'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Sep 11, 2012

నేను నా చిట్టి తమ్ముడు

హలో అండీ,
పెద్దలకు నమస్కారం. నా కంటే చిన్న పిల్లలకు నా ముద్దులు. 

నా పేరు చైత్ర.. నాకొక తమ్ముడు. వాడి పేరు సుహాస్. నేను చాలా బుద్దిమంతురాలినన్నమాట. కాని ఎందుకో అమ్మా నాన్న నన్ను 'అల్లరి పిల్ల' అంటారు. 

నిజానికి నేను అల్లరి పిల్లని కాదు. మా తమ్ముడే అల్లరి ఎక్కువ చేస్తాడు. ఫోటోలో చూడండి చాలా అమాయకంగా కనిపిస్తాడు కదూ .

అన్నట్టు చెప్పలేదు కదూ మేము విశాఖపట్నం లో ఉంటాం. మా నాన్న జర్నలిస్ట్, అమ్మ హౌస్ వైఫ్.

నేను చదువులో చాలా చురుకు. ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను. మా తమ్ముడు సుహాస్ ఎల్ కే జీ  చదువుతున్నాడు.


నాకు పాటలు వినడం చాలా ఇష్టం. మా తమ్ముడితో ఆడుకోవడం చాలా ఇష్టం. ఇలా చాలా ఇష్టాలున్నాయి.


వాడి సంగతంటారా, ఏక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సినిమాలలో హీరోలు చెప్పిన డైలాగు లు వచ్చీ రాని మాటలతో చెప్తూ మమ్మల్ని భలే నవ్విస్తూ ఉంటాడు. 
 
సింహ సినిమాలో బాలకృష్ణ డైలాగు "ఒక వైపే చూడు" లాంటివి భలే చెప్తాడు. ఇంకా, రగడ మూవీ చూసినప్పటినుంచి అనుష్కకి, ప్రియమణికి ఫ్యాన్ అయిపోయాడు.

ఇంకా మీతో చాలా విషయాలు చెప్పాలి. అమ్మేమో హోం వర్క్ చెయ్యమని పిలుస్తోంది. మళ్లీ కలుస్తాను.- లాస్య రామకృష్ణ 2 comments:

Anonymous said...

Very nice kids

oddula ravisekhar said...

చిన్న పిల్లల కబుర్లు బావున్నాయండి.