'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jul 26, 2013

మా ఇంట్లో చిలకలు

మా ఇంట్లో చిలకలు ఉండేవి. వాటితో నేను స్కూల్ నుండి రాగానే టైం పాస్ చేసేదానిని. అయితే వాటితో ఎంతో సంతోషంగా ఉన్నా వాటిని బంధించాను, ఆకాశం లో స్వేచ్చగా తిరిగే వాటిని ఎగరనీయకుండా చేసాను అని ఆలోచించలేని వయసు నాది. ఇంట్లో అమ్మా నాన్నా ఎంత చెప్పినా నా మొండి తనం వల్ల వాళ్ళ మాట వినకుండా నీను చిలుకల జంట ని కొనిపించుకున్నాను. వాటిని బాల్కనీలో ఉంచేవాళ్ళం. 

వాటికి నీతు, నిమ్మి అని పేర్లు పెట్టాను. కాని అందులో ఒకటి తీసుకువచ్చిన రెండో రోజే చనిపోయింది. ఆ తరువాత ఆ పంజరం లో ఉన్న రెండోది భయపడింది. అది భయం నుండి తేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. కాని త్వరగానే మాతో కలసిపోయింది. 

నేను, మా చెల్లి నీతూ తో కలిసి చక్కగా ఆడుకునేవాళ్ళం. 

కొంచెం అలవాటు అయిన తరువాత, నీతు ని ఇంట్లో పంజరం లోంచి వదిలేసేవాళ్ళం. కాని ఆశ్చర్యంగా అది పంజరం ని వెతుక్కుంటూ వెళ్ళిపోయేది. 

కొన్ని రోజుల తరువాత అది ఇంట్లో తిరగడం ప్రారంభించింది. నేను ఏదైనా తింటున్నప్పుడు అది నా పక్కగా చేరి అది కూడా తినేది. ఇడ్లీలు కూడా తినేది. 

అన్ని చిలుకలు జామ కాయలను ఇష్టం గా తింటూ ఉంటే, ఇది మాత్రం చిక్కుడుకాయలు, తోతాపురి మాంగో ఇష్టంగా తినేది. 

నా చేతి మీదకి ఎక్కించుకుంటే అది నా తల మీదకి ఎక్కి కూర్చునేది. అప్పుడు మా ఇంట్లో కెమెరా లేదు. 

కాని, ఒక రోజు నాకే అనిపించింది దాని స్వేచ్చని నేను బంధించానేమో అని. అందుకే, దానిని విడిచిపెట్టాలని అనుకున్నాను. అమ్మా, నాన్నా ఎంతో సంతోషించారు.  

దానిని వదిలేశాక నేను అది మళ్ళీ మా ఇంటికి నా కోసం వస్తుందేమో నని ఎదురుచూసాను. చిలుకల అరుపులు వినిపించినప్పుడల్లా నీతు వచ్చేసిందేమో నని అనిపించేది. అది మా ఇంట్లో ఉన్నది కొన్ని రోజులే అయినా దాంతో మాకు బాగా attachment ఉండేది. కాని దానిని పంజరం లోంచి పంపించేసినప్పుడు మాత్రం అది ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని అనుకున్నాను. 

- లాస్య రామకృష్ణ 

2 comments:

nagarani yerra said...

బాగుంది లాస్య గారూ . మీ బాల్య జ్ఞాపకం . నిజమే అప్పట్లో కెమేరాలు అందరికీ అందుబాటులో లేక చాలా జ్ఞాపకాలు పదిలపరచుకోలేకపోయామని నాకూ అన్పిస్తూంటుంది .కొన్నాళ్ళు ముచ్చట తీర్చుకొని, వదిలేసి మంచిపని చేశారు . వేలకొద్దీ మైళ్ళు తిరిగే స్వభావం ఉన్న పక్షులను బంధించి ఉంచడం పాపం అన్పిస్తుంది .

Lasya Ramakrishna said...

ధన్యవాదములు నాగరాణి గారు. మీ బ్లాగు చూస్తూ ఉంటాను. పక్షి గూడు మళ్ళీ రిపీట్ అయ్యింది కదా.