చితివి 
అభయ హస్తం చూపితివి
మా ముద్దుల క్రిష్నయ్య మా చిన్ని క్రిష్నయ్య \
కాళీయుడి తలపై  నాట్యమాడిన తాండవ క్రిష్నయ్య

- లాస్య రామకృష్ణ 

Feb 25, 2012

బాబోయ్ ట్రాఫిక్ జామ్....


***అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని***

ఈ బిజీ బిజీ గజిబిజి లైఫ్ లో సరదాగా ఎంజాయ్ చెయ్యడానికి కూడా సమయం చాలటంలేదు. అలాంటి పరిస్తితిలో, మా అయన ఒక రోజు నన్ను బయటికి తీసుకెళ్ళి నాకు నచ్చిన గిఫ్ట్ కొంటానని అన్నారు. నేనెంతో సంతోషించాను. అయితే ఒక షరతు పెట్టారు. నాకు మూడు గంటలే టైం ఉంది. మళ్లి ఆఫీసు పని ఉంది అని చెప్పారు. అప్పుడు నాకు, మూడు గంటలు చాల ఎక్కువ టైం కదా, చక్కగా ఒక అరగంటలో నాకు నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే, మేము వెళ్ళాల్సిన షాప్ కూడా జస్ట్ ఒక పదిహేను నిమిషాల దూరం మాత్రమే.

నేను చాలా సంతోషం తో ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఎప్పుడూ రెడీ అవడానికి సుమారుగా గంట సమయం తీసుకునే నేను, పది నిమిషాలలో చక చకా రెడీ అయ్యాను. ఇద్దరం కలిసి బైక్ మిద బయలుదేరాము. 

మా కాలనీ నుండి లెఫ్ట్ కి తిరిగితే మెయిన్ రోడ్. అలా నేరుగా ఒక పది పదిహేను నిముషాలు వెళ్ళామంటే మేము వెళ్ళాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ వొచ్చేస్తుంది. ఇలా మెయిన్ రోడ్ ఎక్కమో లేదో ట్రాఫ్ఫిక్ . ఎటు చుసిన ట్రాఫ్ఫిక్ ట్రాఫ్ఫిక్...ఈ చివర నుండి ఆ చివర వరకు అదే. ట్రాఫ్ఫిక్ లో చాలా సేపు ఇరుక్కుపోయము. నా కైతే అనిపించింది, మేము నడచుకుని వెళ్ళినా ఈ పాటికి షాపింగ్ కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళం, నా చేతికి ఒక గిఫ్ట్ కూడా వచ్చేది అని. 

మెల్ల మెల్లగా మా వారు బైక్ నడుపుతున్నారు, ఇంకేముంది కొంచెం సేపే కదా వొచ్చేసా అని షాపింగ్ కాంప్లెక్స్ తో , నేను కొన్నుక్కోదల్చుకున్న వస్తువులతో మనసులో మాట్లాడుకుంటున్న.. ఇంతలో సడన్ గా మా బైక్  యు టర్న్ కొట్టింది... రయ్ అని  కళ్ళు ముసి తెరిచేంతలో మా ఇంటి ముందు ఉన్నాం... ఊ ఇంక దిగు అన్నారు మా అయన...ఇంకేం ఉంది. తర్వాత ఏమయి ఉంటుందో మీకిప్పటికే అర్దమయి ఉండుంటుంది. 

ఇందుగలదు అందులేదని సందేహము వలదు 
ఎందెందు వెతికినా అందందే కలదు

అని ట్రాఫ్ఫిక్ జామ్ గురించి పెద్దలు ఎప్పుడో చెప్పారు.

ఇంతకాలం  నేను ట్రాఫ్ఫిక్ జాం గురించి నేను ఇంతగా ఆలోచించలేదు. కానీ మొన్నటి సంఘటన వాళ్ళ ఆలోచించక తప్పట్లేదు.


- లాస్య రామకృష్ణ 

Feb 24, 2012

వయసెంత!!!
తండ్రి వయసు కొడుకు వయసుకు నాలుగు రెట్లు.

ముప్పై ఏళ్ల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. 

అయితే వారి ప్రస్తుత వయసులు చెప్పండి.Feb 19, 2012

వైద్యో నారాయణో "హరీ"

వైద్యులంటే దైవంతో సమానం. వైద్యవృత్తి చాలా గౌరవప్రదమైనది. హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు అందరు కొలిచే దైవం వైద్యుడు. ఇది ఒకప్పటి విషయం. 

వైద్యులంటే భయపడే రోజులు ఇవి. అదేదో సినిమాలో చూపెట్టినట్టు, చనిపోయిన శవానికి కూడా అన్ని రకాల పరిక్షలు చేసి "చాలా కష్టపడ్డాం కానీ బ్రతికించలేకపోయాం. ఫీజు కట్టెయ్యండి" అన్నట్టే ఉంది ఇప్పటి వైద్యుల పరిస్తితి.

నార్మల్ గా వచ్చే జ్వరానికి కూడా రక రకాల స్కాన్నింగ్లు గట్రా చేసి, బిల్లుని తడిసి మోపెడు చేసి రోగులను ఇబ్బంది పెడుతున్నారు.

ఇప్పటి కాలంలో డెడికేటింగ్ వైద్యులు లేరని నేననట్లేదు, కానీ అలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నారు. ఇది కొంచెం బాధాకరమైన స్థితి.

ఎన్నో ఉదాహరణలు నాకు తెలిసిన వాళ్ళు చెప్పినవి, నేను ప్రత్యక్షం గా చూసినవి ఉన్నాయి. 

జ్వరం వచ్చిందని వాళ్ళబ్బాయిని మా పక్కింటావిడ హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. ఆ అబ్బాయికి అయిదేళ్ళు. అదేదో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ అట. వెళ్ళగానే ఏదో ఫార్మ్ ఫిల్ అప్ చేయించుకున్నారు, అదేదో ఆపరేషన్ కి వీళ్ళు వెళ్ళినంత బిల్డ్ అప్  ఇస్తూ. తరవాత వీళ్ళని ఒక అయిదు నిముషాలు వెయిట్ చేయించి ఫలానా డాక్టర్ని కలవండి అని ఒక నర్స్ వీళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళింది. ఆ డాక్టర్ కనీసం ఎం జరిగింది అని కూడా అడగకుండా, తనదైన స్టైల్ లో తన కెరీర్లో నేర్చుకున్న టెస్ట్ లన్ని ఈ అబ్బాయి మీద ప్రయోగించాడు. ఇంతకీ తేల్చింది ఏమంటే ఇది సాధారణ జ్వరం, ఈ టాబ్లెట్స్ వాడండి అని.

బిల్లు ఎంతైందో ఇక వేరే చెప్పనక్కరలేదు....

ఇంకా లేడీ డాక్టర్స్ అంటారా, వీళ్ళ సంగతి వేరే చెప్పకర్లేదు. గర్భవతులకి అవసరం అయినా కాకపోయినా వారానికొకసారి, నెలకొకసారి స్కాన్నింగ్ చేయించుకోవాలంటారు. చేయించుకోకపోతే ఏమవుతుందోనని భయం సృష్టిస్తారు. నాకు తెలిసిన డాక్టర్ సర్కిల్ ద్వారా తెలిసిందేంటంటే, వీళ్ళు సూచించే ప్రతి టెస్ట్ కి వీళ్ళకి కొంత మొత్తం లో కమిషన్ ముడుతుంది. కొంత పెర్సెంటేజ్  అని ఫిక్స్ చేసుకుంటారు.

లక్షలు పోసి చదివాం అవన్నీ ఇలా రాబట్టుకుందాం అనే ఆలోచన లోంచి వైద్యులు బయటపడాలని కోరుకుంటున్నాను. అంటే విద్యావ్యవస్త కూడా పరోక్షం గా ఇలాంటి పరిస్తితికి కారణమేమో.....

వైద్యవృత్తిని దైవంగా భావించిన, భావిస్తున్న వైద్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.  


- లాస్య రామకృష్ణ
   

Feb 17, 2012

ఎంత గొప్పది ఈ జీవితం.......


"పుట్టినప్పుడు ఏడుస్తాం. మరణించినప్పుడు ఏడిపిస్తాం. ఈ రెండు ఏడుపుల మధ్య ఎంత మందిని నవ్వించాం అన్నదే జీవితం."

   టీవీ చూసినప్పుడు కరెంటు పోయినా, ఇష్టమైన సినిమా టికెట్స్ దొరకకపోయినా ఇదేం జీవితం రా అని నిట్టూర్చేవాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచం లో. ఒకసారి, ఏ అనాధాశ్రమానికో, కాన్సెర్ ఆసుపత్రికో వెళ్తే మన జీవితం ఎంత గొప్పదో మనకి అర్ధమవుతుంది. అప్పుడు పైవేవి కష్టాలు కావనిపిస్తాయి.

   ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు 'Outing'  పేరుతో రిసార్ట్స్ కి వాటికీ తీసుకెళుతున్నారు. వాటి బదులు ఇంతకూ ముందు చెప్పినట్టు ఏదైనా అనాధాశ్రమానికో, కాన్సెర్ ఆసుపత్రికో తీసుకెళ్ళి అక్కడి రోగులతో ఈ ఉద్యోగులకి సంభాషించే అవకాశం కలిగించాలి. అప్పుడు ఆఫీసు టెన్షన్స్ అని సూసైడ్ చేసుకునే వారు కొంచెం తగ్గుతారు. ఇంకా, టెన్షన్స్ ని తట్టుకునే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

ప్రాణం పై ఎవరికుంది హక్కు...

   ప్రేమ విఫలమై, పరీక్షా ఫెయిలయి ఇలా ఎన్నో కారణాల రీత్యా నేటి యువత ఆత్మహత్య వైపు మొగ్గుచుపుతున్నారు. దేవుడిచ్చిన అమూల్యమైన జీవితాన్ని అంతం చేసుకునే హక్కు ఎవరికీ లేదు.

   ఆ విషయానికి వస్తే "Mercy Killing" అనే ప్రక్రియ కొన్ని దేశాలలో ఆచరణలో ఉంది. నయం కాని జబ్బులున్న రోగులు, మాములు స్తితిలో లేని రోగులు చాలా ఇబ్బంది పడుతుంటే, డాక్టర్స్ మెడికల్ గా వారిని చంపేస్తారు. ఇది కూడా కొన్ని దేశాలలో నిషిద్దం. అంటే, ఎటువంటి స్థితిలో కూడా ఒక ప్రాణాని తీసే హక్కు ఎవరికీ లేదు. 

బ్రతుకు బ్రతికించు.........

   శరీరంలో ఏదో ఒక అవయవలోపం ఉండి కొందరు తమ జీవితాన్ని అస్వాదిస్తూ కూడా ఆపదలో ఉన్నవారికి సహాయపడేవారు ఉన్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారు కూడా జీవితంపై విరక్తితో జీవించేవారు ఉన్నారు. వీరిరువురి మధ్య తేడా ఆలోచన ధోరణి. బ్రతుకు, బ్రతికించు అన్న సూత్రాన్ని నమ్ముకుని సంతోషంగా ఉన్నవారు మొదటివారు. అవయవలోపం ఉన్నవారే పరులకు సాయపడుతున్నప్పుడు, అన్నీఉన్నవారు ఇంకెంత సాయపడగలరో ఆలోచించండి. అద్భుతాలే చేయగలరు. 

"చిత్రం" చేసిన చిత్రం.....

   ఒకానొక సినిమాలో ఏక్సిడెంట్లో ఒక కాలు పోగొట్టుకున్న అమ్మాయి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆ ఆసుపత్రిలోని నర్స్, ఆమె ఆలోచనా ధోరణిని ఒక 'Painting' చూపెట్టి మార్చేస్తుంది. ఆ 'Painting' లో ని అంశం ఏంటంటే, సముద్రం లో ని నీరు ఆకాశంలోకి ఆవిరి రూపం లోకి వెళ్లి మళ్లీ అదే నీరు మబ్బులలోంచి వర్షం రూపంలోకి కిందకి వస్తుంది. ఈ \painting ని వివరిస్తూ 'జీవిత పరమార్ధం అర్ధం చేసుకోవాలి. ఒక కాలు పోయింది అని నిరాశ పడిపోకు. ఇంకొక కాలు ఉండి కదా అని సంతోషించు. పరులకు సహాయం చేయి. వారి జీవితాలలో వెలుగులని నింపు. నీ జీవితమనే దీపంతో వీరే దీపాలను ఆరిపోకుండా కాపాడు" అంటుంది. అంతే , ఆ అమ్మాయి తన ఆత్మహత్య ఆలోచనని విరమించుకుంటుంది. 

మనసుంటే మార్గముంటుంది....

సహాయాన్నందించాలనే ఆలోచనకి వయసుతో సంబంధం లేదు అనడానికి ఈ అమ్మాయే ఉదాహరణ.

ఆ అమ్మాయి లో పాటలు పడే ప్రతిభ చాల అద్భుతంగా ఉంది. అతి చిన్న వయసులోంచే మ్యూజిక్ షోస్ లో పాటలుపాడి డబ్బులు సంపాదించేది. ఒకానొక సందర్భములో ఈ అమ్మాయి మనసును ఒక సంఘటన కదిలించింది. అప్పటినుంచి డొనేట్ చెయ్యడానికే పాటలు పాడేది. సహాయం చేసిన ప్రతి సరి ఒక బొమ్మ కొనేది. ఇప్పుడు తన దగ్గర 500 పైగా బొమ్మలు ఉన్నాయి.

డబ్బుతో సంబంధం లేదు 

కాదేది సహాయనికనర్హం అని రుజువు చేసాడు ఓంకారనాథ్ శర్మ. చిరుజీతగాడైన, పరుల గురించి అలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇతని గురించి ఇంతకూ ముందొకసారి నా బ్లాగ్ లో ప్రస్తావించాను. 

ఇంటింటికి తిరిగి "మీ ఇంట్లో మీరు జలుబుకో, జ్వరనికో మందులు తెచ్చుకుని ఉండుంటారు. మిగిలిపోయిన ఆ మందులు వేరే వారికి ఉపయోగపడతాయి. దయచేసి ఇవ్వండి". అని అడుగుతారు. ఎంతో మంది స్పందించి ఇతనికి మందులు ఇవ్వడం ప్రారంభించారు. వాటిని ఇంటికి తీసుకుని వచ్చి   Expire అవ్వని మందులని ఒక చోట చేర్చి ప్యాక్ చేసి అవసరార్డులకి పంచిపెడతారు. ఇలా ఎంతో మంది పేదల ప్రాణాలను ఇతను కాపాడారు.     

ఇలా, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇతరులకు ఉపయోగపడేలా జీవించాలనుకుంటూన్నప్పుడు, చిన్న చిన్న సమస్యలకు క్రుంగి పోయి జీవితాన్ని అంతం చేసుకోవాలనుకోవడం ఎంత వరకు సమంజసం. ఆంగ్లం లో ఓ కొటేషన్ ఉంది "Difficulties in your life do not come to destroy you, but help you realize your hidden potential" అని. 

అంటే "కష్టాలు మనల్ని నాశనం చెయ్యడానికి రావు. మనలో దాగి ఉన్న సామర్ధ్యాన్ని గుర్తుచెయ్యడానికే వస్తాయి " ఇది అక్షర సత్యం. - లాస్య రామకృష్ణ. 


Feb 12, 2012

అంతటి అల్ప సంతోషులండి అమ్మాయిలు......అర్ధమైందా????

చాలా మంది అబ్బాయిల అభిప్రాయం, చాలా ఖర్చు పెట్టి గిఫ్ట్ ఇస్తేనే అమ్మాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారని, కానీ అది వంద శాతం నిజం కాదు.

ప్రేమతో ఏ గిఫ్ట్ ఇచ్చిన తిరిగి అకాసమంతా ప్రేమను పంచే మంచి హృదయం అమ్మాయిలది.

సో ఈ "Valentines Day" సందర్భంగా అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి, భర్త తన భార్య కి వారి మదిని దోచే అందమైన గిఫ్ట్  ఇచ్చి వారి మెప్పు పొందండి.

ఇంకెందుకాలస్యం చదవండి మరి.....

ఎర్ర గులాబీలు
ప్రేమకు సంకేతం. గులాబికి ముల్లునట్టే ప్రేమను సఫలం చేసుకోవడానికి కష్టాలు ఉంటాయని ముందు చూపుతో వాటిని ఎదుర్కునే ధైర్యం ఇద్దరికీ రావాలని ఈ రోజా పువ్వును ప్రేమికులు సింబాలిక్ గా ఇచ్చుకుంటారు. 

గ్రీటింగ్ కార్డ్స్ అందమైన భావాలని అక్షరాలలో కూర్చి ప్రియురాలి మనసు దోచే సాధనం.

హార్ట్ షేప్డ్ పెండంట్
'నా హృదయం నీ చేతుల్లో ఉంది' అని అంతర్లీనంగా వివరించే హార్ట్ షేప్డ్ పెండంట్ ఇస్తే ఇంకా మీ ప్రేమకు చింతే లేదు.

డైరీ మిల్క్ చాకొలేట్


నీ ప్రేమలో నీ తీపినంత ఈ చాకొలేట్ లో నింపాను ప్రియా అనండి చాలు జీవితాంతం మీకు ప్రేమ రుచి చూపిస్తూనే ఉంటారు 

అంతటి అల్ప సంతోషులండి అమ్మాయిలు......అర్ధమైందా????

-లాస్య రామకృష్ణ

సండే స్పెషల్ - గోంగూర పచ్చడి

పండు మిరపకాయ - గోంగూర
కావలసినవి

పండు మిరపకాయ - 10
గోంగూర - 2 కట్టలు 
సెనగపప్పు - టీ స్పూను 
మినప్పప్పు - టీ స్పూను 
ఆవాలు - టీ స్పూను 
వెల్లుల్లి రెబ్బలు - ఆరు 
ఉల్లి తురుము - అరకప్పు 
నూనె - తగినంత 
ఉప్పు - సరిపడా 


తయారు చేసే విధానం

పండు మిరపకయల్ని శుభ్రంగా కడగాలి. తొడిమలు అలానే ఉంచి నిలువుగా చీల్చాలి. ఇప్పుడు ఓ గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి మిరపకాయలు వేసి ఉడికించాలి.

మిరపకాయలు ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసి అవే నీళ్ళల్లో గోంగూర వేసి ఉడికించాలి. 

గోంగూర ఉడికిన తర్వాత మిక్సీ లో మెత్తగా రుబ్బాలి.

బాణలిలో నునే వేసి కాగాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, వెల్లులి వేసి వేయించాలి. తరువాత ఉడికించిన పండు మిరపకాయలు వేసి బాగా కలపాలి. మిరపకాయలు విరిగిపోకుండా వేయించాలి. తరువాత మెత్తగా రుబ్బిన గోంగూర వేసి బాగా కలిపి ఉప్పు వేసి మరో రెండు నిముషాలు వేగనిచ్చి పచ్చి ఉల్లిపాయముక్కలు వేసి కలిపి దించాలి. 

- లాస్య రామకృష్ణ 


Feb 11, 2012

ఏ మాయ చేసావే .....


తను కోరుకున్నవన్నీ చేరినా ఏదో తెలియని లోటు అతని మనసుని వేధిస్తుంది. ఎంతగానో ఎదురుచూసిన కంపెనీలో ఉద్యోగం వస్తుంది, తన ప్రతిభకి గుర్తింపు వచ్చింది అయినా ఏదో తెలియని బాధ. 

ఉద్యోగ రిత్యా వేరు వేరు దేశాలలో ఉండాల్సి వచ్చినప్పుడు ఈ ప్రేమ అవీ ఇవీ కుదరవని ఇద్దరు విడిపోతారు. ఇతను వేరొక అమ్మాయి ప్రేమలో(ప్రేమ అనుకుంటాడు), ఆ అమ్మాయి వేరొకరి ప్రేమలో (ప్రేమ అనుకుంటుంది) పడతారు. 

ఆ అమ్మాయికి ఆ అబ్బాయితో పెళ్లి కుదురుతుంది. ఈ అబ్బాయికి కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఇద్దరి మనసులలో ఏదో బాధ. 

ఆ అమ్మాయి మీద అంతర్లీనంగా ఇతనికి ఉన్న ప్రేమే కారణమేమో... ఆ సందర్భంలోనే ఈ పాట.....

మణిశర్మ గారు స్వరాల ముత్యాలను ఏర్చి కుర్చీ ఒక చక్కటి హారాన్ని తయారుచేసారు. రహమాన్ గారు అద్భుతంగా రచించారు.   

ఈ పాట సాహిత్యం మీకోసం...

గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే 
అడుగు మెరుపులా మారే ఆనందమే విడదీ బంధమే 
ఎటువైపు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా మెరిసావే రంగుల్లోనా 
కలతీరే సమయానా అలనేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా
దారులన్ని నాతో పాటుగా ఉయలూగి  పాటే పాడగా 
నను వీడి కదలదు కాలమొక క్షణమైనా..

గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే 
అడుగు మెరుపులా మారే ఆనందమే విడదీ బంధమే 

ఎదలో ఆశలన్నీఎదిగే కళ్ళ ముందరే 
ఎగిరే ఉహలన్నీ నిజమై నన్ను చేరేలే
సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా
చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా 
చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటే వీణగా
చెలరేగి కదిలేను గాలి తరగలెపైన

అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే 
జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులనే
ఇవ్వాళ గుండె లో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుంది నీ  కల 
ఇన్నాలు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటే నువ్విలా 
నను నేను గెలిచిన ఒంటరిగ నిలిచానే...

గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే 
అడుగు మెరుపులా మారే ఆనందమే విడదీ బంధమే

ఈ పాటని చుడండి...


- లాస్య రామకృష్ణ       


Feb 10, 2012

మనసు మూగదే కానీ భాషుంది దానికి


"మనసు మూగదే కానీ భాషుంది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుంది అది". 

"మనసుగతి ఇంతే 
మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికి సుఖము లేదంతే"

"ఎక్కడ ఉన్న ఏమైనా, ఎవరికీ వారే వేరైనా 
నీ సుఖమే నే కోరుకున్న, నిను వీడి అందుకే వెళుతున్నా"

"చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు 
నీవు లేక దిక్కు లేని చుక్కలైనాము"


*   *   *   *   *   *


"నేనొక ప్రేమ పిపాసిని, నీ వొక ఆశ్రమవాసివి అనే భగ్న ప్రేమికుడి బాధనైన, తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము" అనే కొంటె ప్రేమికుడి చిలిపితనాన్నైన, 'అది ఒక ఇదిలే' లాంటి మత్తెక్కించే పాటలనైన రాయడానికి అత్రేయకి సాటిరారెవరు.

మనసు, ప్రేమ, జీవితం, విరహం లాంటి అంశాలను చాలా చిన్న పదాలతో ఎంతో బాగా వ్యక్తం చేసారు ఆత్రేయ. ఎక్కువ పాటలు మనసు మీదే రచించారు. అందుకే ఆయనకి మనసు కవి అని బిరుదు. 

ఆత్రేయ గురించి.... 

ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. అయన 7th May, 1921 లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన గోత్రం పేరునే కలం పేరుగా పెట్టుకున్నారు.

సినీ జీవితం...

"దీక్ష" అనే చిత్రం ద్వారా ఆత్రేయ సినీ జీవితం ప్రారంభమైంది. ఈ చిత్రం 1950 లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన రచించిన 'పోరా బాబు పో' పాటని పెండ్యాల నారాయణరావుగారు స్వరపరచగా, M.S. రామారావుగారు పాడారు.

'సంసారం' అనే చిత్రానికి ఆత్రేయ మొట్టమొదటి సారి స్క్రిప్ట్ వ్రాసారు. కేవలం పాటలకే పరిమితమవకుండా, మాటలు, దర్సకత్వం, నిర్మాణం లో కి కూడా ఆయన తనదైన ప్రతిభ చూపెట్టారు. 

1961 లో విడుదలైన "వాగ్దానం" చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. 

డాక్టరేట్....

తెలుగు సాహిత్యంలో ఆత్రేయ సేవని గుర్తించి డా.B.R.Ambedkar Open University వారు అత్రేయకి డాక్టరేట్ ని అందించారు.

విమర్శలు.....

ఆత్రేయ సమయానికి పాటలు ఇచ్చేవారు కాదని ప్రసిద్ది. అందుకే విమర్శకులు 'పాటలు రాయక నిర్మాతలని, రాసి ప్రేక్షకులని ఏడిపిస్తారు' అని అనేవారు. వాటికీ స్పందించిన ఆత్రేయ 'రాసేటప్పుడు నేనెంత ఏడుస్తానో ఎవరికీ తెలుసు' అని అనేవారు. 

"చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు నీవు లేక దిక్కు లేని చుక్కలైనాము"

13 Sep 1989 లో ఆత్రేయ మద్రాసులో కన్ను మూసారు. కానీ అతని పాటలు మాత్రం మనందరి హృదయాలలో  కలకాలం నిలిచి  ఉంటాయి.

- లాస్య రామకృష్ణ 


Feb 9, 2012

"Nothing's Gonna Change My Love For You"


నేను ఇటీవలే అనుకోకుండా ఒక ఇంగ్లీష్ సాంగ్ విన్నాను. ఆ పాట సాహిత్యం చాలా బాగుంది.

ప్రియుడు తన ప్రియురాలి నుంచి ఏం కోరుకుంటున్నాడో, ప్రియురాలి ఎడబాటుని ఎలా అనుభవిస్తాడో రచయిత చాలా చక్కగా చిన్న చిన్న పదాలతో వ్యక్తీకరించారు.ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ పాట మీకోసం...... ఇక్కడ క్లిక్ చెయ్యండి   Nothing's Gonna Change My Love For U

If I had to live my life without you near meThe days would all be emptyThe nights would seem so longWith you I see forever, oh, so clearlyI might have been in love beforeBut it never felt this strong
Our dreams are young and we both knowThey'll take us where we want to goHold me now, touch me nowI don't want to live without you
Our dreams are young and we both knowThey'll take us where we want to goHold me now, touch me nowI don't want to live without you
Nothing's gonna change my love for youYou oughta know by now how much I love youThe world may change my whole life throughBut nothing's gonna change my love for you
If the road ahead is not so easyOur love will lead the way for usLike a guiding starI'll be there for you if you should need meYou don't have to change a thingI love you just the way you are
So come with me and share the viewI'll help you see forever tooHold me now, touch me nowI don't want to live without you
Nothing's gonna change my love for youYou oughta know by now how much I love youThe world may change my whole life throughBut nothing's gonna change my love for
Nothing's gonna change my love for youYou oughta know by now how much I love youOne thing you can be sure ofI'll never ask for more than your love
Nothing's gonna change my love for youYou oughta know by now how much I love youThe world may change my whole life throughBut nothing's gonna change my love for
Nothing's gonna change my love for youYou oughta know by now how much I love youOne thing you can be sure ofI'll never ask for more than your love
Nothing's gonna change my love for youYou oughta know by now how much I love youThe world may change my whole life throughBut nothing's gonna change my love forNothing's gonna change my love for యు
-లాస్య రామకృష్ణ 
Feb 3, 2012

ఆమె ఎవరు???

ఏదైనా రాయాలి. గొప్పగా రాయాలి . మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలి. కానీ, ఏం రాయను. దేని గురించి రాయను. కలం ముందుకి కదలట్లేదే! 

లోకం అంతా ప్రశాంతం గా ఉంది. అదేంటో ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఎవరి మీద దుమ్మేత్తలేదు. ఏ హీరోయిన్ గురించి గాస్సిప్స్ రాలేదు. ఎక్కడా సెన్సేషనల్ న్యూస్ లేదు. అరెరే ఇలా అయితే ఎలా?

ఒకే, ఇలాంటి సమయంలోనే శ్రీ శ్రీ గారిని తలచుకోవాలి. అయన పుస్తకాలు ఎక్కువ చదవక పోయినా, పెద్దగా ప్రాచుర్యంలో ఉన్న ఒక డైలాగు నాకు గుర్తుంది. అదే "కాదేది కవిత కనర్హం'. 

అవును కదా. అదే నిజం. నేనేదో సెన్సేషనల్ రచయిత్రి కావాలంటే మాత్రం ఏదైనా పెద్ద కుంభకోణం బయట పడాలా? ఎవరైనా పెద్ద హీరో కూతురు లేచిపోవాలా? అవసరమే లేదు. నేను ఎవరనుకున్నారు? ప్రముఖ న్యూస్ చానెల్స్ ని రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రేక్షకురాలిని.
కాబట్టి ఏ విషయం లేని సంఘటనకైనా నేను ఎంతో సెన్సేషన్ ని క్రియ్యేట్ చేయగలను.

రాసేస్తున్నాను. కాస్కోండి.

"అక్కడొక సామాన్య మధ్య తరగతి మహిళా రోడ్డు మీద నడచుకుంటూ వెళుతోంది. చూసారా, మన ప్రభుత్వం తీరు. ఒక మధ్య తరగతి మహిళ మండుటెండలో నడచుకుంటూ వెళుతోంది. దీనికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. ఒక స్త్రీ మండుటెండలో నడచుకొని వెళ్ళడమా! ఎంత దిగజారిపోతోంది మన సమాజం. ఎక్కడికి వెళుతోంది ఈ లోకం. స్త్రీలకి గౌరవం ఇవ్వడం రాను రాను తగ్గిపోతున్న ఈ సమాజం లో ధైర్యం గా ఎలా బయటికి రా గలదు ఒక స్త్రీ. 

ప్రభుత్వం ఎన్నో బస్సులను లేడీస్ స్పెషల్ గా కేటాయించినా ఈవిడ  ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ప్రజలలో తగ్గిపోతున్న విలువలకి కారణం ఎవరు? ప్రజల అవసరాలకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడానికి కారణమెవరు? ఇదేనా స్త్రీకి మనమిచ్చే విలువ???"

మనలో మన మాట:- ఆవిడ కిరాణా షాపులోని సామాన్లు కొనుక్కొని పక్క వీధిలో నున్న తన ఇంటికి వెళుతోంది:-).

 - లాస్య రామకృష్ణ.