'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 5, 2012

ప్రియమైన తెలుగు బ్లాగ్ వీక్షకులకి...

ప్రియమైన తెలుగు బ్లాగ్ వీక్షకులకి నా నమస్కారాలు, 

నా బ్లాగ్ ని సాహిత్యాభిమానం తో ప్రోత్సహిస్తున్నందుకు నా ధన్యవాదాలు. 

మన సీరియల్ ముచట్లు బ్లాగ్ ద్వారా ఇప్పటికే నేను నా అభిప్రాయాలూ ఎన్నో మీతో పంచుకుంటూ వస్తున్నాను. 

అయతే ఈ మధ్యనే నేను ఒక పుస్తకం చదివాను. అది నన్ను ఎంతో ఆకర్షించింది. అ పుస్తకం యొక్క విశేషాలు మీతో పంచుకోవాలనిపించింది. వెంటనే బ్లాగ్ లో పోస్ట్ చేద్దామని అనుకుని కాస్త సందేహపడ్డాను. 

మొన్న, ఈ టీవీ న్యూస్ చూస్తూ అందులో నన్ను ఆకర్షించిన అంశాల గురించి ఇందులో పోస్ట్ చేద్దామని మళ్లీ వెనకడుగు వేసాను. 

ఎందుకంటే, ఈ బ్లాగ్ ని నేను సీరియల్ ముచట్లు అనే టైటిల్ తో వాటి కోసం ప్రారంభించడం వల్ల వాటికే పరిమితం చెయ్యాలేమో అనే సందేహం వచ్చింది.

అప్పుడు మా వారి సలహా అడిగాను. మా వారు "కాదేది బ్లాగ్ కి అనర్హం" అని శ్రీ శ్రీ సాక్షి గా అన్నారు. 

ఈ బ్లాగ్ ని కేవలం సీరియల్ ముచట్లకే పరిమితం చెయ్యకుండా మరెన్నో ముచట్లు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మీ లాస్యరామకృష్ణ .
2 comments:

నిరంతరమూ వసంతములే.... said...

మీ బ్లాగును ఇప్పుడే చూస్తున్నా లాస్య గారు. బాగుంది.

Lasya Ramakrishna said...

ధన్యవాదములు సురేష్ గారు. నా పాత పోస్ట్ కూడా ఓపికగా చదివి కామెంట్ పెట్టినందుకు. నా బ్లాగ్ కి స్వాగతం.