'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 6, 2012

ఇల్లాలి ముచ్చట్లు

నేను ఇటివలే హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు నాన్నగారి దగ్గర 'పురాణం సీత' గారు రచించిన "ఇల్లాలి ముచ్చట్లు" అనే బుక్ చూసాను. అ పుస్తకం లోని రచనలు నన్నెంతగానో  ఆకర్షించాయి. నేను తిరిగి బెంగుళూరు వచ్చేటప్పుడు ఆ బుక్ నాతో పాటే తెచ్చుకున్నాను.

ఆ పుస్తకపు విశేషాలు మీతో పంచుకోవాలనిపించింది. మీకోసం ఆ పుస్తకానికి సంబందించిన కొన్ని విషయాలు.......

ఇందులోని వ్యాసాలు 1960 దశకంలో మొదలై 1990 దాకా ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో వెలువడ్డాయి." ఈ వ్యాసాలలో చమత్కారం నాకు బాగా నచ్చింది. అలాంటి కోవకే చెందినా ఒక వ్యాసం "పరుపు కింద పైజమా" గురించి మీతో పంచుకుంటున్నాను.

"పరుపుకింద పైజమా"


ఒకసారి సితగారి కజిన్ లలిత అనే అమ్మాయి ఉన్నట్టుండి ఏడుస్తూ పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి ఆరో నెలో ఏడో నెలో అట.  ఏడుస్తూ సడన్ గా ఎందుకు వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచి ఉన్నాయ్ కదా కొంత కాలం ఆగాక అసలు విషయం అడగవచ్చని ఊరుకుంటారు.

సరే కొంత సమయం ఇచ్చి విషయం తెలుసుకుందామంటే ఎంతకీ ఆ అమ్మాయి  చెప్పనే  చెప్పదు. సరే తన వంతు ప్రయత్నంగా ఆ అమ్మాయని సంతోష పెట్టటానికి రక రకాల పిండి వంటలు చేసి పెడ్తుంది సీత. ఇంకా ఆ విషయం ఈ విషయం అని తన మనసు ని ధ్యాస మరల్చడానికి ప్రయత్నిస్తుంది.కానీ ఇవ్వేవి పలితాన్ని ఇవ్వవు, అన్ని తిని కూడా ఆ అమ్మాయి దిగులుగా ఉండేది.

ఇహ ఇలా కాదని ఆ అమ్మాయని మళ్ళి గట్టిగ ప్రశ్నిస్తే ఆ అమ్మాయ్ చెప్పిన విషయం ఏంటంటే
వాళ్ళ అయన క్యాంపు ల ఉద్యోగం చేస్తుంటాడు. అలా క్యాంపు ల మీద నెల అంతా తిరిగి ఇంటికి వచ్చిన ఒక రోజు ( సీత గారు వ్యక్తీకరణ ఇక్కడ చమత్కారంగా ఉంటుంది అందుకే తను రాసిన వాక్యాలే యదాతధంగా ఇక్కడ వ్రాస్తున్నాను) పొట్టపగిలేల భోంచేసి, తమలపాకులు నములుతూ గేదె దూడ లాగ  పందిరి మంచం మీద పవళించి లేచి ఎందుకో(నల్లికుట్టింది కాబోసు) పరుపు ఎత్తగానే దానికింద ఒక పైజమా చారల చారలది కనిపించిందట. దాంతో ఆగ్రహోదగ్రుడై గుడ్డ్లెర్ర జేస్తూ "ఈ పైజమా ఎవరిదే" అని అడిగి ఫో కులట ఫో పుట్టింటికని పనిమనిషి సహయం ఇచ్చి పంపించాడు.

ఈ పరుపు కింద పైజమా మిస్టరీ ఎంతకీ అంతుబట్టదు సితగారికి.

ఒకసారి, సితగారు ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి చెక్ అప్ కి తెసుకెలుతుంది. పన్లోపనిగా లేడీ డాక్టర్ని "'పరుపు కింద పైజమా గురించి మీకు తెలుసా" అని అడుగుతుంది. డాక్టర్ తెల్లబోయి సితగారిని "రండి మిమ్మల్ని చెక్ అప్ చెయ్యాలి అంటుంది" అప్పుడు "మీ పరుపు కింద పైజమా ఉందా" అని డాక్టర్ ని అడుగుతుంది. లేడీ డాక్టర్ అయిన పెళ్ళికాని లేడీ యే కనుక కొంచెం సిగ్గు పడి, కొంచెం ఎర్రబడి, ఇంకా అంత వరకు రాలేదన్నట్లు నవ్వి ఒక చీటి రాసిచ్చి, " ఈ బిళ్ళలు మూడు పుటల పుచ్చుకుని, పాలు తాగి పడుకో"మని చెప్పింది.

ఇంతకి ఈ సమస్య పరిష్కరించేది సీత గారి భర్త. అతను లలితతో "మీ ఇంట్లో చాకలి పద్దు ఎవరు వేస్తారు నువ్వా మీ ఇడియట్ వేస్తాడా  అని అడగగానే ఆ అమ్మాయికి విషయం అర్ధమయిపోయింది ఒక నవ్వు నవ్వుతుంది. వెంటనే లలిత మొగుడికి ఇతను విషయం వివరించి ఉత్తరం రాస్తాడు. వెంటనే ఆ అమ్మాయి మొగుడు వచ్చి లలితను తీసుకెళతాడు.

అసలు విషయం అర్ధం కానీ సితగారు అయోమయం లో ఉండగా ఆవిడా భర్త ఇలా వివరిస్తాడు. చాకలి ఇచ్చిన వేరేవరిదో పైజమా లలిత మొగుడు నిద్రమత్తులో తీసుకుని పరుపుకింద పెట్టి తర్వాత క్యాంపు కి వెళ్ళిపోయాడు. వచ్చాక ఆ విషయం మర్చిపోయి లలిత మీద అనుమానపడ్డాడు. ఇది జరిగిన కధ అని వివరిస్తాడు.

ఇంకొక విశేషమేమిటంటే పురాణం సీత పేరుతో రచనలు చేసింది ప్రసిద్ద రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ. 


-లాస్య రామకృష్ణ 

5 comments:

రసజ్ఞ said...

బాగుందండీ! ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పినా లేదా లింకు జత చేసినా నా బోటి వాళ్లకి చదవడానికి వీలుంటుంది!

Lasya Peddada said...

dhanyavadhalu rasajna garu..

http://www.supatha.in/index.php/categories/humour/illali-muchatlu.html

మాలా కుమార్ said...

ఇల్లలి ముచ్చట్లు బాగుంటాయి .

Lasya Peddada said...

avunandi chala muchataga untai...

Ramya said...

laasya gaaru...
mee blog follow avutunna. chaala baagundi. serial muchatly kakunda books gurinch meeru prastavistunnaru. interesting vishayalu inkaa chaala chaptaarani...cheppalani korukuntoo
abhinandanalatoo
Ramya