'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 31, 2012

మీరు వేసవిని ప్రేమిస్తారు



వేసవి హడావిడి మొదలైంది. ఎటు చూసినా వేడి గాలులు, ఒళ్ళంతా చెమట ఇవన్ని మనల్ని కొంచెం ఇబ్బంది  పెడుతున్నాయి. వేసవి కాలం వచ్చిందని చెప్పి మన రోజువారీ పనులనుండి తప్పించుకోలేం కదా. అందుకే, కొన్ని జాగ్రత్తలతో మనల్ని మనం ఎండ బాధ నుండి రక్షించుకుందాం.


1 . డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి తగినంత నీరు తీసుకోవాలి. 
2 . ఇంకా తాజా పళ్ళ రసాలు తెసుకోవాలి.

3 . స్పైసీ పదార్ధాలని తీసుకోవడం తగ్గించుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అజిర్నమయ్యే అవకాశం ఉంది. 

4 . భోజనం తీసుకున్న వెంటనే గ్లాసుడు మజ్జిగ తాగడం ద్వారా చల్లగా, హాయిగా ఉంటుంది. 

5 . సమయం దొరికినప్పుడల్లా, ముఖాన్ని, అరికాళ్ళ ని శుబ్రం చేసుకోవాలి.

6 . వేసవి కాలం లో పెరుగుకి ప్రాముఖ్యత\ ఇవ్వాలి.

7 . ఎండ లోంచి ఇంటికి రాగానే చల్లటి నీళ్ళు వెంటనే త్రాగకూడదు. కొంచెం సేపు ఫ్యాన్ కింద రిలాక్ష్ అయ్యాక, కుండలో నీళ్ళు త్రాగితే మంచిది. కుండలో నీళ్ళు చల్ల గ ఉండడానికి తడి టవల్ ని కుండ చుట్టూ కట్టాలి. 

8. వీలైనంత వరకు ఎండనుండి తలని, ముఖాన్ని కవర్ చేసుకోవడానికి గోడుగుని తప్పనిసరిగా వాడండి.

   
విన్నపం:- ఎన్నో ప్రాణులు కూడా మనలాగే ఎండ బాధకి ఇబ్బందులు పడుతూ ఉంటాయి. పక్షులైతే నీరు దొరకక చనిపోయే ప్రమాదం ఉంది. మీ బాల్కనీలో లేదా ఇంటి ముంగిట పక్షుల కోసం కొంచెం నీటి ని ఏర్పాటు చెయ్యండి. వీలైతే, దారిన పోయే దాహార్తుల కోసం కూడా మంచి నీటిని ఏర్పాటు చెయ్యండి. దాహం తీరిస్తే కాశి కి వెళ్ళినంత పుణ్యం అని పెద్దలు చెప్పారు కూడా....

ఇలా చేస్తే మీరు  వేసవిని  ప్రేమిస్తారు :-).

పొడుపు కథ



ప్రశ్న:-  అందరికి ఒకే కొడుకు, ఒకే కూతురు 

Mar 30, 2012

కాని ఒక ట్విస్ట్....



ఈ మధ్యన నేను చూసిన సినిమాలలో నాకు బాగా నచ్చిన చిత్రం బాడీగార్డ్ హిందీ వెర్షన్. ఈ సినిమాని తెలుగులో వెంకటేష్, త్రిషలతో కూడా తీసారట. 

తిరుపతి నుండి రిటర్న్ వస్తున్నప్పుడు బస్సులో బాడీగార్డ్ హిందీ వెర్షన్ సి డి ప్లే చేసారు. ఈ సినిమా ఆద్యంతం చాలా ఆకట్టుకుంది. ఎక్కడా బోర్ కొట్టలేదు. సల్మాన్ ఖాన్ హుందాగా నటించాడు. కరీనా కపూర్ తన చలాకి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈ చిత్రానికి హైలైట్ సంగీతం.

సంగీతం గురించి మాట్లాడవలసి వస్తే ముందుగ చెప్పుకోవలసింది 'teri meri' అనే పాట గురించి. ఈ పాట ఒక అద్బుతం. చిత్రీకరణ పరంగా కానీ, సంగిత పరంగా కానీ ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ మధ్య ఎక్కడా విన్నా ఈ పాటే వినిపిస్తుంది.



కానీ ఒక ట్విస్ట్, సినిమా క్లైమాక్స్ లో ఉండగా సల్మాన్ ఖాన్, తన ప్రియురాలు చాయ కోసం రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు మేము దిగాల్సిన బస్సు స్టాప్ వచ్చింది. 

అదన్న మాట సంగతి :-(

సలహా కావాలి !!!

Dear Bloggers,

నేను "Accounts" గురించి రన్ చేస్తున్న బ్లాగ్ "http://allisaccounting.blogspot.in". నాకు ఇంగ్లీష్ బ్లాగ్ aggregators గురించి తెలుపగలరు.

ధన్యవాదములు 
లాస్య రామకృష్ణ 


Mar 25, 2012

గుర్తుపట్టండి చూద్దాం !!!





నేనెవరో గుర్తుపట్టండి చూద్దాం. నేను మీ అందరికి నచ్చిన చిత్రాలలో నటించాను, నటిస్తున్నాను. (వర్షం అంటే నాకు చాలా ఇష్టం)

Mar 18, 2012

నా కలల వాకిటిని

నా కలల వాకిటిని
కన్నీటితో అలికి 
కాటుకతో ముగ్గేసి 
నీకోసం వేచాను ప్రియా


- లాస్య రామకృష్ణ 

Mar 4, 2012

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) - 1000 ఉపాధి అవకాశాలు - పరీక్షా తేది 29th April, 2012.


Name of the Post - Assistants (1000 Vacancies) 


Apply online

అర్హతలు : - 

1. ఏదైనా డిగ్రీ కనీసం 50% మార్కులతో ఉత్తీర్నులయ్యి ఉండడం.
2. వర్డ్  ప్రోసెస్సింగ్  తెలిసుండడం
౩. 28 ఏళ్లు దాటి ఉండక పోవడం (1st Mar, 2012 నాటికి)

Important Dates for recruitment in Reserve Bank of India
·         Opening date for online submission of applications/ Payment of fees at Bank Branches: 1 March 2012
·         Last date for online submission of applications: 25 March 2012
·         Closing date for Payment of fees at Bank Branches: 27 March 2012
·         Last date for making modification in the online application: 27 March 2012
·         Last date for E-receipt reprint: 10 April 2012
·         Date for Written Test: 29 April 2012, Sunday
·         Date for Declaration of Written Result: Mid June 2012

Eligibility Criteria for recruitment in Reserve Bank of India
Educational Qualification: At least a Bachelor's Degree in any discipline with a minimum of 50% marks (pass class for SC/ ST/ PWD candidates) in the aggregate and the knowledge of word processing on PC.
Age limit (as on 1 March 2012): Maximum 28 years
Pay Scale: basic pay of Rs 8,860 per month (i.e. Rs 8,040 plus two advance increments admissible to graduates only) in the scale of Rs 8,040 - 410 - 9270 - 500 - 11,270 - 550 - 13,470 - 650 - 15,420 - 720 - 16,140 - 990 - 20,100 (20 years) and other allowances, viz. Dearness Allowance, House Rent Allowance, City Compensatory Allowance, Transport Allowance etc., as admissible from time to time. At present, initial monthly Gross emoluments for Assistants is approximately Rs 19,340. The total CTC of the candidate works out at the minimum to Rs 2,63,500 per annum.
Selection Procedure for recruitment in Reserve Bank of India: The selection procedure will comprise of Written Examination and interview. The Written Examination (WE) will be of 200 marks and will consist of 5 Objective Tests which includes the following.
·         Test of Reasoning (40 marks)
·         Test of English Language (40 marks)
·         Test of Numerical Ability (40 marks)
·         Test of General Awareness (40 marks)
·         Test of Computer Knowledge (40 marks)
Application Fee: Application fee for General and OBC category candidate is Rs 385 and no fee will be charged from candidates belonging to SC/ ST/ PWD category.
Fee is payable in the form of Online Payment (by using MASTER/VISA debit/ credit cards or Internet Banking)/ Fee Payment Challan by Demand Draft favouring Reserve Bank of India and payable at Mumbai only. However, candidates from un-banked at any branch of any one of the banks, viz. Bank of Baroda/ Bank of India/ Indian Overseas Bank/ Central Bank of India/ Punjab National Bank/ United Bank of India. The payment of fees will be accepted from 2nd working day after registration and can be made within three working days at any branch of the above mentioned banks.
వివరాలకు www.rbi.org.in



Mar 3, 2012

ప్రేమా నీ స్వభావమేంటి....


- లాస్య రామకృష్ణ 


ఎవ్వరినీ నొప్పించదు
ఎవ్వరినీ విసిగించదు

నీ సుఖమే నే కొరుకున్నా
నిను వీడి అందుకె వెళుతున్నా

అంటుందే కానీ యాసిడ్ దాడులు చేయదు
ఆయుధాలను చూపించి బెదరగొట్టదు 

నేనున్నాను అంటుంది ప్రేమ 
మానవత్వం గొప్పదంటుంది ప్రేమ

పసిపిల్లల నవ్వులలో 
చందమామలా చల్లని జాబిలి కురిపిస్తుంది

టేనేజీ అమ్మాయి నవ్వులలో 
నెలవంకలా కవ్విస్తుంది 

నీ మనసు ప్రేమమయం అయితే
జగమంతా ప్రేమమయం....