'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 31, 2012

మీక్కూడా ఇలాంటి కలలు వస్తాయా?

అదేంటో అప్పుడప్పుడు నాకు చాలా విచిత్రమైన కలలు వస్తుంటాయి. అవి ఎలాంటి కలలంటే, నిజజీవితానికి ఆ కలలకి ఎటువంటి సంబంధం ఉండదు. అందుకేనేమో, వాటిని కలలు అంటారు. 

అలాంటి కలలు ఇవి కొన్ని. 

1. రోజు వచ్చే ఆఫీసు క్యాబ్ బదులు ఒకసారి షేర్ ఆటో వచ్చింది. (రేసిషన్ టైం లో వచ్చిన కలలెండి).
2.ఒకసారి ఏకంగా ఫ్లైట్ వచ్చేసింది నన్ను ఆఫీసుకి పిక్ అప్ చేసుకోవడానికి. 

సినిమాలకు సంబంధించిన కలలైతే బోలెడు. హీరో చిరంజీవి మా ఇంటికొచ్చాడు. త్రిష, తరుణ్ లకి నేను భోజనం వడ్డించాను. 

ఇవన్ని ఆహ్లాదాన్నికలిగించే కలలైతే అప్పుడప్పుడు భయాన్ని కలిగించే కలలు కూడా వస్తుంటాయి.

రాత్రిపూట చంద్రుడు నిండుగా ఉన్నప్పుడు కనుచూపు మేరలో ఎవరూ ఉండరు.
నేను పరిగెడుతున్నట్టు, ఎవరో వెంబడిస్తున్నట్టు, ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోతున్నట్టు ఇలా ఎన్నో.

అఫ్ కోర్స్, ఇలాంటి కలలు మనం టెన్షన్ పడుతున్నప్పుడు వస్తుంటాయని ఎక్కడో చదివాను. అందుకే సాధ్యమైనంత వరకు నేను అతిగా టెన్షన్ పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటాను.

ఇవి ఒకవైపయితే, నాకు భక్తీ కలలు కూడా చాల వస్తుంటాయి. 

అమ్మవారు ఎర్రని చీరతో, బోలెడు నగలతో, నిండైన బొట్టుతో ఎంతో అందంగా వస్తుంటారు. 
నేనొక పురాతన గుడికి వెళ్లినట్టు, అక్కడ అందమైన కొలనులో ఆడుకున్నట్టు ఇలా వస్తుంటాయి. ఆ కలలో ఉన్నంత సేపు ఆనందాన్నిస్తాయి. 

అప్పుడప్పుడు నేనసలు చూడని క్రొత్త ప్రదేశాలు కూడా వస్తుంటాయి. అవి ఎంతో రియాలస్టిక్ గా ఉంటాయి. నేను ఆ ప్రదేశం లో ఎన్నో రోజులనుండి ఉండినట్టు అనిపిస్తుందన్నమాట.

క్రొత్త ప్రదేశాలంటే గుర్తొచ్చింది, రెండు మూడేళ్ళ క్రితం అనుకుంట ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఒకతను తనకి కలలో ఎప్పుడు చూడని ప్రదేశం వస్తుండేదని, తానెప్పుడు వెళ్ళని ఆ ప్రదేశం లో ఒక చర్చి కూడా కనిపించేదని. ఒకసారి, అతను అనుకోకుండా తన భార్య బిడ్డలతో ట్రిప్ కి వెళ్ళగా అక్కడ తన కలలో కనిపించిన ప్రదేశం, చర్చి కనిపిస్తే ఆశ్చర్యానికి గురయ్యాడని కలల గురించి ప్రచురించిన కాలమ్ లో అతను తన అనుభవాన్ని పంచుకున్నాడు. 

ఇదిలా ఉంటె మరొక ఆర్టికల్ చదివాను. ఒకతనికి తరచూ ఒక ముసలావిడ కలలోకి వచ్చేది. అతనికి ఆవిడ నిజంగానే ఉండుంటుందని గాఢమైన నమ్మకం ఏర్పడింది. ఇదే విషయం తన ఇంట్లో పెద్దవాళ్ళతో చర్చిస్తే, ఇతను వర్ణించిన ప్రదేశాన్ని బట్టి, ఆవిడ రూపురేఖల్ని బట్టి ఆవిడ ఎక్కడుందో చెప్పారు. ఆ ముసలావిడని కలవడానికి ఇతను ఆ ఊరికి వెళ్ళగా అప్పటికే ఆవిడ మరణిస్తుంది. ఇంతకీ ఆవిడ ఇతని తల్లికి పురుడు పోసిన మంత్రసాని అట. 

ఇలా కలలకి అంతే ఉండదు. 

మనిషిని ఆకాశానికి ఎత్తేస్తాయి
నేలమీదకు పడేస్తాయి
కొత్త ప్రదేశాలకు తీసుకెళతాయి 
జ్ఞాపకాలకు రూపాన్నిస్తాయి

కలల గురించి ప్రసిద్దమైన అభిప్రాయం కూడా ఉంది. అదేంటంటే కలలు భవిష్యత్తును సూచిస్తాయని.

కలలు అందంగా ఉన్న మాత్రాన కలలోనే ఉండిపోలేము. బాధ కలిగించినంత మాత్రాన మెలకువ రాకుండా పోదు. కలలకి భయపడి నిద్రకి దూరం కాలేము. అందమైన కలల కోసం నిద్రలోనే ఉండిపోలేము. 

చివరగా చెప్పొచ్చేదేంటంటే, మంచి కల వచ్చిందనుకోండి మెలకువ వచ్చాక 'ఇది కలా' అని కొంచెం బాధేస్తుంది.అదే పీడకల అనుకోండి, మెలకువ రాగానే 'హమ్మయ్య, ఇది కలా' అనిపిస్తుంది.మొత్తానికి 'ఇది కలా' అని మాత్రం కచ్చితంగా అనిపిస్తుంది.     

Jan 29, 2012

సండే స్పెషల్ ఆలుగడ్డ కూర ఇన్ 4 స్టెప్స్.....


నేను చేసిన ఆలుగడ్డ కూర   

Step 1. చిన్న సైజు ఆలుగడ్డలని Cooker లో ఉడికించుకోవాలి.
Step 2. మూకుడులో పోపు(తగినంత నూనెలో పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు) వేయిన్చుకున్నాక అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు(3), టమాటా(1), మిర్చి(2) వేసి ఒక సారి వేయించుకోవాలి.
Step 3. ఉడికిన ఆలుగడ్డల తొక్క వలిచి ఈ మూకుడులో వీటితో పాటు ఇంకొక్క సారి లైట్ గా వేయించుకోవాలి.
Step 4. తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. 

Jan 27, 2012

ఇట్లు ఓ యువతి...

మొన్నేమయిందో తెలుసా.....నేనేమో కష్ట పడి టీవీ ప్రోగ్రాం "మా ఇంటి వంట" చూసి మా ఇంట్లో ఏదో ప్రయోగం చేస్తున్నాను. అదేనండి ఆ వంట వండుతున్నాను. ఎందుకంటే, అ వంట రుచి మావారికి చూపించి, బాగుంటే నేను తిని ఇద్దరం కలిపి మూవీ కి వెళ్ళాలన్నది మా వీకెండ్ ప్లాన్. 
సరే మూవీ అనే ఒక ఆసక్తి కరమైన అంశం ఉంది కాబట్టి ఏదో ఇవాళ అయినా  కాస్త వంట బాగా చేసి మా వారి మెప్పు పొందుదామని అంత హడావిడిగా, ఏకాగ్రత తో వండుతున్నాను. సాధారణంగా, అంత ఏకాగ్రతతో వండితే పదార్ధం, ఐ మీన్ వంట బాగా కుదురుతుంది. కాని నా విషయం లో అలా జరగలేదు. ఎందుకో మీరే చదవండి...

నేను చక్కగా టీవీ లో చూపెట్టినట్టు ఉప్మా తయారు చేద్దామని అనుకుంటుండగా, మా వారి స్నేహితుడు ఉరుము ఉరిమి నట్టు అదర బాదరాగా మా ఇంటికి వచ్చాడు. ఏ నిమిషమైతే ఇతను వచ్చాడో అప్పుడు నాకర్ధమైంది ఇవాళ మూవీ కేన్సిల్ అని. ఎందుకంటే, అతను ఎప్పుడొచ్చిన ఏదో ఒక ప్రత్యేకమైన సమస్యతో మా వారి సలహా అడగడానికి వస్తాడు. మా వారు మనుషుల మనస్తత్వాన్ని బట్టి వారికి సూచనలు ఇస్తారు. పోనీ అదేదో ఆఫీసు సమస్య అంటే కానే కాదు. వాళ్ళావిడతో సమస్యట. 

ఇతను వంకాయ కూర చేస్తానంటే వాళ్ళావిడ బెండకాయ చెయ్యమందట. దాంతో ఇతని ఈగో దెబ్బతిని వంకాయ కూర వండి మరీ వచ్చాడట. అసలు సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఇంటికెల్లడానికి భయపడుతున్నాడు. 

మా వారు మనసులో 'మా ఆవిడ మరీ నా ఈగో దెబ్బతీయదు. నేనేం వండినా కాం గా తింటుంది అని సంబరపడినట్టున్నారు' వెంటనే అతనితో "ఇది ఒక సమస్య. మీ భార్యభార్తలిద్దరికి అవగాహన లోపం ఉంది. కొంచెం సర్దుకుపోవాలి అని నచ్చచెప్పారు. వెంటనే 'ఏమోయి' అని నన్ను పిలిచి బెడ్రూంలోకి తీసుకెళ్ళారు. నేను కొంచెం సిగ్గుపడి ఏంటండి మరీను వేలా పాలా లేకుండా అంటే 'నీ మొహం, నేను పిలిచింది ఎందుకంటే వాడి భార్యకి నువ్వు నచ్చ చెప్పి ఎలాగోలా వీడి సమస్యను పరిష్కరించు అన్నారు. 

దాంతో, నా ఆనందానికి అవధులు లేవు. చిన్నపట్నించి, ఏదో ఒక గొప్ప పని చేసి, 'కర్తవ్యం' విజయశాంతి లాగా  హీరోయిన్ ఓరియంటెడ్ సీన్ నా లైఫ్ లో జరగాలని ఆశించాను. కానీ ఇప్పటి వరకు అలాంటి అవకాశం రాలేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినయోగం పరచుకోవాలన్న సదుద్దేశంతో ముందడుగు వేసాను.

ఆ సంతోషం లో నేను చేసిన ఉప్మా లో ఇడ్లి రవ్వ దర్శనమిచింది. 

కట్ చేస్తే, మేము ముగ్గురం మా వారి స్నేహితుడి ఇంటికి అతని భార్యకి నచ్చచెప్పడానికి వెళ్ళాం. అక్కడ, ఆ అమ్మాయి చాలా సేపటినుండి ఏడుస్తున్నట్టుంది కళ్ళు వాచిపోయాయి. వాల్లాయనని చూడగానే గబాలున లేచి దగ్గరకి వొచ్చి మేమున్నామని కూడా గమనించనట్టు వాటేసుకుని, 'ఏవండి, నా మీద అంత కోపమెందుకు. ఏదో బెండకాయ కూర చెయ్యమని అడిగానే అనుకోండి అలా వెళ్ళిపోవాలా. మీ మీద ప్రేమతో వంకాయ కూర మొత్తం తినేసానండి. ఇంకెప్పుడు ఇలా వెళ్ళిపోకండి. మీరేం వండినా రుచిగానే ఉంటుంది. ఐ యాం సారీ!!!" అంది. ఇద్దరు కలిసి మేము అనే ఇద్దరం మనుషులం వాళ్ళింటికి వచ్చామని మర్చిపోయి మరీ లోపలికి సంతోషంగా ఒక డ్యూయెట్ పాడుకోవడానికి వెళ్ళిపోయారు. 

మళ్లీ కట్ చేస్తే ఇడ్లీ రవ్వ ఉప్మా మా వారికి పెట్టి, సినిమాకి బయలుదేరితే అప్పటికే "హౌస్ ఫుల్ " బోర్డు అందంగా వెక్కిరించింది.

నీతి:- ఉప్మా లో ఇడ్లి రవ్వ వెయ్యకూడదు!!!

ఇట్లు ఓ యువతి.Jan 26, 2012

మాటే మంత్రము...
   ఒకానొక అడవిలో నాలుగు  కప్పలు ప్రయాణిస్తున్నాయి.  అనుకోకుండా, రెండు కప్పలు లోతైన గుంటలో పడిపోయాయి. అవి బయటికి రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కాని లోతైన గుంట కావడం వల్ల తిరిగి పడిపోసాగాయి. తిరిగి ప్రయత్నించసాగాయి. మరల పడిపోసాగాయి. పైనున్న మిగతా కప్పలు వీటితో "మీరెంత కష్టపడిన బయటికి రావడం కష్టం" అని పదే పదే హెచ్చరించసాగాయి. 

   వీరి మాటల ప్రభావం వల్ల, అసలే అలసిపోయిన ఒక కప్ప తన ప్రయత్నం విరమించుకుంది. మరొక కప్ప మాత్రం పట్టు విడువ కుండ ప్రయత్నిస్తూనే ఉంది. పైనున్న కప్పలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ప్రయత్నించగా, ప్రయత్నించగా చివరికి ఈ కప్ప గుంటలోంచి బయటికి వచ్చింది.

   అప్పుడు మిగతా కప్పలు "భలే వచ్చావే!!!మేము చెప్పినది నీకు వినపడలేదా?" అని అడిగాయి. అర్ధం కానీ అ కప్ప ఏమిటని ప్రశ్నించింది? చెప్పగా చెప్పగా మిగతా కప్పలకి అసలు విషయం అర్ధమైంది. ఈ కప్పకి చెవుడు. వీళ్ళు బయటికి రమ్మని ప్రోత్సహిస్తున్నారనుకుని ప్రయత్నించి వచ్చింది. వీరి మాటలు విన్న గుంటలో ఉన్న కప్ప ఉపిరాడక చనిపోయింది.

   ఈ పిట్ట కధ ద్వారా మనం రెండు విషయాలు గమనించవచ్చు.
అవేంటంటే.....

మొదటిది  
మనం మాట్లాడే ప్రతి మాట ఎంతో విలువైనది.ఒకరికి ప్రాణం పోసే శక్తి, ప్రాణం తీసే శక్తి మాటలోనే ఉంది. ప్రోత్సహిస్తున్నారనుకుని చెవిటి కప్ప బయటికి వచ్చింది. మిగతా కప్పల మాటలు విన్న కప్ప గుంటలో మరణించింది.


రెండవది  
ఒకరు ప్రోత్సహిస్తే నే మనం అనుకున్నది సాధిస్తాం అనుకోకుండా నిరుత్సాహపరిచినా కూడా మనం చేసేది          
సరి అయినది అని మనకి తెలిసినపుడు మన ప్రయత్నాన్ని విరమించకూడదు  ఎందుకంటే, ప్రతిసారి మనల్ని ప్రోత్సహించే వారు ఉండరు. స్వార్ధపరులే ఎక్కువ శాతం ఉన్న ఈ ప్రపంచంలో మనం అనుకున్నది మనం చెయ్యగల ఆత్మవిశ్వాసం మనకుండాలి. అదే సెల్ఫ్ మోటివేషన్.

 - లాస్య రామకృష్ణ.

Jan 24, 2012

తాళం తెచ్చిన తంటనేను మా అయన కలిసి మొన్నసండే అలా బయటికి  వెళ్ళాం. మర్నాడు ఆఫీసు ఉంటుంది కదా, తొందరగా బయలుదేరి రావాలి అని మాట తీసుకుని మరీ బయలుదేరాను. 

బయటికి వెళ్తే టైం మన చేతుల్లో ఉండదు కదా. ఆ రోజు "బిజినెస్ మాన్" సినిమా చూసి, బయటే డిన్నర్ చేసి ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇక మర్నాడు చూడండి నా అవస్త.

ఉదయాన్నే లేచి స్నానం చేసి, దేవునికి దణ్ణం పెట్టుకుని, వంట చేసి, నాకు మా ఆయనకి లంచ్ బాక్స్ సర్దాను. ఇవాల్టికి బ్రేక్ ఫాస్ట్ కి ఉప్మా తో సరిపెట్టుకోండి అని మా శ్రీవారికి చెప్పను. ఆయనకి ఉప్మా పడదాయే!!! కానీ ఏంచేస్తాం. కొన్ని సార్లు తప్పదు కదా అని నా స్టైల్ లో బ్రతిమిలాడాను. అప్పుడు ఒప్పుకున్నారు.

క్యాబ్ వచ్చే టైం అయింది అన్ని రెడీ చేశాను కదా అని ఒక సారి చెక్ చేసుకున్నాను. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. అప్పుడు క్యాబ్ డ్రైవర్ నుంచి ఫోన్ 'మేడం, టైర్ పంక్చర్ అరగంట లేట్ అవుతుంది' అని. సర్లే, ఏదోచ్చిన మన మంచికే కదా అని కాస్త రిలాక్స్ అవుదామనుకున్నాను. చెరొక తాళం తీసుకెళ్ళే అలవాటుండడం వాళ్ళ కాజ్యువల్ గా చూసుకున్నాను. అప్పుడు తెలిసింది, నా దగ్గర తాళం మిస్ అయ్యిందని.

ఇంక వెతుకులాట ప్రారంభం. వంటింట్లో వెతికాను. బెడ్రూం లో వెతికాను. పోపుల పెట్టెలో వెతికాను. మా అయన జేబులో వెతికాను. ఎక్కడ దొరకదాయే. ఇలా వెతుకులాట లో నే అరగంట గడిచిపోయింది. అప్పుడు, మావారు ప్రశాంతంగా పేపర్ చదువుకుంటూ కనిపించారు. 

నేను తాళం కనపడలేదని హడావిడిలో ఉంటే అయన కనీసం ఏ మాత్రం హడావిడి గా లేకుండా పేపర్ చదువుకుంటున్నారు. నా హడావిడి గమనించి నా ప్రాబ్లం ని చిటికలో సాల్వ్ చేసారు. ఎలా అంటారా.

రెగులర్గా నేను మర్చిపోయే చోటే తాళం దొరికింది. అదేనండి టీవీ రిమోట్ దగ్గర. 

ఇలా అరగంటా గడిచిపోయింది. ఈ లోపు క్యాబ్ వచ్చింది.  

- లాస్య రామకృష్ణ 

  


Jan 23, 2012

నిదుర రాని ఈ వేళ....నిదుర రాని ఈ వేళ
నీదే ఆలోచన 

కలలోకి వస్తావని 
నిదుర కోసం చూస్తే

చూడలేకపోతానని భయం
ఎదురుగ నీవొస్తే.....

- లాస్య రామకృష్ణ 

Jan 21, 2012

మీరూ స్పందించారా???

ఆపదలోని ఉన్న వారిని ఆదుకోవడానికి ఏ వ్యాపారవేత్తో లేదా పెద్ద ఉద్యోగో కానక్కర్లేదు. ఓంకారనాథ్ శర్మ లాంటి మంచి మనసుంటే చాలు. మార్గం కళ్ళముందు ఉంటుంది. 

అతను నోయిడా లోని ఓ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్. జీతం తనకే సరిగా సరిపోదు. తనకొక మతి స్తిమితం లేని కొడుకు మందులకి కూడా ఖర్చు చాలా అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా అతను పరులకు సహాయం చెయ్యడానికి పూనుకున్నారు. మనసుంటే మార్గముంది అని నిరూపించారు . ఎలా అంటారా? చదవండి.

ఇంటింటికి తిరిగి "మీ ఇంట్లో మీరు జలుబుకో, జ్వరానికో మందులు తెచ్చుకుని ఉండుంటారు. మిగిలిపోయిన ఆ మందులు వేరే వారికీ ఉపయోగపడతాయి. దయచేసి ఇవ్వండి" అని అడుగుతారు. ఎంతో మంది స్పందించి ఇతనికి మందులు ఇవ్వడం ప్రారంబించారు. వాటిని ఇంటికి తీసుకువచ్చి Expire అవ్వని మందులని ఒక చోట చేర్చి ప్యాక్ చేసి అవసరార్దులకి పంచిపెడతారు. ఇలా ఎంతో మంది పేదల ప్రాణాలను ఇతను కాపాడారు.

ఓంకార్ నాథ్ శర్మ 
ఇతని మంచి మనసుకి స్పందించి ఎంతో మంది వీరి ఇంటికి Courier లో కూడా మందులు పంపిస్తున్నారు. ఇలాంటి వారిలో మీరు వున్నారా అయితే .....ఈ క్రింది చిరునామాకి మందులు Courier చెయ్యండి.


ఓంకార్ నాథ్ శర్మ 
B-180, Street no.4 (Mandyali galli)
Manglapuri, Phase -2, 
Delhi - 110045 
PH. 092502 43298- లాస్య రామకృష్ణ Jan 14, 2012

గుత్తి వంకాయ కూర in 4 steps

నేను చేసిన గుత్తి వంకాయ కూర

1.వంకాయ కడిగి కాయ కాయ గా తరగండి. 
తరిగి పెట్టుకున్న తాజా వంకాయలు 

2.పల్లీలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేయించాలి.
వేయించినవి   

3.ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, మిరపకాయలు, వేయించి పెట్టుకున్న వాటితో కలిపి మిక్సీ వేసుకోండి.
తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయలు 

4. మూకుడులో నూనె వేడి చేసి, వంకాయలో తయారు చేసుకున్న ముద్దని నింపి దోరగా వేయించాలి.
వేగుతున్న వంకాయలు  

5. అంతే, గుత్తి వంకాయ కూర తయార్!!!!!
గుత్తివంకాయ కూర 
- లాస్య రామకృష్ణ 


Reverse Quiz Game Show

నేను నిన్న సాక్షి టీవీ లో రాత్రి 8:30 కి ప్రసారమైన గ్రాండ్ మాస్టర్ ప్రోగ్రాం (Reverse Quiz Game Show) చూసాను. చాలా కొత్త కాన్సెప్ట్.   పార్టిసిపంట్ మనసులో అనుకున్న సెలెబ్రిటి పేరుని గ్రాండ్ మాస్టర్ DR.G.S.Pradeep కనిపెట్టేస్తారు. అయితే  ఈ క్రమంలో అతను  పార్టిసిపంట్ ని  కొన్ని  ప్రశ్నలు  అడుగుతారు . వాటికీ  వారు   కేవలం 'Yes'  or 'No' సమాధానాలు మాత్రమే  చెప్పాలి.

ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే స్వతహాగా నాకున్న అభిరుచి వల్ల నేను 'గ్రాండ్ మాస్టర్', పార్టిసిపంట్ ని అడిగిన ప్రశ్నలు నోట్ చేసుకున్నాను. మీకోసం ఆ ప్రశ్నలు. 


ఒక సెలెబ్రిటి గురించి గ్రాండ్ మాస్టర్ పార్టిసిపంట్ ని అడిగిన ప్రశ్నలు, పార్టిసిపంట్ సమాధానాలు.

గ్రాండ్ మాస్టర్ -              ఆ వ్యక్తి పురుషుడా 
పార్టిసిపంట్ -                  ఎస్
గ్రాండ్ మాస్టర్ -              బ్రతికే ఉన్నాడా 
పార్టిసిపంట్-                   నో
గ్రాండ్ మాస్టర్ -              భారతీయుడా
పార్టిసిపంట్-                   ఎస్
గ్రాండ్ మాస్టర్-               దక్షిణ భారతీయుడా
పార్టిసిపంట్-                   ఎస్
గ్రాండ్ మాస్టర్ -              ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడా
పార్టిసిపంట్ -                  ఎస్
గ్రాండ్ మాస్టర్-               సహజ మరణమా
పార్టిసిపంట్-                   నో
గ్రాండ్ మాస్టర్-               1950 తర్వాత మరణించాడా
పార్టిసిపంట్                    నో
గ్రాండ్ మాస్టర్                1900 తర్వాత మరణించాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                1925 తర్వాత మరణించాడా
పార్టిసిపంట్                    నో
గ్రాండ్ మాస్టర్                తుపాకీ తో కాల్చబడి చంపబడ్డాడ
పార్తిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                పన్ను ఎందుకు కట్టాలని ఎదురుతిరిగాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                పల్నాడు విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తా
పార్తిసిపంట్                      నో
గ్రాండ్ మాస్టర్                   అతని పేరులో 'H' అనే అక్షరం ఉందా
పార్టిసిపంట్                    నో
గ్రాండ్ మాస్టర్                50 ఏళ్ళ తర్వాత మరణించారా
పార్టిసిపంట్                     నో
గ్రాండ్ మాస్టర్                 'R' అనే అక్షరం అతని పేరులో ఉందా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                అతను ఏ అమ్మాయినైన ప్రేమించాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                ఆ అమ్మాయి పేరుని తన పేరులో కలుపుకున్నాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                అడవిలో చంపబడ్డాడా


అంతే గ్రాండ్ మాస్టర్ ఆ సెలెబ్రిటీ పేరు చెప్పేసారు. ఈ ప్రోగ్రాం చూస్తుంటే నేను చిన్నప్పుడు స్కూల్ లో ఆడుకున్న 'YES' or 'NO' ఆట గుర్తొచ్చింది.Jan 13, 2012

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావు


మనసు కవి ఆత్రేయ రచించిన పాటలు ఎన్నో ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోయాయి. అయన మన మధ్య లేకపోయినా అతని పాటలు మన హృదయాలలో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. అయన రచించిన ఎన్నో పాటలు, మాటలు జీవిత సత్యాలను తెలుపుతాయి. చిన్న చిన్నమాటలతో అల్లిన పదాలతో ఎన్నో భావాల్ని రంగరించి ప్రేక్షకులందరికీ దగ్గరయ్యారు ఆత్రేయ. అయన రచించిన ఒక పాట మీ కోసం. 


ఆత్రేయ
కనులు కనులతో  కలబడితే ...ఆ  తగవుకు  ఫలమేమి ..  
కలలే......... 
నా  కలలో  నీవే  కనబడితే .ఆ చొరవకు  బలమేమి ..
మరులే.......
మరులు  మనసులో  స్థిరపడితే..ఆ  పై  జరిగేదేమి..
మనువూ ...
మనువై  ఇద్దరు ఒకటైతే  ఆ  మనుగడ  పేరేమి .
సంసారం..

అల్లరి  ఏదో  చేసితివి ..చల్లగా  ఎదనే   దోచితివి ..  
అల్లరి  ఏదో  చేసితివి  ..చల్లగా   ఎదనే   దోచితివి .
ఏమీ  లేని  పేదనని..నా  పై  మోపకు  నేరాన్ని ..
ఏమీ  లేని  పేదనని..నా  పై  మోపకు  నేరాన్ని ..
లేదు  ప్రేమకు  పేదరికం ..నే  కోరను  నిన్ను  ఇల్లరికం ..
లేదు  ప్రేమకు  పేదరికం ..నే  కోరను  నిన్ను  ఇల్లరికం ..
నింగీ  నేలకు కడు దూరం ..మన  ఇద్దరి  కలయిక  విడ్డూరం.. - లాస్య రామకృష్ణ 

Jan 12, 2012

నీవు రావు, నిదుర రాదు.........

నీవు రావు, నిదుర రాదు......... 

ఈ సోమవారం వచ్చిన పాడుతా తీయగా ప్రోగ్రాం లో పార్టిసిపంట్స్ అందరు మంచి పాటలు ఎంచుకుని పాడారు. ఈ ప్రోగ్రాం ద్వారా మనకు తెలియని మంచి పాటలు ఎన్నిటి గురించో మనం తెలుసుకుని ఆస్వాదించవచ్చు. అందులో ఒక అమ్మాయి "నీవు రావు, నిదుర రాదు' అనే పాట పాడింది. అ పాట నేను అదే వినడం. కానీ ఎంత బాగుంది ఆ పాట. సాహిత్యపరంగా కానీ, సంగిత పరంగా కానీ, ఆ పాట ఒక అద్బుతం. 

విరహ వేదనని ఎంత బాగా అక్షరాలలో ఏర్చి కూర్చాడు ఆ రచయిత. ఆ రచయిత పేరు నేను వినలేదు. మిస్ అయ్యాను అప్పుడు. అనుకోకుండా ఆ పాట వినడం జరిగింది. ఎలాగైనా ఆ రచయిత పేరు తెలుసుకుంటాను. నాకు నచ్చిన ఈ పాట సాహిత్యం మీ కోసం.


నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

తారా జాబిలి ఒకటై సరసమడే ఆ రేయి......ఆ.....ఆ...
చింతా చీకటి ఒకటై చిన్నబోయే ఈ రేయి 

నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....


ఆశలు మదిలో విరిసే దోసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసే దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ ఆలయాన చేరి చూడ
స్వామి కాన రాడాయె నా స్వామి కాన రాడాయె


నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే...
ఎదురు చూసి ఎదురు చూసి
ఎదురు చూసి ఎదురు చూసి 
కన్నుదోయి  అలసిపోయే 

నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

- లాస్య రామకృష్ణ.Jan 10, 2012

చి'లిపి' కల

చి'లిపి' కల 

ఆ రోజు నాకు తెలుగు ఫైనల్ ఎక్జాం. బాగా రాసి మంచి మార్క్స్ సంపాదించుకోవాలన్నది నా కోరిక. ఎక్జాం హాల్ అంతా చాలా సైలెంట్ గా ఉంది. ఇన్విజలేటర్ అందరి హాల్ టికెట్స్ చెక్ చేశాక, ప్రశ్నాపత్రాలు ఇవ్వడం మొదలు పెట్టింది. 

ప్రశ్నా పత్రం నా చేతికి వచ్చింది. చూడగానే చాలా సంతోషమేసింది. నేను చాలా ఇష్టపడే సబ్జెక్టు తెలుగు. అన్నీ నాకు సమాధానం తెలిసిన ప్రశ్నలే ఉన్నాయి. 
వాటన్నిటికీ చక చకా సమాధానం రాయడం మొదలుపెట్టాను. 'suddenga aksharalu english lo ki maripoyayi. nenu rayalanukunnavi telugu lo kakunda english aksharalalo kanipistunnayi. ila enduku jarigindi. asalemaindi'

ఈ లోగా మెలకువ వచ్చింది. 'హమ్మయ్య, ఇది కలా అని నా మనసు కుదుటపడింది'.

నేను తెలుగు బ్లాగ్ రాయడం మొదలు పెట్టిన వారం రోజులకి ఈ కల వచ్చింది. తెలుగు బాష కోసం ఇంగ్లీష్ లిపి వాడుతూ ఉంటాం కదా దాని ఇంపాక్ట్ అన్న మాట ఈ కల. 
Jan 8, 2012

మా బాదం చెట్టు

నేను విశ్లేషించిన కథ పేరు - మా బాదం చెట్టు 
రచయిత - మల్లాది  వేంకట కృష్ణమూర్తి


 ఆంధ్రపాఠకుల ఆహ్లద రచయిత మల్లాది వేంకట  కృష్ణమూర్తి . పాఠకుల హృదయాలలో ఆయన  స్థానం సుస్థిరం.  . సరళమైన భాష, సుస్పష్టమైన శైలి ఆయన సొంతం.


మల్లాది గారి 'మా బాదం చెట్టు ' కధ నన్ను బాగా ఆకర్షించింది. టైటిల్ చూడగానే నన్ను చిన్ననాటి రోజులకి అక్షరాలనే టైం మెషిన్ తో ఈ కథ  తీసుకెళ్ళిపొయింది. ఉత్తుమపురుష(first person) లో ఈ కథ సాగింది.

సంక్షిప్తంగా ఈ కథ గురించి చెప్పుకోవాల్సి వస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న కథానాయకుడు తన ఇంట్లొనున్న  బాదం చెట్టు విశేషాల గురించి తలచుకుని ఆ మదురానుభూతుల్ని మనతో పంచుకుంటాడు. బాల్యం లొ బాదం చెట్టుతొ అల్లుకుపోయిన తన అనుబంధాన్ని గుర్తుచేస్తు తను వివరించే ప్రతి అంశం ప్రతి ఒక్కరికి బాల్యపు రోజులని  గుర్తుచేస్తుంది.

కథనం బాదం చెట్టు చుట్టూ తిరిగినా, నిజానికి ఇది మధ్యతరగతి కుటుంబాలలొని  అనుబంధాలని స్ప్రుశిస్తుంది అనడానికి ఈ వాక్యాలే  ఉదాహరణ "మా నాన్నగారు ఆఫీస్ నించి రాగానే దొడ్లో తొట్లోని నీళ్ళతో కాళ్ళు కడుక్కుని, ఓ సారి బాదం చెట్టు దగ్గర ఆగి తన చేతులతో కింది కొమ్మని ముట్టుకునేవారు. అంతదాకా చిరాగ్గా ఉండే మా నాన్నగారిలో చిరాకంతా తక్షణం మాయమయ్యేది. ప్రశాంతంగా, చిరునవ్వుతో ఇంట్లోకి వచ్చేవారు. పిల్లలందర్నీ పలకరించాకే, మా అమ్మ ఇచ్చే కాఫీ గ్లాసుని అందుకునే వారు. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు  మళ్ళి బాదం చెట్టుదగ్గరి వెళ్ళి కింది కొమ్మనుంచి ఏదో అందుకున్నట్లుగా నటించి ఆఫీస్‌కి  వెళ్ళిపోయేవారు.   మా నాన్నగారి సంతానంలో మేం ఎవరం మా ఆఫీస్ సమస్యల వల్ల కలిగే చీకాకుని ఇంట్లోని కుటుంబ సభ్యుల మీద చూపించి ఎరగం. మా నాన్నగారు మాకు ఈ విషయంలో ఆదర్శంగా ఉండటానికే ఆ బాదం చెట్టుని వాడుకుని ఉంటారని నాకు పెద్దయ్యాక అర్థమైంది." 

ఎంతో సున్నితంగా తల్లి ప్రేమని కూడా రచయిత ఈ మాటల ద్వారా  చాలా అందంగా చిత్రీకరించారు.

"అమ్మా! ఆ బాదం చెట్టుని ఎవరు కనుక్కున్నారు?" 
"నువ్వేరా, నీ చిన్నప్పుడు ఓ రోజు నువ్వు నా దగ్గరకి పరిగెత్తుకు వచ్చి చెప్పావు."
మా మధ్య రెండు మూడు రోజులకోసారి ఈ సంభాషణ జరిగేది. 
ఇప్పుడనిపిస్తోంది, అది నిజమై ఉండదని. ఎందుకంటే నేను బాల్యంలో ఉండగానే అది బాగా ఎదిగి కాయలు కాస్తోంది.
 నేను కనిపెట్టానని చెప్పి నన్ను బాల్యంలో మా అమ్మ ఆనందింప చేసిన ఆ చెట్టు వంక తృప్తిగా చూసి వెనక్కి తిరిగాను. 

అంతే కాకుండా, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములతో  మరియు స్నెహితులతో కథానాయకుడికి ఉన్న అనుబంధానికి  నిలయం అయ్యింది బాదం చెట్టు.

ఇంచుమించుగా ప్రతి ఒక్క పాఠకుడికి  కథానాయకుడి  బాల్యంలొ తమకి తమ బాల్యం ప్రతిబింబించే విధంగా రచయిత కథనం సాగించారు. నిద్ర లేవ గానె బాదం చెట్టు కిందకి పండి రాలిన బాదం కాయల కోసం పరిగెత్తటం, బాదం ఆకులలో ఫలహారం తినడం, బాదం కొమ్మలకి ఉయ్యాలలు  వెయ్యటం, చెట్టు నీడలో బొమ్మల పెళ్ళిల్లు ఇంక ఎన్నెన్నొ ఆటలు చిన్న చిన్న పొట్లాటలతొ మదురమైన జ్ఞాపకాలు తీయని కలలాగ కంటి ముందు కదులుతుంది.

ఈ నాటి హడావిడి  జీవితాలలో ఇప్పటి పిల్లలకి  ఇలాంటి మధురానుభూతులు కరువవుతున్నాయి అని రచయిత హృదయాన్ని స్పృసించే విధంగా  చెప్పారు. కథ చివర్లొ కథానాయకుడు తన పాత ఇంటి దగ్గరున్న బాదం చెట్టు ని చూడడానికి  వెళ్ళి ఒక సారి అ బాదం రుచి చుసి "నేనుండే కాంక్రీట్ జంగిల్‌లో మా పిల్లలకి ఇంతవరకూ బాదం పప్పు రుచి తెలీదు" అని అనుకోవడం మనల్ని ఆలొచింపజేస్తుంది.

- లాస్య రామకృష్ణ 


కాలేజీ స్టొరీ

ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక - 28th October, 2010 లో ప్రచురింపబడింది. 


క్క క్క క్క....కాలేజీ స్టొరీ....

రమ్య ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు. 'ఎందుకు వెళ్ళలేదా?' అని తీవ్రంగా ఆలోచించాను. ఎంతకీ తట్టలేదు. మొన్నొకసారి... 'ఫ్రెషర్స్ డే' వస్తోంది... వెళ్ళను' అంది. బహుశా, ఇవాళ ఫ్రెషర్స్ డే అయి ఉండొచ్చు. కానీ తన ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఫ్రెషర్స్ డే ఎలా జరిగిందని అడగడం విన్నాను. 

అంటే, ఇవాళ రమ్య ఎందుకు కాలేజీ కి వెళ్ళలేదు? ఎలాగైనా కనిపెట్టాలి? 

'ఇన్నిడైలాగులెందుకు  డైరెక్ట్ గా అడగొచ్చు కదా...' అనుకుంటున్నారా? కానీ డైరెక్ట్ గా అడిగేస్తే...సీరియల్ డైరెక్టర్ అవ్వాలన్న న కోరిక తీరదు. ఏ విషయమైనా పరిపరివిధాలా మనసులో అలోచించి...మనలో మనం పైకి వినపడేలా మాట్లాడుకోవడమే సీరియల్ లో కేరెక్టర్ లక్షణం. కాబట్టి ఈ ఎపిసోడ్ చివరికల్లా...రమ్య ఎందుకు కాలేజీ కి వేల్లలేదో కనుక్కుంటాను. ఇట్స్ మై ప్రామిస్..అఫ్ కోర్స్...ఇలాంటి సిల్లి ఛాల్లెంజ్ లు కూడా సీరియల్స్ లో ని కేరెక్టర్స్ ని చూసి నేర్చుకున్నాను. 

రమ్య వంటింట్లోకి వెళ్ళింది. వంట చెయ్యడానికనుకున్నారా? దాని కంత సీను లేదు. మంచి నీళ్ళు తాగడానికి వెళ్ళింది. ఇంకా...రమ్య ఎందుకు కాలేజీ కి వెళ్ళలేదు...అనే విషయం ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ తట్టలేదు.

రమ్య బయటికి వచ్చింది. బుక్స్ తీసింది. చదువుకుంటుంది అనుకుంటున్నారా? కరెక్టే...అక్కౌంట్స్ చేసుకుంటోంది. దానికో డౌట్ వస్తే నన్ను అడిగింది. ఆ డౌట్ క్లియర్ చేశాను. 

అయితే ఇప్పటికి నా మనసుని తొలిచేస్తున్న ప్రశ్నకి ఆన్సర్ దొరకలేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లోపు సాయంత్రం ఆరయింది. సిరియస్ గా సిరియల్స్ ని ఫాలో అయ్యే నేను టీవీ స్విచ్ ఆన్ చేశాను. అప్పుడర్ధమైంది రమ్య కాలేజీ కి ఎందుకెల్లలేదో?

టీవీ లో 'సండే స్పెషల్ మూవీ' అనే బ్యాంగ్ పడింది. అంటే...ఇవాళ ఆదివారం. సండే కాలేజీలకు హాలిడే...స్టూడెంట్స్ కి జాలిడే కదా.

'హ హ హ...కనిపెట్టేసా...రమ్య కాలేజీ కెందుకు వేల్లలేదో...నేనిప్పుడే కనిపెట్టేసా'.

-లాస్య రామకృష్ణ 


Jan 6, 2012

ఇల్లాలి ముచ్చట్లు

నేను ఇటివలే హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు నాన్నగారి దగ్గర 'పురాణం సీత' గారు రచించిన "ఇల్లాలి ముచ్చట్లు" అనే బుక్ చూసాను. అ పుస్తకం లోని రచనలు నన్నెంతగానో  ఆకర్షించాయి. నేను తిరిగి బెంగుళూరు వచ్చేటప్పుడు ఆ బుక్ నాతో పాటే తెచ్చుకున్నాను.

ఆ పుస్తకపు విశేషాలు మీతో పంచుకోవాలనిపించింది. మీకోసం ఆ పుస్తకానికి సంబందించిన కొన్ని విషయాలు.......

ఇందులోని వ్యాసాలు 1960 దశకంలో మొదలై 1990 దాకా ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో వెలువడ్డాయి." ఈ వ్యాసాలలో చమత్కారం నాకు బాగా నచ్చింది. అలాంటి కోవకే చెందినా ఒక వ్యాసం "పరుపు కింద పైజమా" గురించి మీతో పంచుకుంటున్నాను.

"పరుపుకింద పైజమా"


ఒకసారి సితగారి కజిన్ లలిత అనే అమ్మాయి ఉన్నట్టుండి ఏడుస్తూ పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి ఆరో నెలో ఏడో నెలో అట.  ఏడుస్తూ సడన్ గా ఎందుకు వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచి ఉన్నాయ్ కదా కొంత కాలం ఆగాక అసలు విషయం అడగవచ్చని ఊరుకుంటారు.

సరే కొంత సమయం ఇచ్చి విషయం తెలుసుకుందామంటే ఎంతకీ ఆ అమ్మాయి  చెప్పనే  చెప్పదు. సరే తన వంతు ప్రయత్నంగా ఆ అమ్మాయని సంతోష పెట్టటానికి రక రకాల పిండి వంటలు చేసి పెడ్తుంది సీత. ఇంకా ఆ విషయం ఈ విషయం అని తన మనసు ని ధ్యాస మరల్చడానికి ప్రయత్నిస్తుంది.కానీ ఇవ్వేవి పలితాన్ని ఇవ్వవు, అన్ని తిని కూడా ఆ అమ్మాయి దిగులుగా ఉండేది.

ఇహ ఇలా కాదని ఆ అమ్మాయని మళ్ళి గట్టిగ ప్రశ్నిస్తే ఆ అమ్మాయ్ చెప్పిన విషయం ఏంటంటే
వాళ్ళ అయన క్యాంపు ల ఉద్యోగం చేస్తుంటాడు. అలా క్యాంపు ల మీద నెల అంతా తిరిగి ఇంటికి వచ్చిన ఒక రోజు ( సీత గారు వ్యక్తీకరణ ఇక్కడ చమత్కారంగా ఉంటుంది అందుకే తను రాసిన వాక్యాలే యదాతధంగా ఇక్కడ వ్రాస్తున్నాను) పొట్టపగిలేల భోంచేసి, తమలపాకులు నములుతూ గేదె దూడ లాగ  పందిరి మంచం మీద పవళించి లేచి ఎందుకో(నల్లికుట్టింది కాబోసు) పరుపు ఎత్తగానే దానికింద ఒక పైజమా చారల చారలది కనిపించిందట. దాంతో ఆగ్రహోదగ్రుడై గుడ్డ్లెర్ర జేస్తూ "ఈ పైజమా ఎవరిదే" అని అడిగి ఫో కులట ఫో పుట్టింటికని పనిమనిషి సహయం ఇచ్చి పంపించాడు.

ఈ పరుపు కింద పైజమా మిస్టరీ ఎంతకీ అంతుబట్టదు సితగారికి.

ఒకసారి, సితగారు ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి చెక్ అప్ కి తెసుకెలుతుంది. పన్లోపనిగా లేడీ డాక్టర్ని "'పరుపు కింద పైజమా గురించి మీకు తెలుసా" అని అడుగుతుంది. డాక్టర్ తెల్లబోయి సితగారిని "రండి మిమ్మల్ని చెక్ అప్ చెయ్యాలి అంటుంది" అప్పుడు "మీ పరుపు కింద పైజమా ఉందా" అని డాక్టర్ ని అడుగుతుంది. లేడీ డాక్టర్ అయిన పెళ్ళికాని లేడీ యే కనుక కొంచెం సిగ్గు పడి, కొంచెం ఎర్రబడి, ఇంకా అంత వరకు రాలేదన్నట్లు నవ్వి ఒక చీటి రాసిచ్చి, " ఈ బిళ్ళలు మూడు పుటల పుచ్చుకుని, పాలు తాగి పడుకో"మని చెప్పింది.

ఇంతకి ఈ సమస్య పరిష్కరించేది సీత గారి భర్త. అతను లలితతో "మీ ఇంట్లో చాకలి పద్దు ఎవరు వేస్తారు నువ్వా మీ ఇడియట్ వేస్తాడా  అని అడగగానే ఆ అమ్మాయికి విషయం అర్ధమయిపోయింది ఒక నవ్వు నవ్వుతుంది. వెంటనే లలిత మొగుడికి ఇతను విషయం వివరించి ఉత్తరం రాస్తాడు. వెంటనే ఆ అమ్మాయి మొగుడు వచ్చి లలితను తీసుకెళతాడు.

అసలు విషయం అర్ధం కానీ సితగారు అయోమయం లో ఉండగా ఆవిడా భర్త ఇలా వివరిస్తాడు. చాకలి ఇచ్చిన వేరేవరిదో పైజమా లలిత మొగుడు నిద్రమత్తులో తీసుకుని పరుపుకింద పెట్టి తర్వాత క్యాంపు కి వెళ్ళిపోయాడు. వచ్చాక ఆ విషయం మర్చిపోయి లలిత మీద అనుమానపడ్డాడు. ఇది జరిగిన కధ అని వివరిస్తాడు.

ఇంకొక విశేషమేమిటంటే పురాణం సీత పేరుతో రచనలు చేసింది ప్రసిద్ద రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ. 


-లాస్య రామకృష్ణ 

Jan 5, 2012

ప్రియమైన తెలుగు బ్లాగ్ వీక్షకులకి...

ప్రియమైన తెలుగు బ్లాగ్ వీక్షకులకి నా నమస్కారాలు, 

నా బ్లాగ్ ని సాహిత్యాభిమానం తో ప్రోత్సహిస్తున్నందుకు నా ధన్యవాదాలు. 

మన సీరియల్ ముచట్లు బ్లాగ్ ద్వారా ఇప్పటికే నేను నా అభిప్రాయాలూ ఎన్నో మీతో పంచుకుంటూ వస్తున్నాను. 

అయతే ఈ మధ్యనే నేను ఒక పుస్తకం చదివాను. అది నన్ను ఎంతో ఆకర్షించింది. అ పుస్తకం యొక్క విశేషాలు మీతో పంచుకోవాలనిపించింది. వెంటనే బ్లాగ్ లో పోస్ట్ చేద్దామని అనుకుని కాస్త సందేహపడ్డాను. 

మొన్న, ఈ టీవీ న్యూస్ చూస్తూ అందులో నన్ను ఆకర్షించిన అంశాల గురించి ఇందులో పోస్ట్ చేద్దామని మళ్లీ వెనకడుగు వేసాను. 

ఎందుకంటే, ఈ బ్లాగ్ ని నేను సీరియల్ ముచట్లు అనే టైటిల్ తో వాటి కోసం ప్రారంభించడం వల్ల వాటికే పరిమితం చెయ్యాలేమో అనే సందేహం వచ్చింది.

అప్పుడు మా వారి సలహా అడిగాను. మా వారు "కాదేది బ్లాగ్ కి అనర్హం" అని శ్రీ శ్రీ సాక్షి గా అన్నారు. 

ఈ బ్లాగ్ ని కేవలం సీరియల్ ముచట్లకే పరిమితం చెయ్యకుండా మరెన్నో ముచట్లు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మీ లాస్యరామకృష్ణ .
Jan 4, 2012

సుమంగళి లో హెల్మెట్ వీరుడు....

సుమంగళి లో హెల్మెట్ వీరుడు 


ఈ మధ్యనే జెమిని టీవీ లో "సుమంగళి" అనే డైలీ సీరియల్ ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ప్రతి రోజు మధ్యాహ్నం ౩ గంటలకు ప్రసారమవుతుంది.

ఈ సీరియల్ ముచట్లు ఏంటంటే, దర్శకుడు అడుగడుగునా సస్పెన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. ఇంకా ఇప్పటివరకు జరిగిన కథ ఏంటంటే...


తన రెండో కూతురి పెళ్లి హడావుడిలో ఉన్న దంపతులను, వారి పెద్దల్లుడి విషయం ప్రస్తావనకి తేగా తడబడి సరిగా చెప్పలెనందుకు పెళ్లికొడుకి తల్లి ఆ పెళ్లి పీటల మీదనే అపించేస్తుంది. అదే పెళ్లి మంటపంలో ఉన్న పెద్దల్లుడు ఆ పెద్దల్లుడు ఆ పెళ్లి ఆగిపోయినందుకు చాల సంతోషిస్తాడు. ఈ లోపు సడెన్ గా హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఆ కళ్యాణ మంటపంలోకి ప్రవేశించి పెల్లికుతురికి తాళి కడతాడు. అక్కడున్న అందరు ఆ వ్యక్తి ని చూసి ఆశ్చర్యపోతుండగా ఆ ఇంటి పెద్దల్లుడు అతడిని పొడిచేస్తాడు. ఇంకా ఎవరో కొందరు రౌడీలు అతడిని ఎటాక్ చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఆ హెల్మెట్ వీరుడు వెంటనే అక్కడినుంచి నిష్క్రమిస్తాడు. ఇది ఇప్పటివరకు జరిగిన కధ.


ప్రేక్షకుల స్పందన 


ఇంతకి ఆ అమ్మాయికి చివరి నిమిషంలో తాళి కట్టిన వ్యక్తీ ఎవరు? అతడు మంచివాడా? లేక చెడ్డవాడా? అతను అల ప్రవర్తించడానికి కారణమేమిటి?

ఇవి సగటు ప్రేక్షకుల మదిలో ఉన్న ప్రశ్నలు.......


Jan 3, 2012