'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

May 31, 2013

ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు

ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు 
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు 

ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారా చీరె 
ఇది రాముడు కట్టుకోనగా పులకించిన పంచె 
ఏడేడు లోకాలను ఎలేది పాదాలివే 
మాయల బంగారు లేడి మాయనీ గురుతులివే 

పచ్చగా ఐదోతనమే పదికాలాలుండగా 
సీతమ్మ వాడిన పసుపూ కుంకుమ రాళ్లివే 
దాటొద్దని లక్ష్మణుండు గీతని గీసిన చోటిదే 
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాల్లివే 

ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి 
మరి నా రాముడికీడ నిలువనీడ లేదిదేమి 
నిలువ నీడ లేదిదేమి 


- లాస్య రామకృష్ణ 

తేనెల తేటల మాటలతో


తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా

సాగరమే తల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు

గాంగ జఠాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని


పాట కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి 


సేకరణ 

 లాస్య రామకృష్ణ 

May 23, 2013

అనసూయ అవుట్ రష్మీ ఇన్


అనసూయ 
ఈ టీ వీ లో ప్రసారమవుతున్న "జబర్దస్త్" అనే కామెడీ షో తో ఒక్కసారిగా పాపులర్ అయిన అనసూయను ఆ ప్రోగ్రాం నుండి తొలగించారు. అనసూయ స్థానం లో రష్మీ గౌతం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్దమవుతోంది. 

యువ సీరియల్ లో నటించిన రష్మీ గౌతం, "ఎవరైనా ఎపుడైనా", "గణేష్" వంటి చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ లు చేసింది. 

జీ తెలుగు లో సంగీతకి షాక్ ఇచ్చిన అనసూయ కు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మరొక యాంకర్ ని సెలెక్ట్ చేసుకుని అనసూయకు షాక్ ఇచ్చారు. 
రష్మీ గౌతం 

మరోవైపు అనసూయకు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని వినికిడి. ఎక్కువగా ఐటెం సాంగ్స్ చెయ్యమని ఆఫర్స్ వస్తున్నాయట. 

మరి రష్మీ గౌతం అనసూయకు ఏ రేంజ్ లో పోటీ ఇస్తుందో చూడాలి.... 

- లాస్య రామకృష్ణ "అమృతం" మళ్ళీ వచ్చేస్తుందోచ్
- లాస్య రామకృష్ణ 

May 18, 2013

స్వాతి లో మా నాన్నగారు పి.వి.డి.ఎస్ ప్రకాష్ గారు రచించిన సీరియల్ "వాత్సాయనం"

'స్వాతి' పత్రికలో మా నాన్నగారు పి.వి.డి.ఎస్ ప్రకాష్ గారు రచించిన సీరియల్ "వాత్సాయనం"

- లాస్య రామకృష్ణ 

May 7, 2013

జిలేబీ గారి ఇన్స్పిరేషన్ తో లాస్య రామకృష్ణ నిర్టపా వ్రతం ఆరంభం


జిలేబీ గారి చాతుర్వార 'నిర్టపా ' వ్రతం ఆదర్శం గా తీసుకుని నేను కూడా ఒక నెల రోజులు కాదు కాదు ఒక పదిహేను రోజులు కాదు కాదు ఒక వారం పాటు "తెలుగు బ్లాగు సీ'రియల్' ముచ్చట్ల లో నిర్టపా వ్రతం అరంభిస్తున్నాను. 

మీ అందరి ప్రోత్సాహం కావాలి. 

గమనిక - ఈ వ్రతం ఈ బ్లాగు కి మాత్రమే పరిమితం. "బ్లాగ్ లోకం" లో ఈ వ్రతం పాటించట్లేదు. 

- లాస్య రామకృష్ణ