'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 24, 2012

తాళం తెచ్చిన తంటనేను మా అయన కలిసి మొన్నసండే అలా బయటికి  వెళ్ళాం. మర్నాడు ఆఫీసు ఉంటుంది కదా, తొందరగా బయలుదేరి రావాలి అని మాట తీసుకుని మరీ బయలుదేరాను. 

బయటికి వెళ్తే టైం మన చేతుల్లో ఉండదు కదా. ఆ రోజు "బిజినెస్ మాన్" సినిమా చూసి, బయటే డిన్నర్ చేసి ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇక మర్నాడు చూడండి నా అవస్త.

ఉదయాన్నే లేచి స్నానం చేసి, దేవునికి దణ్ణం పెట్టుకుని, వంట చేసి, నాకు మా ఆయనకి లంచ్ బాక్స్ సర్దాను. ఇవాల్టికి బ్రేక్ ఫాస్ట్ కి ఉప్మా తో సరిపెట్టుకోండి అని మా శ్రీవారికి చెప్పను. ఆయనకి ఉప్మా పడదాయే!!! కానీ ఏంచేస్తాం. కొన్ని సార్లు తప్పదు కదా అని నా స్టైల్ లో బ్రతిమిలాడాను. అప్పుడు ఒప్పుకున్నారు.

క్యాబ్ వచ్చే టైం అయింది అన్ని రెడీ చేశాను కదా అని ఒక సారి చెక్ చేసుకున్నాను. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. అప్పుడు క్యాబ్ డ్రైవర్ నుంచి ఫోన్ 'మేడం, టైర్ పంక్చర్ అరగంట లేట్ అవుతుంది' అని. సర్లే, ఏదోచ్చిన మన మంచికే కదా అని కాస్త రిలాక్స్ అవుదామనుకున్నాను. చెరొక తాళం తీసుకెళ్ళే అలవాటుండడం వాళ్ళ కాజ్యువల్ గా చూసుకున్నాను. అప్పుడు తెలిసింది, నా దగ్గర తాళం మిస్ అయ్యిందని.

ఇంక వెతుకులాట ప్రారంభం. వంటింట్లో వెతికాను. బెడ్రూం లో వెతికాను. పోపుల పెట్టెలో వెతికాను. మా అయన జేబులో వెతికాను. ఎక్కడ దొరకదాయే. ఇలా వెతుకులాట లో నే అరగంట గడిచిపోయింది. అప్పుడు, మావారు ప్రశాంతంగా పేపర్ చదువుకుంటూ కనిపించారు. 

నేను తాళం కనపడలేదని హడావిడిలో ఉంటే అయన కనీసం ఏ మాత్రం హడావిడి గా లేకుండా పేపర్ చదువుకుంటున్నారు. నా హడావిడి గమనించి నా ప్రాబ్లం ని చిటికలో సాల్వ్ చేసారు. ఎలా అంటారా.

రెగులర్గా నేను మర్చిపోయే చోటే తాళం దొరికింది. అదేనండి టీవీ రిమోట్ దగ్గర. 

ఇలా అరగంటా గడిచిపోయింది. ఈ లోపు క్యాబ్ వచ్చింది.  

- లాస్య రామకృష్ణ 

  


2 comments:

రసజ్ఞ said...

hahaha! మా అమ్మ కూడా ఇంతే! ఎప్పుడూ
మర్చిపోయే చోటే మర్చిపోయి రస్నా (అది నా ముద్దు పెరులెండి! కాకా పట్టి పని చేయించుకోవలసి వచ్చినప్పుడు అలానే అంటుంది) కాస్త ఎక్కడుందో చూడమ్మా అంటుంది!

Lasya Ramakrishna said...

ఔనండి ఇలా జరుగుతూ ఉంటుంది! మీ ముద్దు పేరు చాలా బాగుందండి:)