'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jul 31, 2013

మీ వ్యక్తిత్వం వల్ల కావచ్చు లేదా కొన్ని పోలికలు కలిసి ఉండటం వల్ల కావచ్చు. ఏదైనా విషయం లో మీరు ఎవరైనా సెలెబ్రిటీల తో పోల్చుకోవడం జరిగిందా?

ప్రతి మనిషికి తన గురించి ఎదుటివాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంటుంది. ఇది త్రివిక్రమ్ డైలాగు. 

ప్రతి మనిషి తనని ఎవరో ఒక సెలబ్రిటీ తో తప్పక పోల్చుకుంటారు - ఇది లాస్య డైలాగు. 


ఇంకెందుకాలస్యం చెప్పేయండి మరి. 

మీ వ్యక్తిత్వం వల్ల కావచ్చు లేదా కొన్ని పోలికలు కలిసి ఉండటం వల్ల కావచ్చు. ఏదైనా విషయం లో మీరు ఎవరైనా సెలెబ్రిటీల తో పోల్చుకోవడం జరిగిందా? మరి నాతొ చెప్పరూ. 


లాస్య రామకృష్ణ 

Jul 29, 2013

"స్వర్ణ కమలం" సినిమా లో కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు.


కళాతపస్వి విశ్వనాధ్ గారు దర్శకత్వం వహించిన సినిమా. మానవతా విలువలు ఏమాత్రం కనిపించని సినిమాలు వస్తున్న సమయం లో తెలుగుతనాన్ని, కమ్మదనాన్ని సినిమాలో చక్కగా వడ్డించిన గొప్ప దర్శకుడు. 

కాని స్వర్ణ కమలం సినిమా లో కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు. అసలు ఆ సినిమానే నచ్చలేదు. 

అంధుడైన ఒక గొప్ప నాట్యకారుడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి సంగీత సరస్వతి. చిన్నమ్మాయి ఆధునిక భావాలు కలిగిన యువతి. ఈ కళలు కడుపు నింపవు అనే ఆలోచన కలిగిన అమ్మాయి. ఒక విధంగా కళల పట్ల ద్వేషం పెంచుకున్న అమ్మాయి. 

అటువంటి అమ్మాయి ని బలవంతంగా నాట్యగత్తె గా మార్చాలని వెంకటేష్ విశ్వ ప్రయత్నం చేస్తాడు. సహజంగా ప్రతిభ ఉన్నవాళ్ళని ప్రోత్సహించడం లో తప్పు లేదు. కాని, ఆ అమ్మాయి కి వద్దు బాబోయ్ అన్నా ఏదో ఒక విధంగా ఆమెను నాట్యం వైపు మరల్చాడని ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని ఉద్దేశ్యం మంచిదే అయి ఉండవచ్చు, కానీ అతను డీల్ చేసిన విధానం సబబు గా లేదు. అనవసరంగా మధ్యలో భానుప్రియ తండ్రి మరణానికి కారకుడవుతాడు. 

కొన్ని కొన్ని సన్నివేశాలలో అయితే భానుప్రియని వేధించుకు తింటున్నాడు అనిపించింది. 

ఏంతో మంది పేద కళాకారులు ఎవరైనా తమని గుర్తించాలని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని  ప్రోత్సహించినా ఒక అర్ధం ఉండేది. 



- లాస్య రామకృష్ణ 



Jul 28, 2013

"నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ" అనే మధురమైన గానం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఎవరూ లేరు.



"నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ" అనే మధురమైన గానం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఎవరూ లేరు. నేనింకా ఆ జ్ఞాపకాలలోంచి బయటపడలేదని రొజూ నన్ను నిద్రలేపే ఈ పాట గుర్తుచేస్తోంది. అవును మన జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళని ఎలా మరచిపోతాము. నా ఈ జీవితమే ఆ తల్లి దయ. ఆవిడే శాంతమ్మ.


శాంతమ్మ.... శాంతమ్మ..... నా ఈ జీవితం ఆవిడ కృపే. ఏ జన్మ రుణానుబంధమో ఇది.

పూర్తి కథ చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 


లాస్య రామకృష్ణ 

Jul 26, 2013

మా ఇంట్లో చిలకలు

మా ఇంట్లో చిలకలు ఉండేవి. వాటితో నేను స్కూల్ నుండి రాగానే టైం పాస్ చేసేదానిని. అయితే వాటితో ఎంతో సంతోషంగా ఉన్నా వాటిని బంధించాను, ఆకాశం లో స్వేచ్చగా తిరిగే వాటిని ఎగరనీయకుండా చేసాను అని ఆలోచించలేని వయసు నాది. ఇంట్లో అమ్మా నాన్నా ఎంత చెప్పినా నా మొండి తనం వల్ల వాళ్ళ మాట వినకుండా నీను చిలుకల జంట ని కొనిపించుకున్నాను. వాటిని బాల్కనీలో ఉంచేవాళ్ళం. 

వాటికి నీతు, నిమ్మి అని పేర్లు పెట్టాను. కాని అందులో ఒకటి తీసుకువచ్చిన రెండో రోజే చనిపోయింది. ఆ తరువాత ఆ పంజరం లో ఉన్న రెండోది భయపడింది. అది భయం నుండి తేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. కాని త్వరగానే మాతో కలసిపోయింది. 

నేను, మా చెల్లి నీతూ తో కలిసి చక్కగా ఆడుకునేవాళ్ళం. 

కొంచెం అలవాటు అయిన తరువాత, నీతు ని ఇంట్లో పంజరం లోంచి వదిలేసేవాళ్ళం. కాని ఆశ్చర్యంగా అది పంజరం ని వెతుక్కుంటూ వెళ్ళిపోయేది. 

కొన్ని రోజుల తరువాత అది ఇంట్లో తిరగడం ప్రారంభించింది. నేను ఏదైనా తింటున్నప్పుడు అది నా పక్కగా చేరి అది కూడా తినేది. ఇడ్లీలు కూడా తినేది. 

అన్ని చిలుకలు జామ కాయలను ఇష్టం గా తింటూ ఉంటే, ఇది మాత్రం చిక్కుడుకాయలు, తోతాపురి మాంగో ఇష్టంగా తినేది. 

నా చేతి మీదకి ఎక్కించుకుంటే అది నా తల మీదకి ఎక్కి కూర్చునేది. అప్పుడు మా ఇంట్లో కెమెరా లేదు. 

కాని, ఒక రోజు నాకే అనిపించింది దాని స్వేచ్చని నేను బంధించానేమో అని. అందుకే, దానిని విడిచిపెట్టాలని అనుకున్నాను. అమ్మా, నాన్నా ఎంతో సంతోషించారు.  

దానిని వదిలేశాక నేను అది మళ్ళీ మా ఇంటికి నా కోసం వస్తుందేమో నని ఎదురుచూసాను. చిలుకల అరుపులు వినిపించినప్పుడల్లా నీతు వచ్చేసిందేమో నని అనిపించేది. అది మా ఇంట్లో ఉన్నది కొన్ని రోజులే అయినా దాంతో మాకు బాగా attachment ఉండేది. కాని దానిని పంజరం లోంచి పంపించేసినప్పుడు మాత్రం అది ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని అనుకున్నాను. 

- లాస్య రామకృష్ణ 

Jul 23, 2013

వాడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తో బాంగిల్ స్టాండ్



కావాల్సిన వస్తువులు 

1. వాడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ 
2. పాత క్యాలెండర్ 
3. ఇంట్లో దాచుకున్న గిఫ్ట్ వ్రాప్స్(నాకు గిఫ్ట్ వ్రాప్స్ ని దాచుకోవడం అలవాటు)

తయారు చెసే పద్దతి 

1. పాత క్యాలెండర్లో ని కొన్ని కాగితాలని తీసుకుని మూడు రోల్స్ గా చేసుకుని వాటికి గిఫ్ట్ వ్రాప్స్ ని చుట్టి సెల్లో టేప్ తో అతికించాలి 
2. ప్లాస్టిక్ బాటిల్ కి మూడు రంధ్రాలు చేసి, అందులో తయారుచేసుకోబడిన ఈ క్యాలెండర్ రోల్స్ ని అమర్చాలి 
3. ఆ తరువాత బాటిల్ ని మీకు నచ్చిన విధంగా పెయింట్ చేసుకోవచ్చు. నేను గ్లాస్ పెయింటింగ్స్ తో పెయింట్ వేసాను. 
3. బాంగిల్ స్టాండ్ రెడీ. అయితే, గాజులని మూడు వైపులా బాలన్స్ ఉందే విధంగా ఈ రోల్స్ లో అమర్చాలి 



- లాస్య రామకృష్ణ 

Jul 21, 2013

కామెడీ ఎంటర్టైనర్ ఘన్ చక్కర్


మరో ఇద్దరితో కలిసి హీరో బ్యాంకు దొంగతనానికి పాల్పడతాడు. డబ్బులు కలిగిన ఆ సూట్ కేసు ని మిగతా ఇద్దరు హీరో దగ్గర ఉంచి మూడు నెలల తరువాత పంచుకోవాలని అనుకుంటారు. ఆ తరువాత జరిగిన ఆక్సిడెంట్ తో హీరో గతాన్ని మరచిపోతాడు. 

గతం తిరిగి గుర్తుకు వచ్చిందా? ఆ సూట్ కేసుని హీరో ఎక్కడ దాచాడు. తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాలి.

లాస్య రామకృష్ణ  


Jul 20, 2013

lasya's kitchen

ఆహారం అనేది మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తినేది పంచభక్ష్య పరవాన్నాలు అయినా మామూలు భోజనం అయినా ఆస్వాదిస్తూ తింటే చక్కగా ఒంటబట్టి ఆరోగ్యంగా ఉంటాం. 

ఏదైనా సాధించాలన్నా మనం ఉసూరుమని నీరసంగా ఉంటే ఏమీ సాధించలేము. ఇంకా మనకే ఎవరో ఒకరు చాకిరీ చేయాల్సి వస్తుంది.

పూర్తి టపా కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

http://lasyaskitchen.blogspot.in/2013/07/blog-post_20.html


- లాస్య రామకృష్ణ 


Jul 17, 2013

ఒక వర్షపు సాయంత్రం



వర్షం లో 
ఈ సాయంత్రం 
నీతో కలిసి 
నా పయనం 
అందమైన చిత్రలేఖనం 




- లాస్య రామకృష్ణ  

Jul 15, 2013

రొమాంటిక్ లంచ్ కాస్తా టీం లంచ్ గా మారింది



సరదాగా అలా రెస్టారెంట్ కి వెళ్లి ఏదైనా తిందాం అని మా అయన నాతో చెప్పగానే ఎగిరి గెంతేసినంత పని చేసాను. వంట చెయ్యక్కర్లేదు అని నా సంతోషం. హాయిగా అలా బైక్ మీద ఒక చక్కటి రెస్టారెంట్ కి తీసుకెళ్ళారు. 

బయటి వ్యూ అందంగా కనిపించే మంచి లొకేషన్ లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఆర్డర్ ఇచ్చాం. సూప్ అస్సలు బాగోలేదు. సరేలే మెయిన్ కోర్స్ అయినా బాగుంటుందేమో అని ఆశావాదం. 

ఈలోపు 25 మంది కలిగిన ఒక టీం వాళ్ళు లంచ్ కి వచ్చారు. వాళ్ళ కి కూడా బయటి వ్యూ అందంగా ఉండే ఈ ప్లేస్ నచ్చిందట. వెయిటర్ మమ్మల్ని అడగకుండానే వాళ్ళతో "వాళ్ళు ఆ టేబుల్ కి షిఫ్ట్ అయిపోతారు" అని చెప్పాడు. కనీసం మాకు చెప్తే మేము వేరే టేబుల్ కి మూవ్ అవడానికి సిద్దంగానే ఉన్నాం. 

మమ్మల్ని అడగకుండా వాళ్ళకి చెప్పడం ఇంకా అలాగే వచ్చి నేను అప్పుడే తాగి టేబుల్ మీద పెట్టిన గ్లాస్ ని వేరే టేబుల్ కి మార్చేయడం చాలా చిరాకు కనిపించింది. అంత డబ్బులు ఖర్చుపెడితే, ఫుడ్ అస్సలు బాగోలేదు. In addition to that వాళ్ళ behaviour మాకు ఇరిటేషన్ కలిగించేలాగా ఉంది. 

 డెసిషన్ వాడే తీసేసుకుని మా దగ్గరికి వచ్చి అప్పుడు "మీరు ఆ టేబుల్ కి మారండి వాళ్ళ కోసం ఈ టేబుల్ కూడా జాయిన్ చెయ్యాలి" అని చెప్పాడు.

ఇక ఈ లంచ్ చాల్లే అనిపించింది నాకు. మా ఆయనకు చిరాకు వచ్చింది. బిల్ తీసుకురండి, మేము వెళ్లిపోతాము అని చెప్తే అప్పటికే సిద్దం చేసిన ఆర్డర్ వస్తే తప్పక వడ్డించాడు. ఆ టీం వాళ్ళు కూడా వేరే ప్లేస్ లో అడ్జస్ట్ అవడానికి ఒప్పుకోవట్లేదు. 

వాళ్ళకి కావలసినన్ని టేబుల్స్ ని అరేంజ్ చేస్తే మా టేబుల్ కి దగ్గరగా వచ్చారు. నా పక్కన ఆ టీం లో ఒక అమ్మాయి కూర్చుంటే మా ఆయన పక్కన కూడా ఒక అమ్మాయి కూర్చుంది. 

నాకు చాలా కోపం వచ్చింది. ఒక వైపు తింటూ మరొక వైపు మా ఆయన ని కోపంగా చూస్తున్నాను. సో మొత్తానికి మా రొమాంటిక్ లంచ్ టీం లంచ్ అయింది. 

- లాస్య రామకృష్ణ 

Jul 10, 2013

'బ్లాగులోకం' లోగో

'బ్లాగులోకం' లోగో ని మీ బ్లాగులో జతపరచుటకు దయచేసి ఈ లింక్ లో తెలియచేయబడిన కోడ్ ని మీ బ్లాగు లో జతపరచండి. 

మీ సహకారానికి ధన్యవాదములు 

లాస్య రామకృష్ణ