'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Sep 3, 2012

ఇలా ఆ బ్రాహ్మణుడి కోరిక తీరింది.

ఒకానొక పేద అమాయక బ్రాహ్మణుడు బీర్బల్ వద్దకి వచ్చి తన సమస్యకి పరిష్కారం చెప్పమని ఈ విధంగా కోరాడు. "బీర్బల్ గారు, నాకు చిన్నపట్నించి పండితుడు అని పిలిపించుకోవాలని ఉంది. కానీ ఎవ్వరూ నన్ను పండితుడిగా గుర్తించట్లేదు. దయచేసి నా సమస్య కి పరిష్కారం చూపండి అని వేడుకున్నాడు.

బీర్బల్ కి అతనిని చూస్తే జాలి వేసింది. 'పండితుడిగా' పిలిపించుకోదగ్గ అర్హతలేవి అతనికి లేవు. లోకం నాడి తెలిసిన బీర్బల్ ఆ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. 'చూడు నీ వన్నట్టు జరగాలంటే నేను చెప్పినట్టు చెయ్యి'.

అ మర్నాడు రోడ్డు మీదకి వెళ్ళిన ఆ బ్రాహ్మడిని ఉద్దేశిస్తూ బీర్బల్ చెట్టు చాటు నుండి 'పండితుడు వస్తున్నాడు' అని అరిచాడు. దానికి అతను 'ఎవర్రా నన్నలా పిలిచింది. ధైర్యముంటే ఎదురుగా రా రా' అని తిట్టసాగాడు. జనం అంతా గమనిస్తూ ఆ బ్రాహ్మడిని ఏడిపించడం కోసం 'పండితుడు వస్తున్నాడు' అని పిలవసాగారు.

ఇలా ఆ బ్రాహ్మణుడి కోరిక తీరింది.

- లాస్య రామకృష్ణ 

7 comments: