'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 26, 2012

మాటే మంత్రము...
   ఒకానొక అడవిలో నాలుగు  కప్పలు ప్రయాణిస్తున్నాయి.  అనుకోకుండా, రెండు కప్పలు లోతైన గుంటలో పడిపోయాయి. అవి బయటికి రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కాని లోతైన గుంట కావడం వల్ల తిరిగి పడిపోసాగాయి. తిరిగి ప్రయత్నించసాగాయి. మరల పడిపోసాగాయి. పైనున్న మిగతా కప్పలు వీటితో "మీరెంత కష్టపడిన బయటికి రావడం కష్టం" అని పదే పదే హెచ్చరించసాగాయి. 

   వీరి మాటల ప్రభావం వల్ల, అసలే అలసిపోయిన ఒక కప్ప తన ప్రయత్నం విరమించుకుంది. మరొక కప్ప మాత్రం పట్టు విడువ కుండ ప్రయత్నిస్తూనే ఉంది. పైనున్న కప్పలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ప్రయత్నించగా, ప్రయత్నించగా చివరికి ఈ కప్ప గుంటలోంచి బయటికి వచ్చింది.

   అప్పుడు మిగతా కప్పలు "భలే వచ్చావే!!!మేము చెప్పినది నీకు వినపడలేదా?" అని అడిగాయి. అర్ధం కానీ అ కప్ప ఏమిటని ప్రశ్నించింది? చెప్పగా చెప్పగా మిగతా కప్పలకి అసలు విషయం అర్ధమైంది. ఈ కప్పకి చెవుడు. వీళ్ళు బయటికి రమ్మని ప్రోత్సహిస్తున్నారనుకుని ప్రయత్నించి వచ్చింది. వీరి మాటలు విన్న గుంటలో ఉన్న కప్ప ఉపిరాడక చనిపోయింది.

   ఈ పిట్ట కధ ద్వారా మనం రెండు విషయాలు గమనించవచ్చు.
అవేంటంటే.....

మొదటిది  
మనం మాట్లాడే ప్రతి మాట ఎంతో విలువైనది.ఒకరికి ప్రాణం పోసే శక్తి, ప్రాణం తీసే శక్తి మాటలోనే ఉంది. ప్రోత్సహిస్తున్నారనుకుని చెవిటి కప్ప బయటికి వచ్చింది. మిగతా కప్పల మాటలు విన్న కప్ప గుంటలో మరణించింది.


రెండవది  
ఒకరు ప్రోత్సహిస్తే నే మనం అనుకున్నది సాధిస్తాం అనుకోకుండా నిరుత్సాహపరిచినా కూడా మనం చేసేది          
సరి అయినది అని మనకి తెలిసినపుడు మన ప్రయత్నాన్ని విరమించకూడదు  ఎందుకంటే, ప్రతిసారి మనల్ని ప్రోత్సహించే వారు ఉండరు. స్వార్ధపరులే ఎక్కువ శాతం ఉన్న ఈ ప్రపంచంలో మనం అనుకున్నది మనం చెయ్యగల ఆత్మవిశ్వాసం మనకుండాలి. అదే సెల్ఫ్ మోటివేషన్.

 - లాస్య రామకృష్ణ.

10 comments:

రాజి said...

"మాటే మంత్రము" నిజమేనండీ
సెల్ఫ్ మోటివేషన్ గురించి చాలా బాగా చెప్పారు..
కప్ప కధ బాగుంది.

రసజ్ఞ said...

చాలా బాగుందండీ! చక్కగా చెప్పారు! అందుకే ఎవరో పెద్దలు అన్నారు అందరు చెప్పిందీ విను కాని నీ మనస్సాక్షి చెప్పింది నడుచుకో అని!

జ్యోతిర్మయి said...

'సెల్ఫ్ మోటివేషన్' గురుంచి అర్ధవంతమైన కథ ద్వారా బాగా చెప్పారు.

Ramakrishna said...

nice one! :)

PVDS Prakash said...

superb story.

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు రాజి గారు.

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు రసజ్ఞ గారు.

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు జ్యోతిర్మయి గారు.

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు రామకృష్ణ గారు.

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు ప్రకాష్ గారు.