'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 12, 2012

నీవు రావు, నిదుర రాదు.........

నీవు రావు, నిదుర రాదు......... 

ఈ సోమవారం వచ్చిన పాడుతా తీయగా ప్రోగ్రాం లో పార్టిసిపంట్స్ అందరు మంచి పాటలు ఎంచుకుని పాడారు. ఈ ప్రోగ్రాం ద్వారా మనకు తెలియని మంచి పాటలు ఎన్నిటి గురించో మనం తెలుసుకుని ఆస్వాదించవచ్చు. అందులో ఒక అమ్మాయి "నీవు రావు, నిదుర రాదు' అనే పాట పాడింది. అ పాట నేను అదే వినడం. కానీ ఎంత బాగుంది ఆ పాట. సాహిత్యపరంగా కానీ, సంగిత పరంగా కానీ, ఆ పాట ఒక అద్బుతం. 

విరహ వేదనని ఎంత బాగా అక్షరాలలో ఏర్చి కూర్చాడు ఆ రచయిత. ఆ రచయిత పేరు నేను వినలేదు. మిస్ అయ్యాను అప్పుడు. అనుకోకుండా ఆ పాట వినడం జరిగింది. ఎలాగైనా ఆ రచయిత పేరు తెలుసుకుంటాను. నాకు నచ్చిన ఈ పాట సాహిత్యం మీ కోసం.


నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

తారా జాబిలి ఒకటై సరసమడే ఆ రేయి......ఆ.....ఆ...
చింతా చీకటి ఒకటై చిన్నబోయే ఈ రేయి 

నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....


ఆశలు మదిలో విరిసే దోసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసే దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ ఆలయాన చేరి చూడ
స్వామి కాన రాడాయె నా స్వామి కాన రాడాయె


నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే...
ఎదురు చూసి ఎదురు చూసి
ఎదురు చూసి ఎదురు చూసి 
కన్నుదోయి  అలసిపోయే 

నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

- లాస్య రామకృష్ణ.3 comments:

మధురవాణి said...

నాక్కూడా చాలా ఇష్టమండీ ఈ పాట.. పూల రంగడు సినిమాలో శోభన్ బాబు, విజయనిర్మల మీద చిత్రీకరించారు ఈ పాట. దాశరథి గారు రాసిన ఈ పాటని సాలూరి రాజేశ్వరరావు గారు స్వరపరిచారు.
http://www.youtube.com/watch?v=qPzGNqf1KYE

రసజ్ఞ said...

ఇది పూలరంగడు సినిమాలో దాశరధి గారు వ్రాసిన పాట.
ఆశలు మదిలో విరిసే దోసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసే దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ ఆలయాన చేరి చూడ
స్వామి కాన రాడాయె నా స్వామి కాన రాడాయె అనే చరణం మరిచారు
ఆఖరిలో ఎదురు చూసి చూసి కన్నుదోయి అలసిపోయే అని సరిచేయండి.

Lasya Peddada said...

మధురవాణి గారు, ఈ పాట లింక్ ఇచ్చినందుకు, పాట రచయిత గురించి తెలిపినందుకు ధన్యవాదాలండి.

రసజ్ఞ గారు ఇంకొక చరణం ఉందని తెలియజెసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా సరి చెస్తాను.