'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Sep 30, 2012

రాజకీయ జాతర

ప్రచురణ - ఆంధ్రభూమి వారపత్రిక 

రచన - పి వి డి ఎస్ ప్రకాష్ 

ఎడతెరిపి లేని పొలిటికల్ జాతర 
ఇక్కడ విలువలన్నీ నిలువునా పాతర 
నేతలు కళ్ళప్పగించి చూస్తే సరా ...?
ఇపుడు డెమోక్రసీకి కావాలి ఓ ఆసరా!

ఒక్కో లీడరు మేకప్పేసుకొని యాక్టరు 
కేరెక్టర్ ని డిజైన్ చేసుకునే డైరెక్టరు 
అతగాడే స్క్రిప్ట్, డైలాగ్స్ రాసే రైటరు 
ఆ ఎపిసోడ్లను డైలీ చూసే వ్యూయర్...పాపం ఓటరు 

జనం కోసమంటూ డై'లాగుడు'
మైకు కనిపిస్తే మాత్రం చెడుగుడు 
మాటలతో మభ్యపెట్టే మాయగాడు 
నాలిక మడతపడినా తొణకడు బెణకడు

రాజకీయం వాడి బాబు సొత్తు 
వారసత్వమే పోలిట్రిక్స్ యావత్తు 
అందుకోసం గొంగళి పురుగులతో కూడా పొత్తు 
'సీతాకోక'లు మారకుండానే ఎత్తు పైఎత్తులతో చిత్తు చిత్తు

పూటకో మాట... రోజుకో వేషం 
మెగాస్టార్ లను దగాస్టార్ లుగా మార్చే వైనం 
పదవుల కోసం తిట్టినపార్టిల్లోనే విలీనమ్ 
ఏదోలా పబ్బం గడుపుకోవడమే దారుణం 

సమ్మెలు ఘోరావ్ లు బందులు...
జనాల్ని పీల్చి పిప్పి చేసే రాబందులు !
అడుగడుక్కీ ఇవే ఇబ్బందులు 
ఖాకీ బూట్ల కవాతులు, లాఠీల చిందులు 

- లాస్య రామకృష్ణ 

3 comments:

నిరంతరమూ వసంతములే.... said...

చాలా బాగుంది...ఈ కవితా జాతర..:)

Lasya Ramakrishna said...

ధన్యవాదములు సురేష్ గారు.

peddi reddy madhu said...

chala bagundi me ee kavitha jathara mitrama