'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 21, 2012

మీరూ స్పందించారా???

ఆపదలోని ఉన్న వారిని ఆదుకోవడానికి ఏ వ్యాపారవేత్తో లేదా పెద్ద ఉద్యోగో కానక్కర్లేదు. ఓంకారనాథ్ శర్మ లాంటి మంచి మనసుంటే చాలు. మార్గం కళ్ళముందు ఉంటుంది. 

అతను నోయిడా లోని ఓ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్. జీతం తనకే సరిగా సరిపోదు. తనకొక మతి స్తిమితం లేని కొడుకు మందులకి కూడా ఖర్చు చాలా అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా అతను పరులకు సహాయం చెయ్యడానికి పూనుకున్నారు. మనసుంటే మార్గముంది అని నిరూపించారు . ఎలా అంటారా? చదవండి.

ఇంటింటికి తిరిగి "మీ ఇంట్లో మీరు జలుబుకో, జ్వరానికో మందులు తెచ్చుకుని ఉండుంటారు. మిగిలిపోయిన ఆ మందులు వేరే వారికీ ఉపయోగపడతాయి. దయచేసి ఇవ్వండి" అని అడుగుతారు. ఎంతో మంది స్పందించి ఇతనికి మందులు ఇవ్వడం ప్రారంబించారు. వాటిని ఇంటికి తీసుకువచ్చి Expire అవ్వని మందులని ఒక చోట చేర్చి ప్యాక్ చేసి అవసరార్దులకి పంచిపెడతారు. ఇలా ఎంతో మంది పేదల ప్రాణాలను ఇతను కాపాడారు.

ఓంకార్ నాథ్ శర్మ 
ఇతని మంచి మనసుకి స్పందించి ఎంతో మంది వీరి ఇంటికి Courier లో కూడా మందులు పంపిస్తున్నారు. ఇలాంటి వారిలో మీరు వున్నారా అయితే .....ఈ క్రింది చిరునామాకి మందులు Courier చెయ్యండి.


ఓంకార్ నాథ్ శర్మ 
B-180, Street no.4 (Mandyali galli)
Manglapuri, Phase -2, 
Delhi - 110045 
PH. 092502 43298- లాస్య రామకృష్ణ 4 comments:

రసజ్ఞ said...

చాలా విలువయిన సమాచారం లాస్య గారూ! కలిగా పడి ఉన్న వాటిని చక్కగా అవసరార్ధం ఉపయోగించే ఈయనకి చేతనైన సాయం చేద్దాం.

Lasya Ramakrishna said...

మీ స్పందనకు ధన్యవాదాలు రసజ్ఞ గారు.

Ramakrishna said...

చాల గొప్ప వ్యక్తి గురించి రాసారండి లాస్యగారు..థాంక్స్

Lasya Ramakrishna said...

కాదేది సహాయానికనర్హం అని రుజువు చేసిన ఒంకార్నాథ్ శర్మ గారి గురించిన ఆర్టికల్ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.