సరదాగా నేను మా చెల్లి కలిసి ఒక కథ రాద్దాం అనుకున్నాం. అయితే ఇందులో ఉన్న షరతులు ఏంటంటే నేనొక వాక్యం చెప్తాను తను ఒక వాక్యం చెప్పాలి అలా కథ పూర్తి చెయ్యలి. చివరికి ఆ కథ ఎలా సాగిందో చుడండి మరి.
నేను - అందమైన పదహారేళ్ళ అమ్మాయి తెలుపు పింక్ కలగలిపిన పంజాబీ డ్రెస్ లో కాలేజీ బాగ్ తో బయటికి వెళ్ళింది.
చెల్లి - తన పేరు నేహ.
నేను - కంటికి కాజల్, మస్కారా తో ఎంతో అందంగా ఉన్నాయి ఆమె కళ్ళు.
చెల్లి - లిప్ లైనర్ ఆమె పెదాలకి వన్నె తెచ్చింది.
నేను - తను వెయిట్ చేస్తున్న బస్సు రాగానే ఎక్కింది.
చెల్లి - ఒక సూపర్ మార్కెట్ ముందు బస్సు దిగింది.
నేను - తన వాచ్ చూసుకుంది
చెల్లి - సరిగ్గా పదిహేను నిమిషాలు మాత్రమే ఉంది
నేను - గబగబా లోపలికి వెళ్లింది
చెల్లి - తన స్నెహితురాలు స్నేహ ఒక కౌంటర్ దగ్గర బిజీ గా ఉంది
నేను - నేహని చూడగానే ఆత్రంగా బయటికి రావాలనుకుంది
చెల్లి - కాని తన మేనేజెర్ పద్మారావు తననే గమనిస్తుండడంతో ఆగిపొయింది
నేను - ఎలాగైన మేనేజెర్ తో మట్లాడి పెర్మిషన్ తీసుకోవాలనుకుంది
చెల్లి - కాని మెనేజెర్ ని చాలా సేపు బ్రతిమాలి నేహ తన కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుందో తెలియచేసింది.
నేను - కన్నిళ్ళ పర్యంతం అయిన పద్మారావు ఎట్టకేలకు ఒక అయిదు నిమిషాలు పెర్మిషన్ ఇచ్చాడు.
చెల్లి - తన కోసమే కింద వెయిట్ చేస్తున్న నేహ కోసం కిందకి వస్తుండగా మెట్ల మీంచి పడిపొయింది.
నేను - వెంటనే అంబులన్స్ కి కాల్ చేసింది నేహ
చెల్లి - అంబులన్స్ లో తీసుకెళుతుండగా స్నేహ చనిపోతుంది.
ఈ కథంతా పూర్తయ్యాక మాకర్ధమయ్యేది ఏంటంటే ఇలా ఎప్పుడూ కథలు రాయటం ట్రై చెయ్యకూడదని.

No comments:
Post a Comment