'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 29, 2013

పెదవులు పగడ కాంతులు

పెదవులు పగడ కాంతులు 
పలుకులు చెరుకు బంతులు 

నడకలు నెమలి గంతులు 
గల గల గలలు
కనులలో కోటి రంగులు

నడుములో మర ఫిరంగులు 

కురులలో జలధి పొంగులు 


 జల జల జలలు


 తన కొరకే కలవరమే 

 తన వరకే చెలి స్వరమే 

 తన దరికే 

నా ప్రాణమే ప్రయాణమే  - లాస్య రామకృష్ణ 


Mar 24, 2013

సగటు భార్య తన భర్త లో ఆశించే లక్షణాలు1. గొంతెమ్మ కోరికలు అడిగి భార్య ఎప్పుడూ భాధ పెట్టదు కాబట్టి అప్పుడప్పుడు అడిగిన డైమండ్ నెక్లెస్ లు తెచ్చిపెట్టాలి. 

2. రోజూ వంట చేసి అలసిపోతుంది కాబట్టి అప్పుడప్పుడూ భర్త తనే స్వయంగా వంట చేసి వడ్డించాలి.


3. షాపింగ్ లకి వెళ్ళినప్పుడు ఎటువంటి డిస్టర్బ్ఎన్స్ చెయ్యకుండా వీలయితే షాపింగ్ లో తోడ్పడాలి. అందుకే షాపింగ్ అని తెలియగానే ఉదయాన్నే తీసుకువెళ్ళాలి. 


4. అడిగినప్పుడల్లా పుట్టింటికి పంపించాలి. 


5. "ఏవండీ బయటికి తీసుకెళ్ళండి" అని అడగగానే ఆఫీసు కి సెలవు పెట్టినా సరే బయటికి తీసుకువెళ్ళాలి. 6. కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమాకి తీసుకువెళ్ళాలి. 


7. నెలకొక సారి కుదిరితే వారానికి ఒక సారి ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చెయ్యాలి. 


8. టీవీ చూస్తున్నప్పుడు అందులోనూ డైలీ సీరియల్ చూస్తున్నప్పుడు అస్సలు డిస్టర్బ్ చెయ్యకూడదు. 


ఇవి మచ్చుకు కొన్ని. ఇంకా భార్య భర్త లోంచి ఆశించేవి బోలెడు. ఇన్ బిల్ట్ టాలెంట్ తో ప్రోయాక్టివ్ గా భార్య మనసెరిగి దుసుకుపోవాలి మరి. 


- లాస్య రామకృష్ణ   Mar 19, 2013

రక రకాల ఐడియాలు ఇచ్చే అంజిగాడు, ఆ ఐడియాలు విని ఉహల్లొకి వెళ్ళిపోయే అమృతం

అమృతం 


అమృతం సీరియల్ గుర్తుందా? ఒకప్పుడు బుల్లితెరలో మన నట్టింట్లోకి వచ్చి మనందరికీ హాస్యామృతాన్ని పంచి ఇచ్చిన సీరియల్ ఇది. 


గుండు హనుమంతరావు, హర్షవర్ధన్ గొప్ప వినోదాన్ని పంచేవారు. 

వీరితో పాటు రాగిణి, సర్వం కూడా హాస్యాన్ని అందించడం లో తమ వంతు పాత్ర పోషించారు. 


ఈ సీరియల్ ప్రారంభం లో శివాజీరాజా టైటిల్ రోల్ పోషించేవాడు. ఆ తరువాత సీనియర్ హీరో నరేష్ ఆ స్థానాన్ని కొద్ది ఎపిసోడ్ల వరకు భర్తీ చేయ్యగలిగాడు. 

శివాజీ రాజా, ఝాన్సీ జోడితో కొన్ని ఎపిసోడ్లు నడిచాయి. అయితే వాళ్ళు ఈ సీరియల్ నుండి మాయమయి పక్క ఛానెల్ లో "ఆలస్యం అమృతం విషం" అనే ఇంకొక కామెడీ సీరియల్ లో ప్రత్యక్షమయ్యారు . అయితే ఆ సీరియల్ కామెడీ పండించడం లో విఫలమయింది. 

ఆ తరువాత హర్షవర్ధన్ టైటిల్ రోల్ పోషించేవాడు. 

ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన సీరియల్ అందులోనీ కామెడీ సీరియల్ లో మెయిన్ రోల్ లో కొత్తగా వచ్చి ప్రేక్షకుల అభిమానాలు పొందడం చాలా కష్టం. 

ఆ కష్టాన్ని సులభం గా అధిగమించాడు హర్శవర్ధన్. ప్రత్యేకమైన తన మేనరిజం తో అమృతం పాత్రలో జీవించాడు. 

ఇక అంజిగాడు అలియాస్ ఆంజనేయులు పాత్ర పోషించిన గుండు హనుమంతరావు విషయానికి వస్తే అతనికి సరైన గుర్తింపు ఈ సీరియల్ ద్వారా కలిగిందనే చెప్పాలి. 

ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ అప్పాజీ. 

రక రకాల ఐడియాలు ఇచ్చే అంజిగాడు, ఆ ఐడియాలు విని ఉహల్లొకి వెళ్ళిపోయే అమృతం, చివరికి ఆ అయిడియాలు విఫలమవ్వడం. 

అప్పుడప్పుడు నేను యుట్యూబ్ లో ఈ సీరియల్ చూస్తూ ఉంటాను. 

ఆనందానికి మించి భోగం ఏమి లేదు కదా. 

మీ కోసం కొంచెం అమృతం, అమృతం రుచి చుడాలంటే వీటిని క్లిక్ చెయ్యండి. 


- లాస్య రామకృష్ణ 

Mar 14, 2013

మహంకాళి మూవీ రివ్యూ !!!???

మహంకాళి 

హీరో - రాజశేఖర్ 

రేటింగ్ - 0/5

కథ 

హీరో రాజశేఖర్ రెండు చేతులలో పిస్టల్స్ తో విలన్స్ ని షూట్ చేస్తూ ఉంటాడు. ఎవరినీ అరెస్ట్ చెయ్యడు. కేవలం షూట్ చేస్తూ చంపుతూ ఉంటాడు. 


విలన్ ప్రదీప్ రావత్ విదేశాలలో ఉంటాడు. రాజశేఖర్ చేతిలో చావడానికి క్లైమాక్స్ లో ఇండియా కి వస్తాడు. 

వీళ్ళిద్దరి మధ్య ఏమైంది. కథ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ధైర్యం చేసి టికెట్ కొనుక్కుని వెళ్ళండి 


పెర్ఫార్మన్స్ 

ప్రదీప్ రావత్ విదేశాలలో ఉండే ప్రతినాయకుడు. విదేశాలలో ఉండే వాడిలా అతని గెట్ అప్ లేదు. చాలా చీప్ గా, ఒక  వీధి రౌడీ లాగా కనిపిస్తాడు. 

మ్యూజిక్ డైరెక్టర్ కి ఏం చెప్పి మ్యూజిక్ కంపోజ్ చేయ్యమన్నారో ఎవరికీ అర్ధం కాదు. విచిత్రమైన ధ్వనులు ధియేటర్ లో వినిపిస్తాయి. వీటికి తోడు మధ్య మధ్య లో భయంకరంగా వినపడే "మహంకాళీ" అనే శబ్దాలు ధియేటర్ లో కనీసం కునుకు తీద్దామనుకున్న ప్రేక్షకులని హడలగొట్టి నిద్రలేపుతాయి. 


హైలైట్స్ 

అంటే ఏంటి 

డ్రా బాక్స్ 

వేరే చెప్పాలా 

హెచ్చరిక - మహంకాళి ది పనిషెర్..... అర్ధమైందా !!!!
- లాస్య రామకృష్ణ 

Mar 13, 2013

ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇలా కూడా తెలుపుతారా?


ప్రేక్షకులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని ఒక సీరియల్ (కాంచన గంగ - మా టీవీ) కింద స్క్రోల్ అవుతోంది. అప్పుడు సీరియల్ లో ప్రసారమవుతున్న సన్నివేశం తన బర్త్ డే ఫంక్షన్ లో భర్త తన భార్య ని చెంపచెళ్ళుమనేల కొట్టడం. 


కనీసం ఉమెన్స్ డే రోజునైనా పగలు, ప్రతీకారాలు, కుట్రలు ఇవన్నీ పక్కన పెట్టి ఆహ్లాదకరంగా ఒక ఎపిసోడ్ ని ప్రసారం చెయ్యవచ్చు కదా!

బై డిఫాల్ట్ వాళ్ళు అలా డైరెక్ట్ చెయ్యడం అలవాటు పడ్డారేమో???
ఇలాంటి సీరియల్స్ యుగం లో కూడా కామెడీ పండించడానికి ప్రయత్నిస్తూ "గంగతో రాంబాబు" అనే సీరియల్ ని ఇంటూరి ఇన్నోవేషన్స్ బ్యానర్ పై వాసు ఇంటూరి దర్శకత్వం వహిస్తున్నాడు. 

వాసు ఇంటూరి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. 


అమృతం సీరియల్ లో "సర్వం" గా ప్రసిద్ది చెందిన నటుడు. 

ఈ సీరియల్ అమృతం రేంజ్ లో లేకపోయినా పగలు, ప్రతీకారాలు పంధాని పక్కన పెట్టి హాస్య రసాన్ని ప్రధానంగా తీసుకున్నందువల్ల వాసు ఇంటూరి ని ప్రశంసించకుండా ఉండలేము. 

- లాస్య రామకృష్ణ ఉగాది కవితల పోటీ వివరాలు

నమస్కారం,

ప్రియమైన తెలుగు బ్లాగర్లు అందరికీ నమస్సుమాంజలి. ఉగాది పర్వదినం సందర్భంగా 'బ్లాగులోకం' లో ఉగాది కవితల పోటీ నిర్వహించదలిచాము. 
పోటీ వివరాలు

ఉగాది కవితల పోటికి తెలుగు లో బ్లాగు నడుపుతున్న ప్రతి ఒక్కరు అర్హులే.

1.'ఉగాది అప్పుడు ఇప్పుడు' లేదా 'ఉగాది' అనే అంశాలపై కవితలని ఉగాది కవితల పోటీకి ఆహ్వానిస్తున్నాం.
2.కవిత కనీసం పది లైన్లు కలిగి ఉండాలి.
3.ప్రచురితం కాని కవితలనే పంపవలెను.
4.ఒక్కొక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చు. 
5.ఉగాది రోజున విజేతలను ప్రకటిస్తాం.
6.పోటీ కి వచ్చిన కవితల క్రెడిట్ ని ఆ రచయిత లేదా రచయిత్రులకి ఇస్తూ వీలువెంబడి ఆ కవితలను 'బ్లాగ్ లోకం' లో ప్రచురిస్తాము.
7.మీ కవితలను 'lasyaramakrishna@gmail.com' కి ఇ-మెయిల్ చెయ్యాలి.
8. మీ కవితతో పాటు మీ పేరు, మీ బ్లాగ్ లింక్ మరియు మీ పరిచయం పంపించాలి. ఇష్టమైతే పాస్ పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్ కూడా పంపించవచ్చు.
9. పోటీ కి వచ్చిన కవితలలో అర్హత పొందినవి రచయిత పరిచయంతో  బ్లాగ్ లోకం లో ప్రచురించడం జరుగుతుంది. 
10. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.
11.బహుమతుల వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
12. ఈ పోటిలో పాల్గొనడానికి చివరి తేదీ March 15, 2013. 15 మార్చ్ 2013 సాయంత్రం 6.00 (భారతీయ కాలమానం ప్రకారం) ఈ పోటీ ముగుస్తుంది. 

త్వరపడండి మరి......

ధన్యవాదాలు
లాస్య రామకృష్ణ