'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 19, 2015

డోంట్ వర్రీ...బి హ్యాపీ


కొన్నిసార్లు మనం చాలా నిరాశకు, నిస్పృహకు లోనయ్యే పరిస్థితి ఎదురవవచ్చు. లైఫ్ అంటేనే కష్టసుఖాల కలయిక. అలాంటప్పుడు దేవుడిని తలచుకుని మన చుట్టూ ఉన్న సూపర్ నేచురల్ పవర్ మనకెప్పుడూ పాజిటివ్ ఎనర్జీని పంపిస్తుంది అని బలంగా నమ్మి రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే, మనం బాధపడితే ప్రయోజనం ఉండదు. బాధపడితే మన టైం వెస్ట్ అవుతుంది. పరిస్థితిని ఇంకా బెటర్ గా తీర్చిదిద్దుకునే విలువైన సమయాన్ని అలాగే అవకాశాన్ని కోల్పోతాము. కరిగిపోయిన కాలాన్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. కాలం మన చేతిలో నున్న విలువైన ఆస్తి. దానిని సవ్యంగా ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దు. ఇప్పుడు నాకొక కోట్ గుర్తుకొస్తోంది. 'పరిస్థితులు అనుకూలంగా లేవని ఏడుస్తూ కూర్చుంటే కన్నీరు మబ్బుతెరలతో ఎదురుగానున్న అవకాశాలను గుర్తించడం కష్టం'. 


అన్నం పరబ్రహ్మ స్వరూపం


అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆహారాన్ని మనం దైవంలా భావించి స్వీకరించాలి. కాని, ఒక్కొక్కసారి తిండిపట్ల కొందరు చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధేస్తుంది. హోటల్స్ లో ఎక్కువ ఆర్డర్ చేయడం అవి తినలేక వదిలేయడం. మన దేశంలో ఇలాంటివి చాలా కామన్ అయిపొయింది. కాని, జర్మనీలో ఇలాంటివి జరిగితే ఫైన్ వేస్తారట. సో, ఆ పద్దతి ఇండియాకు కూడా వస్తే బాగుంటుంది. 'మన డబ్బుతో మనం ఆర్డర్ చేస్తే ఫైన్ ఎందుకు వేస్తారు' అని అనుకోవచ్చు. అయితే, డబ్బు మనదైనా వనరులు అందరివీ. వనరులను వేస్ట్ చేయడానికి డబ్బును కురిపిస్తే ఎవరూ ఒప్పుకోరు. అన్నపూర్ణా దేవి కరుణిస్తూ ఉండాలంటే ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఒక్కసారి ఆవిడకు ఆగ్రహం వస్తే మన దగ్గర ఎంత డబ్బున్నా ఆహరం మాత్రం అందుబాటులో ఉండదు. అన్నపూర్ణా దేవి అనుగ్రహం అందరి మీదా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.