'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 8, 2012

కాలేజీ స్టొరీ

ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక - 28th October, 2010 లో ప్రచురింపబడింది. 


క్క క్క క్క....కాలేజీ స్టొరీ....

రమ్య ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు. 'ఎందుకు వెళ్ళలేదా?' అని తీవ్రంగా ఆలోచించాను. ఎంతకీ తట్టలేదు. మొన్నొకసారి... 'ఫ్రెషర్స్ డే' వస్తోంది... వెళ్ళను' అంది. బహుశా, ఇవాళ ఫ్రెషర్స్ డే అయి ఉండొచ్చు. కానీ తన ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఫ్రెషర్స్ డే ఎలా జరిగిందని అడగడం విన్నాను. 

అంటే, ఇవాళ రమ్య ఎందుకు కాలేజీ కి వెళ్ళలేదు? ఎలాగైనా కనిపెట్టాలి? 

'ఇన్నిడైలాగులెందుకు  డైరెక్ట్ గా అడగొచ్చు కదా...' అనుకుంటున్నారా? కానీ డైరెక్ట్ గా అడిగేస్తే...సీరియల్ డైరెక్టర్ అవ్వాలన్న న కోరిక తీరదు. ఏ విషయమైనా పరిపరివిధాలా మనసులో అలోచించి...మనలో మనం పైకి వినపడేలా మాట్లాడుకోవడమే సీరియల్ లో కేరెక్టర్ లక్షణం. కాబట్టి ఈ ఎపిసోడ్ చివరికల్లా...రమ్య ఎందుకు కాలేజీ కి వేల్లలేదో కనుక్కుంటాను. ఇట్స్ మై ప్రామిస్..అఫ్ కోర్స్...ఇలాంటి సిల్లి ఛాల్లెంజ్ లు కూడా సీరియల్స్ లో ని కేరెక్టర్స్ ని చూసి నేర్చుకున్నాను. 

రమ్య వంటింట్లోకి వెళ్ళింది. వంట చెయ్యడానికనుకున్నారా? దాని కంత సీను లేదు. మంచి నీళ్ళు తాగడానికి వెళ్ళింది. ఇంకా...రమ్య ఎందుకు కాలేజీ కి వెళ్ళలేదు...అనే విషయం ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ తట్టలేదు.

రమ్య బయటికి వచ్చింది. బుక్స్ తీసింది. చదువుకుంటుంది అనుకుంటున్నారా? కరెక్టే...అక్కౌంట్స్ చేసుకుంటోంది. దానికో డౌట్ వస్తే నన్ను అడిగింది. ఆ డౌట్ క్లియర్ చేశాను. 

అయితే ఇప్పటికి నా మనసుని తొలిచేస్తున్న ప్రశ్నకి ఆన్సర్ దొరకలేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లోపు సాయంత్రం ఆరయింది. సిరియస్ గా సిరియల్స్ ని ఫాలో అయ్యే నేను టీవీ స్విచ్ ఆన్ చేశాను. అప్పుడర్ధమైంది రమ్య కాలేజీ కి ఎందుకెల్లలేదో?

టీవీ లో 'సండే స్పెషల్ మూవీ' అనే బ్యాంగ్ పడింది. అంటే...ఇవాళ ఆదివారం. సండే కాలేజీలకు హాలిడే...స్టూడెంట్స్ కి జాలిడే కదా.

'హ హ హ...కనిపెట్టేసా...రమ్య కాలేజీ కెందుకు వేల్లలేదో...నేనిప్పుడే కనిపెట్టేసా'.

-లాస్య రామకృష్ణ 


2 comments:

PVDS Prakash said...

Laasya garu

Mee kadha chadivanu. chinna kadha ainaa kosamerupu chalaa baagundi. inkaa mee rachanalu untay blogloo unchandi.
abhinandanaltoo
Pvds Prakash

Lasya Peddada said...

Thank you prakash garu...