'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 31, 2012

మీక్కూడా ఇలాంటి కలలు వస్తాయా?

అదేంటో అప్పుడప్పుడు నాకు చాలా విచిత్రమైన కలలు వస్తుంటాయి. అవి ఎలాంటి కలలంటే, నిజజీవితానికి ఆ కలలకి ఎటువంటి సంబంధం ఉండదు. అందుకేనేమో, వాటిని కలలు అంటారు. 

అలాంటి కలలు ఇవి కొన్ని. 

1. రోజు వచ్చే ఆఫీసు క్యాబ్ బదులు ఒకసారి షేర్ ఆటో వచ్చింది. (రేసిషన్ టైం లో వచ్చిన కలలెండి).
2.ఒకసారి ఏకంగా ఫ్లైట్ వచ్చేసింది నన్ను ఆఫీసుకి పిక్ అప్ చేసుకోవడానికి. 

సినిమాలకు సంబంధించిన కలలైతే బోలెడు. హీరో చిరంజీవి మా ఇంటికొచ్చాడు. త్రిష, తరుణ్ లకి నేను భోజనం వడ్డించాను. 

ఇవన్ని ఆహ్లాదాన్నికలిగించే కలలైతే అప్పుడప్పుడు భయాన్ని కలిగించే కలలు కూడా వస్తుంటాయి.

రాత్రిపూట చంద్రుడు నిండుగా ఉన్నప్పుడు కనుచూపు మేరలో ఎవరూ ఉండరు.
నేను పరిగెడుతున్నట్టు, ఎవరో వెంబడిస్తున్నట్టు, ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోతున్నట్టు ఇలా ఎన్నో.

అఫ్ కోర్స్, ఇలాంటి కలలు మనం టెన్షన్ పడుతున్నప్పుడు వస్తుంటాయని ఎక్కడో చదివాను. అందుకే సాధ్యమైనంత వరకు నేను అతిగా టెన్షన్ పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటాను.

ఇవి ఒకవైపయితే, నాకు భక్తీ కలలు కూడా చాల వస్తుంటాయి. 

అమ్మవారు ఎర్రని చీరతో, బోలెడు నగలతో, నిండైన బొట్టుతో ఎంతో అందంగా వస్తుంటారు. 
నేనొక పురాతన గుడికి వెళ్లినట్టు, అక్కడ అందమైన కొలనులో ఆడుకున్నట్టు ఇలా వస్తుంటాయి. ఆ కలలో ఉన్నంత సేపు ఆనందాన్నిస్తాయి. 

అప్పుడప్పుడు నేనసలు చూడని క్రొత్త ప్రదేశాలు కూడా వస్తుంటాయి. అవి ఎంతో రియాలస్టిక్ గా ఉంటాయి. నేను ఆ ప్రదేశం లో ఎన్నో రోజులనుండి ఉండినట్టు అనిపిస్తుందన్నమాట.

క్రొత్త ప్రదేశాలంటే గుర్తొచ్చింది, రెండు మూడేళ్ళ క్రితం అనుకుంట ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఒకతను తనకి కలలో ఎప్పుడు చూడని ప్రదేశం వస్తుండేదని, తానెప్పుడు వెళ్ళని ఆ ప్రదేశం లో ఒక చర్చి కూడా కనిపించేదని. ఒకసారి, అతను అనుకోకుండా తన భార్య బిడ్డలతో ట్రిప్ కి వెళ్ళగా అక్కడ తన కలలో కనిపించిన ప్రదేశం, చర్చి కనిపిస్తే ఆశ్చర్యానికి గురయ్యాడని కలల గురించి ప్రచురించిన కాలమ్ లో అతను తన అనుభవాన్ని పంచుకున్నాడు. 

ఇదిలా ఉంటె మరొక ఆర్టికల్ చదివాను. ఒకతనికి తరచూ ఒక ముసలావిడ కలలోకి వచ్చేది. అతనికి ఆవిడ నిజంగానే ఉండుంటుందని గాఢమైన నమ్మకం ఏర్పడింది. ఇదే విషయం తన ఇంట్లో పెద్దవాళ్ళతో చర్చిస్తే, ఇతను వర్ణించిన ప్రదేశాన్ని బట్టి, ఆవిడ రూపురేఖల్ని బట్టి ఆవిడ ఎక్కడుందో చెప్పారు. ఆ ముసలావిడని కలవడానికి ఇతను ఆ ఊరికి వెళ్ళగా అప్పటికే ఆవిడ మరణిస్తుంది. ఇంతకీ ఆవిడ ఇతని తల్లికి పురుడు పోసిన మంత్రసాని అట. 

ఇలా కలలకి అంతే ఉండదు. 

మనిషిని ఆకాశానికి ఎత్తేస్తాయి
నేలమీదకు పడేస్తాయి
కొత్త ప్రదేశాలకు తీసుకెళతాయి 
జ్ఞాపకాలకు రూపాన్నిస్తాయి

కలల గురించి ప్రసిద్దమైన అభిప్రాయం కూడా ఉంది. అదేంటంటే కలలు భవిష్యత్తును సూచిస్తాయని.

కలలు అందంగా ఉన్న మాత్రాన కలలోనే ఉండిపోలేము. బాధ కలిగించినంత మాత్రాన మెలకువ రాకుండా పోదు. కలలకి భయపడి నిద్రకి దూరం కాలేము. అందమైన కలల కోసం నిద్రలోనే ఉండిపోలేము. 

చివరగా చెప్పొచ్చేదేంటంటే, మంచి కల వచ్చిందనుకోండి మెలకువ వచ్చాక 'ఇది కలా' అని కొంచెం బాధేస్తుంది.అదే పీడకల అనుకోండి, మెలకువ రాగానే 'హమ్మయ్య, ఇది కలా' అనిపిస్తుంది.మొత్తానికి 'ఇది కలా' అని మాత్రం కచ్చితంగా అనిపిస్తుంది.     

10 comments:

మాలా కుమార్ said...

నాకూ ఇలాగే బోలెడు కలలు వస్తుంటాయండి . ఒక్కోసారైతే కలలో తిరిగి తిరిగి పొద్దున లేచేటప్పటి కి అలిసి పోతాను . వళ్ళు నొప్పులు కూడా వస్తాయి :)

రసజ్ఞ said...

కలలపై చక్కని సమీక్ష! త్రిష, తరుణ్ లకి నేను భోజనం వడ్డించాను. అప్పుడు మీరు నీ మనసు నాకు తెలుసు సినిమా చూసారు కదా! ;)
కలలు భవిష్యత్తును సూచిస్తాయని నేను కూడా చదివాను. మీరు చెప్పినట్టు ఎత్తైన ప్రదేశం నుండి పడిపోతున్నట్టు కల వస్తే మనకి చాలా దగ్గర స్నేహితులు దూరమవుతారుట! పైగా ఈ రకమయిన కలలు కేవలం ఎత్తైన ప్రదేశాలంటే భయం ఉన్నవారికి బాగా ఎక్కువగా వస్తాయిట!
నాకసలు కలలు రావటం చాలా తక్కువ వచ్చినప్పుడు మాత్రం చందమామ కథలు, ఒక విఠాలాచార్య సినిమా (నా కలను సినిమాగా తీస్తే! ) ఇలా ఏవేవో ఊహించుకోవచ్చు! కలకానిది విలువైనది పాట గుర్తొచ్చింది!

రాజి said...

"మనిషిని ఆకాశానికి ఎత్తేస్తాయి
నేలమీదకు పడేస్తాయి
కొత్త ప్రదేశాలకు తీసుకెళతాయి
జ్ఞాపకాలకు రూపాన్నిస్తాయి"

కలల గురించి మీరు చెప్పింది బాగుందండీ..

Lasya Ramakrishna said...

మాలాకుమార్ గారు..ఈ సారి కలలోకి వెళ్లేటప్పుడు జండూ బాం మర్చిపోకండి, నేను నా కలల ప్రయాణంలో జండూబాం ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటాను:)

Lasya Ramakrishna said...

రసజ్ఞ గారు, మీకు నచ్చినందుకు ధన్యవాదములు. అవునండి, ఈ సినిమా నేను ఇంటర్లో చేరినప్పుడు వచ్చిందండి. ఇప్పటి వరకు అదేంటో సాంతం ఒక్క సారి కూడా చూడలేకపోయాను. ఎదో ఒక డిస్టర్బన్స్.
'ఎత్తైన ప్రదేశం నుండి పడిపోతున్నట్టు కల వస్తే మనకి చాలా దగ్గర స్నేహితులు దూరమవుతారుట!' అన్నారు కదా ఐతే అది కొంచెం భాధాకరమే. కలకానిది విలువైనది పాట గుర్తురావడం సంతోషం గా ఉంది.
మీ కలను కుడా ఒక సారి మాతో పంచుకోండి.

Lasya Ramakrishna said...

రాజి గారు, కలల గురించి నా అభిప్రాయం మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి.

Anonymous said...

good

Lasya Ramakrishna said...

కష్టేఫలి గారికి ధన్యవాదములు.

nagasai ramya said...

EE kalala artical naaku baaga nacchhindi.

vijju viji said...

naku vachina kalalu prti okati jarugutay.nenu clg lo chadivina prins palki class chepinatu vachindi .epudu ayanaki 83 yers ,nadagara computer coures nerchukuntunaru , elantivi chala nijamayay anduku chala bayam kalalante