'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jul 29, 2013

"స్వర్ణ కమలం" సినిమా లో కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు.


కళాతపస్వి విశ్వనాధ్ గారు దర్శకత్వం వహించిన సినిమా. మానవతా విలువలు ఏమాత్రం కనిపించని సినిమాలు వస్తున్న సమయం లో తెలుగుతనాన్ని, కమ్మదనాన్ని సినిమాలో చక్కగా వడ్డించిన గొప్ప దర్శకుడు. 

కాని స్వర్ణ కమలం సినిమా లో కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు. అసలు ఆ సినిమానే నచ్చలేదు. 

అంధుడైన ఒక గొప్ప నాట్యకారుడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి సంగీత సరస్వతి. చిన్నమ్మాయి ఆధునిక భావాలు కలిగిన యువతి. ఈ కళలు కడుపు నింపవు అనే ఆలోచన కలిగిన అమ్మాయి. ఒక విధంగా కళల పట్ల ద్వేషం పెంచుకున్న అమ్మాయి. 

అటువంటి అమ్మాయి ని బలవంతంగా నాట్యగత్తె గా మార్చాలని వెంకటేష్ విశ్వ ప్రయత్నం చేస్తాడు. సహజంగా ప్రతిభ ఉన్నవాళ్ళని ప్రోత్సహించడం లో తప్పు లేదు. కాని, ఆ అమ్మాయి కి వద్దు బాబోయ్ అన్నా ఏదో ఒక విధంగా ఆమెను నాట్యం వైపు మరల్చాడని ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని ఉద్దేశ్యం మంచిదే అయి ఉండవచ్చు, కానీ అతను డీల్ చేసిన విధానం సబబు గా లేదు. అనవసరంగా మధ్యలో భానుప్రియ తండ్రి మరణానికి కారకుడవుతాడు. 

కొన్ని కొన్ని సన్నివేశాలలో అయితే భానుప్రియని వేధించుకు తింటున్నాడు అనిపించింది. 

ఏంతో మంది పేద కళాకారులు ఎవరైనా తమని గుర్తించాలని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని  ప్రోత్సహించినా ఒక అర్ధం ఉండేది. - లాస్య రామకృష్ణ 4 comments:

Anonymous said...

కానీ వాళ్ళు ఆ సినిమాలో నటించలేదు కదండీ!!

surya prakash apkari said...

నిజమే!నాకు ఆసక్తి లేదు మొర్రో అని భానుప్రియ మొహం తిప్పుకుంటుంటే నీవు నృత్యం లో రాణించి తీరవలసిందే అని బలవంతం చేయడం వ్యక్తి స్వేచ్చను హరించడమే!అయితే అలాంటి పాత్రను దర్శకులు నిత్యజీవితంలో ఎవర్నైన చూసి చిత్రించారేమో తెలియదు!కే.విశ్వనాథ్ గారు ఒకే లలితకళాత్మక మూసలో పడినప్పుడు తీసిన సినిమాలలో ఇది ఒకటి!

Lasya Ramakrishna said...

@surya prakash apkari గారు, అవునండి. మీరన్నట్టు దర్శకులు అటువంటి పాత్రలను నిజజీవితం లో చూసి చిత్రీకరించినట్టున్నారు.

Lasya Ramakrishna said...

@kvsv garu, స్వర్ణకమలం సినిమా ని విశ్వనాధ్ గారు, దర్శకత్వం నిర్వహించగా భానుప్రియ, వెంకటేష్ కలిసి నటించారు.