'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jul 15, 2013

రొమాంటిక్ లంచ్ కాస్తా టీం లంచ్ గా మారిందిసరదాగా అలా రెస్టారెంట్ కి వెళ్లి ఏదైనా తిందాం అని మా అయన నాతో చెప్పగానే ఎగిరి గెంతేసినంత పని చేసాను. వంట చెయ్యక్కర్లేదు అని నా సంతోషం. హాయిగా అలా బైక్ మీద ఒక చక్కటి రెస్టారెంట్ కి తీసుకెళ్ళారు. 

బయటి వ్యూ అందంగా కనిపించే మంచి లొకేషన్ లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఆర్డర్ ఇచ్చాం. సూప్ అస్సలు బాగోలేదు. సరేలే మెయిన్ కోర్స్ అయినా బాగుంటుందేమో అని ఆశావాదం. 

ఈలోపు 25 మంది కలిగిన ఒక టీం వాళ్ళు లంచ్ కి వచ్చారు. వాళ్ళ కి కూడా బయటి వ్యూ అందంగా ఉండే ఈ ప్లేస్ నచ్చిందట. వెయిటర్ మమ్మల్ని అడగకుండానే వాళ్ళతో "వాళ్ళు ఆ టేబుల్ కి షిఫ్ట్ అయిపోతారు" అని చెప్పాడు. కనీసం మాకు చెప్తే మేము వేరే టేబుల్ కి మూవ్ అవడానికి సిద్దంగానే ఉన్నాం. 

మమ్మల్ని అడగకుండా వాళ్ళకి చెప్పడం ఇంకా అలాగే వచ్చి నేను అప్పుడే తాగి టేబుల్ మీద పెట్టిన గ్లాస్ ని వేరే టేబుల్ కి మార్చేయడం చాలా చిరాకు కనిపించింది. అంత డబ్బులు ఖర్చుపెడితే, ఫుడ్ అస్సలు బాగోలేదు. In addition to that వాళ్ళ behaviour మాకు ఇరిటేషన్ కలిగించేలాగా ఉంది. 

 డెసిషన్ వాడే తీసేసుకుని మా దగ్గరికి వచ్చి అప్పుడు "మీరు ఆ టేబుల్ కి మారండి వాళ్ళ కోసం ఈ టేబుల్ కూడా జాయిన్ చెయ్యాలి" అని చెప్పాడు.

ఇక ఈ లంచ్ చాల్లే అనిపించింది నాకు. మా ఆయనకు చిరాకు వచ్చింది. బిల్ తీసుకురండి, మేము వెళ్లిపోతాము అని చెప్తే అప్పటికే సిద్దం చేసిన ఆర్డర్ వస్తే తప్పక వడ్డించాడు. ఆ టీం వాళ్ళు కూడా వేరే ప్లేస్ లో అడ్జస్ట్ అవడానికి ఒప్పుకోవట్లేదు. 

వాళ్ళకి కావలసినన్ని టేబుల్స్ ని అరేంజ్ చేస్తే మా టేబుల్ కి దగ్గరగా వచ్చారు. నా పక్కన ఆ టీం లో ఒక అమ్మాయి కూర్చుంటే మా ఆయన పక్కన కూడా ఒక అమ్మాయి కూర్చుంది. 

నాకు చాలా కోపం వచ్చింది. ఒక వైపు తింటూ మరొక వైపు మా ఆయన ని కోపంగా చూస్తున్నాను. సో మొత్తానికి మా రొమాంటిక్ లంచ్ టీం లంచ్ అయింది. 

- లాస్య రామకృష్ణ 

2 comments:

Anonymous said...

తలచినదే జరిగినదా దైవం ఎందులకు? ....

Sharma said...

" అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లయింది " ఈ అపార ప్రప్రంచంలో ఇదో రకం వ్యాపార ప్రపంచం సుమండి .