'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Sep 30, 2012

రాజకీయ జాతర

ప్రచురణ - ఆంధ్రభూమి వారపత్రిక 

రచన - పి వి డి ఎస్ ప్రకాష్ 

ఎడతెరిపి లేని పొలిటికల్ జాతర 
ఇక్కడ విలువలన్నీ నిలువునా పాతర 
నేతలు కళ్ళప్పగించి చూస్తే సరా ...?
ఇపుడు డెమోక్రసీకి కావాలి ఓ ఆసరా!

ఒక్కో లీడరు మేకప్పేసుకొని యాక్టరు 
కేరెక్టర్ ని డిజైన్ చేసుకునే డైరెక్టరు 
అతగాడే స్క్రిప్ట్, డైలాగ్స్ రాసే రైటరు 
ఆ ఎపిసోడ్లను డైలీ చూసే వ్యూయర్...పాపం ఓటరు 

జనం కోసమంటూ డై'లాగుడు'
మైకు కనిపిస్తే మాత్రం చెడుగుడు 
మాటలతో మభ్యపెట్టే మాయగాడు 
నాలిక మడతపడినా తొణకడు బెణకడు

రాజకీయం వాడి బాబు సొత్తు 
వారసత్వమే పోలిట్రిక్స్ యావత్తు 
అందుకోసం గొంగళి పురుగులతో కూడా పొత్తు 
'సీతాకోక'లు మారకుండానే ఎత్తు పైఎత్తులతో చిత్తు చిత్తు

పూటకో మాట... రోజుకో వేషం 
మెగాస్టార్ లను దగాస్టార్ లుగా మార్చే వైనం 
పదవుల కోసం తిట్టినపార్టిల్లోనే విలీనమ్ 
ఏదోలా పబ్బం గడుపుకోవడమే దారుణం 

సమ్మెలు ఘోరావ్ లు బందులు...
జనాల్ని పీల్చి పిప్పి చేసే రాబందులు !
అడుగడుక్కీ ఇవే ఇబ్బందులు 
ఖాకీ బూట్ల కవాతులు, లాఠీల చిందులు 

- లాస్య రామకృష్ణ 

Sep 29, 2012

"మనసే మనిషికి శత్రువా"

ఈ మధ్యనే టి వి లో ఒక సీరియల్ యాడ్ చూసాను. 

"మనసే మనిషికి శత్రువా"  అనే కాప్షన్ తో సా........గుతుంది సీరియల్.

అయితే ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. 

ముఖ్య పాత్రధారిణి (ఆవిడ పేరు తెలియదు), నాగేంద్రబాబు భార్య పాత్ర పోషిస్తున్న ఆవిడ నటన చూస్తుంటే మాత్రం తెగ నవ్వొస్తుంది. కామెడీ రోల్ అనుకునేరు, కాదు చాలా సీరియస్ రోల్.

ప్రోమోస్ లో కొన్ని సన్నివేశాలలో డైలాగు

"ప్రేమంతా మికే పంచాలా నేను పంచను" అనే డైలాగుని ఆవిడ చెప్పిన రీతి చుస్తే  జన్మలో మరచిపోలేరు.

- లాస్య రామకృష్ణ 


Sep 28, 2012

రేపే ఉత్తమ టపా విడుదల ....

రేపే ఉత్తమ టపా విడుదల ....

ప్రతి శనివారం ఉత్తమ టపా తో అలరిస్తున్న బ్లాగ్లోకం మరొక ఉత్తమ టపా తో మీ ముందుకొస్తోంది....

                                                                                                                                      - లాస్య రామకృష్ణ 


Sep 26, 2012

భారత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

భారత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

- లాస్య రామకృష్ణ 

Sep 25, 2012

దయచేసి తెలియజేయగలరు


బ్లాగు లోకం లో నాకు నచ్చిన బ్లాగులని జతపరిచాను. కానీ నేను చదవని బ్లాగులు మంచివి చాలా ఉన్నాయి. దయచేసి వాటి గురించి నాకు కామెంట్స్ లో అయిన లేక మెయిల్ (lasyaramakrishna@gmail.com) ద్వారా అయినా తెలియజేయగలరు.


- లాస్య రామకృష్ణ 

Sep 23, 2012

అబ్రకదబ్ర.....

మేజిక్ - మనల్ని మంత్రముగ్దుల్ని చేసి ఆశ్చర్యానుభూతుల్ని  కలిగింపచేసే కళ.

ఒక టేబుల్ మిద పడుకున్న అమ్మాయిని సడన్ గా గాలిలోకి తేలి పోయేలా ప్రేక్షకులని భ్రమింపచేయ్యడం, ఒక అమ్మాయిని ఒక డబ్బాలో పడుకోబెట్టి ఆ డబ్బాని సగానికి కట్ చెయ్యడం లాంటివి చూసినప్పుడు, మేజిక్ అంటే కనికట్టు అని తెలిసినా నేను మెజీషియన్ కి ఏవో అద్బుత విద్యలు, అతీత శక్తులు తెలుసు అని కొన్నాళ్ళ వరకు అనుకుంటూ ఉండేదాన్ని.

ఎందుకో ఇవి ట్రిక్స్ మాత్రమే అని నమ్మశక్యంగా అనిపించేది కాదు. 

ఒకసారి అనుకోకుండా "మేజిక్ సీక్రెట్స్ రివీల్డ్ " అనే ప్రోగ్రాం "AXN" ఛానల్ లో చూసాను. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం. ముందుగా మనకి ఒక మేజిక్ ని చూపెట్టి, ఆ తర్వాత ఆ మేజిక్ వెనుక రహస్యాలు, కిటుకులు మనకు వివరిస్తారు. కానీ మెజీషియన్ ఎప్పుడు మాస్క్ లో నే కనిపిస్తాడు. ఎందుకంటే, ఇటువంటి సీక్రెట్స్ తెలియచేస్తున్నారని తెలిస్తే వారిని మెజీషియన్ కమ్యూనిటీ నుండి బహిష్కరిస్తారు.

ఒక మేజిక్ సిక్రెట్ ని మీరు చుడండి మరి ...- లాస్య రామకృష్ణ 


Sep 20, 2012

గీతా సారాంశం

అయ్యిందేదో మంచికే అయ్యింది.
అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది.
అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతోంది.
నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్?
నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్?
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది.
నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడ నుండే పొందావు.
ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. 
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా,
నిన్న ఇంకొకరి సొంతం కదా,
మరి రేపు మరొకరి సొంతం కాగలదు.
పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ.

GEETA SAAR - "THE ESSENCE OF GEETA"


Whatever happened, it happened for good
Whatever is happening, it is happening for good
Whatever that will happen, it will be for good

What have you lost for which you cry?
What did you bring with, which you have lost?
What did you produce, which has been destroyed?
You did not bring anything. when you were born.

Whatever you have, you received as a gift from Him.
Whatever you give, you will give to Him.
You came empty handed and you will go the same way.
What ever is yours today was somebody else's yesterday.
And will be somebody else's tomorrow.
Change is the Law of the Universe.

If you look at what you do not have in life,
You don't have anything.
If you look at what you have in life.
You have everything.


- సేకరణ 
 లాస్య రామకృష్ణ 

Sep 17, 2012

బ్లాగ్ లోకానికి స్వాగతం

    
చాలా మంచి బ్లాగ్స్ ని చూసినప్పుడు చదివి ఎంతో ఆనందించేదాన్ని. మళ్లీ ఆ బ్లాగ్ పోస్ట్ చదవాలనిపించినప్పుడు గుర్తుకువచ్చేది కాదు. ఎంతో కష్టపడి వెతకాల్సి వచ్చేది. నేను వెతికినా టపా దొరికితే ఎంతో ఆనందం వేసేది. అందుకనే నేనొక నిర్ణయం తీసుకున్నాను.నాకు నచ్చిన బ్లాగ్స్ లిస్టు కోసమే ఒక బ్లాగ్ తిర్చిదిద్దుదామని అనుకున్నాను. అంటే ఇది హారానికి, మాలికకి, కూడలికి పోటీ కాదు. 

నాకు నచ్చిన బ్లాగ్స్ కోసమే ఈ బ్లాగ్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకా మరెన్నో ముత్యాల్లాంటి బ్లాగ్స్ ని నేను చదివి ఉండకపోవచ్చు. అలాంటి బ్లాగ్స్ గురించి నాకు తెలియచేస్తే నేను ఇందులో జత పరుస్తాను.

అయితే ప్రతి వారం, ఈ బ్లాగు లో 'ఈ  వారం ఉత్తమ టపా' గా నేను ఒక టపా గురించి ప్రస్తావిస్తాను.

 నా ఈ ప్రయత్నానికి మీ అందరి ప్రోత్సాహం ఉండాలని అభిలషిస్తూ... 
ఈ వారం ఉత్తమ టపా కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
ధన్యవాదములు  
- లాస్య రామకృష్ణ

Sep 16, 2012

మై ఆల్ టైం ఫేవరేట్ మూవీ - గజినినటీనటులు -  సూర్య, అసిన్, నయనతార తదితరులు
సంగీతం - హారిస్ జైరాజ్
దర్సకత్వం - మురుగుదాస్
విడుదల - నవంబర్ నాలుగు, 2005 


ఈ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం. సుర్య చాలా అందంగా కనబడ్డాడు. ఆ తర్వాత మరే సినిమాలోను నాకు సుర్య నచ్చలేదు. అసిన్ కూడా ఈ సినిమా లోనే నచ్చింది. 

ఎన్నిసార్లు ఈ సినిమా చూసానో లెక్కేలేదు. నాకు తెలిసిన వాళ్లందరికీ ఈ సినిమా చూడమని చెప్పేసాను. ఇంకా ఎవరైనా చుడనివారు ఉన్నారేమో అన్న అనుమానం వచ్చి, మన బ్లాగు వుందికదా ఇందులో రాసేద్దాం అని డిసైడ్   అయ్యా.

ఇందులో అకట్టుకునే సన్నివేశాలు ఎన్నో ...

1.సూర్య, అసిన్ కి తన ప్రేమని వ్యక్తపరిచే సీన్,
2.అసిన్ తను ఎంతో కష్టపడి కొనుక్కున్న తన కారుని అమ్మి సూర్యా వాళ్ళ అమ్మ కోసం డబ్బులిచ్చే సీన్.
3. సూర్య అసిన్ కి  ఒక ఫ్లాట్ ని ఓక కంపనీ ద్వారా గిఫ్ట్ గా ఇచ్చే సీన్.

ఒకటా రెండా సినిమా అద్యంతం అకట్టుకుంటుంది.

- లాస్య రామకృష్ణ
Sep 14, 2012

ఆట


బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలొచ్చాయి. అయినా ఎదో అసంతృప్తి. ఎదో సాధించాలి అనే పట్టుదల. ఇవి చాలవా గమ్యం చేరుకునేందుకు.
వెంటనే వారి ఆలోచనని అమలుపరిచారు.  
ఒక ప్లే జొన్ ప్రారంభించారు. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
చిన్న వయసులోనే వ్యాపారవేత్తలుగా మారారు.
భోగేంద్ర
వారి ప్రయత్నానికి విజయం చేకూరాలని ఆశిద్దాం.  

-  లాస్య రామకృష్ణ Sep 11, 2012

నేను నా చిట్టి తమ్ముడు

హలో అండీ,
పెద్దలకు నమస్కారం. నా కంటే చిన్న పిల్లలకు నా ముద్దులు. 

నా పేరు చైత్ర.. నాకొక తమ్ముడు. వాడి పేరు సుహాస్. నేను చాలా బుద్దిమంతురాలినన్నమాట. కాని ఎందుకో అమ్మా నాన్న నన్ను 'అల్లరి పిల్ల' అంటారు. 

నిజానికి నేను అల్లరి పిల్లని కాదు. మా తమ్ముడే అల్లరి ఎక్కువ చేస్తాడు. ఫోటోలో చూడండి చాలా అమాయకంగా కనిపిస్తాడు కదూ .

అన్నట్టు చెప్పలేదు కదూ మేము విశాఖపట్నం లో ఉంటాం. మా నాన్న జర్నలిస్ట్, అమ్మ హౌస్ వైఫ్.

నేను చదువులో చాలా చురుకు. ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను. మా తమ్ముడు సుహాస్ ఎల్ కే జీ  చదువుతున్నాడు.


నాకు పాటలు వినడం చాలా ఇష్టం. మా తమ్ముడితో ఆడుకోవడం చాలా ఇష్టం. ఇలా చాలా ఇష్టాలున్నాయి.


వాడి సంగతంటారా, ఏక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సినిమాలలో హీరోలు చెప్పిన డైలాగు లు వచ్చీ రాని మాటలతో చెప్తూ మమ్మల్ని భలే నవ్విస్తూ ఉంటాడు. 
 
సింహ సినిమాలో బాలకృష్ణ డైలాగు "ఒక వైపే చూడు" లాంటివి భలే చెప్తాడు. ఇంకా, రగడ మూవీ చూసినప్పటినుంచి అనుష్కకి, ప్రియమణికి ఫ్యాన్ అయిపోయాడు.

ఇంకా మీతో చాలా విషయాలు చెప్పాలి. అమ్మేమో హోం వర్క్ చెయ్యమని పిలుస్తోంది. మళ్లీ కలుస్తాను.- లాస్య రామకృష్ణ Sep 10, 2012

ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన "బ్రేకింగ్ న్యూస్" మీ కోసం...


ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన మా నాన్నగారి కథ "బ్రేకింగ్ న్యూస్" మీ కోసం... 

లంకె  http://vennelloadapilla.blogspot.in/

 - లాస్య రామకృష్ణ 

Sep 7, 2012

ఇంటింటి బంధువు - ఈ టీవీ సుమన్

మీ టీవీ ఈ టీవీ అంటూ అందరి మన్ననలూ అందుకున్న ఈ టీవీ TRP రేటింగ్స్ పెంచిన ఈ టీవీ సుమన్ కన్ను మూసారూ. రామోజీరావు రెండో కుమారుడు సుమన్. వయసు 45 సంవత్సరాలు.

తెలుగు భాష మిద మక్కువ, రచనల మీద మక్కువతో ఎన్నో సృజనాత్మక మైన కార్యక్రమాలు ఈ టీవీ లో ప్రసారం చేసారు. 

తనదంటూ ప్రత్యేకమైన శైలి అని నిరుపించుకున్నారు. కొన్నాళ్లుగా బ్లడ్ కాన్సెర్ తో బాధ పడుతున్న సుమన్ సెప్టెంబర్ 6 అర్ధరాత్రి కన్నుమూసారు.

అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం.

Sep 3, 2012

ఇలా ఆ బ్రాహ్మణుడి కోరిక తీరింది.

ఒకానొక పేద అమాయక బ్రాహ్మణుడు బీర్బల్ వద్దకి వచ్చి తన సమస్యకి పరిష్కారం చెప్పమని ఈ విధంగా కోరాడు. "బీర్బల్ గారు, నాకు చిన్నపట్నించి పండితుడు అని పిలిపించుకోవాలని ఉంది. కానీ ఎవ్వరూ నన్ను పండితుడిగా గుర్తించట్లేదు. దయచేసి నా సమస్య కి పరిష్కారం చూపండి అని వేడుకున్నాడు.

బీర్బల్ కి అతనిని చూస్తే జాలి వేసింది. 'పండితుడిగా' పిలిపించుకోదగ్గ అర్హతలేవి అతనికి లేవు. లోకం నాడి తెలిసిన బీర్బల్ ఆ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. 'చూడు నీ వన్నట్టు జరగాలంటే నేను చెప్పినట్టు చెయ్యి'.

అ మర్నాడు రోడ్డు మీదకి వెళ్ళిన ఆ బ్రాహ్మడిని ఉద్దేశిస్తూ బీర్బల్ చెట్టు చాటు నుండి 'పండితుడు వస్తున్నాడు' అని అరిచాడు. దానికి అతను 'ఎవర్రా నన్నలా పిలిచింది. ధైర్యముంటే ఎదురుగా రా రా' అని తిట్టసాగాడు. జనం అంతా గమనిస్తూ ఆ బ్రాహ్మడిని ఏడిపించడం కోసం 'పండితుడు వస్తున్నాడు' అని పిలవసాగారు.

ఇలా ఆ బ్రాహ్మణుడి కోరిక తీరింది.

- లాస్య రామకృష్ణ 

Sep 2, 2012

స్నేహ, నేహ, పద్మారావుసరదాగా నేను మా చెల్లి కలిసి ఒక కథ రాద్దాం అనుకున్నాం. అయితే ఇందులో ఉన్న షరతులు ఏంటంటే నేనొక వాక్యం చెప్తాను తను ఒక వాక్యం చెప్పాలి అలా కథ పూర్తి చెయ్యలి. చివరికి ఆ  కథ ఎలా సాగిందో చుడండి మరి.

నేను -  అందమైన పదహారేళ్ళ అమ్మాయి తెలుపు పింక్ కలగలిపిన పంజాబీ డ్రెస్ లో కాలేజీ బాగ్ తో బయటికి వెళ్ళింది.

చెల్లి -    తన పేరు నేహ.
నేను -  కంటికి కాజల్, మస్కారా తో ఎంతో అందంగా ఉన్నాయి ఆమె కళ్ళు.
చెల్లి -    లిప్ లైనర్ ఆమె పెదాలకి వన్నె తెచ్చింది.
నేను -  తను వెయిట్ చేస్తున్న బస్సు రాగానే ఎక్కింది.
చెల్లి -    ఒక సూపర్ మార్కెట్ ముందు బస్సు దిగింది.
నేను -  తన వాచ్ చూసుకుంది
చెల్లి -    సరిగ్గా పదిహేను నిమిషాలు మాత్రమే ఉంది
నేను -  గబగబా లోపలికి వెళ్లింది
చెల్లి -    తన స్నెహితురాలు స్నేహ ఒక కౌంటర్ దగ్గర బిజీ గా ఉంది
నేను  - నేహని చూడగానే ఆత్రంగా బయటికి రావాలనుకుంది
చెల్లి  -   కాని తన మేనేజెర్ పద్మారావు తననే గమనిస్తుండడంతో ఆగిపొయింది
నేను -  ఎలాగైన మేనేజెర్ తో మట్లాడి పెర్మిషన్ తీసుకోవాలనుకుంది
చెల్లి -    కాని మెనేజెర్ ని చాలా సేపు బ్రతిమాలి నేహ తన కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుందో తెలియచేసింది.
నేను -  కన్నిళ్ళ పర్యంతం అయిన పద్మారావు ఎట్టకేలకు ఒక అయిదు నిమిషాలు పెర్మిషన్ ఇచ్చాడు.
చెల్లి -    తన కోసమే కింద వెయిట్ చేస్తున్న నేహ కోసం కిందకి వస్తుండగా మెట్ల మీంచి పడిపొయింది.
నేను -  వెంటనే అంబులన్స్ కి కాల్ చేసింది నేహ
చెల్లి -    అంబులన్స్ లో తీసుకెళుతుండగా స్నేహ చనిపోతుంది.

ఈ కథంతా పూర్తయ్యాక మాకర్ధమయ్యేది ఏంటంటే ఇలా ఎప్పుడూ కథలు రాయటం ట్రై చెయ్యకూడదని.