చాలా మంది అబ్బాయిల అభిప్రాయం, చాలా ఖర్చు పెట్టి గిఫ్ట్ ఇస్తేనే అమ్మాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారని, కానీ అది వంద శాతం నిజం కాదు.
ప్రేమతో ఏ గిఫ్ట్ ఇచ్చిన తిరిగి అకాసమంతా ప్రేమను పంచే మంచి హృదయం అమ్మాయిలది.
సో ఈ "Valentines Day" సందర్భంగా అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి, భర్త తన భార్య కి వారి మదిని దోచే అందమైన గిఫ్ట్ ఇచ్చి వారి మెప్పు పొందండి.
ఇంకెందుకాలస్యం చదవండి మరి.....
ఎర్ర గులాబీలు
ప్రేమకు సంకేతం. గులాబికి ముల్లునట్టే ప్రేమను సఫలం చేసుకోవడానికి కష్టాలు ఉంటాయని ముందు చూపుతో వాటిని ఎదుర్కునే ధైర్యం ఇద్దరికీ రావాలని ఈ రోజా పువ్వును ప్రేమికులు సింబాలిక్ గా ఇచ్చుకుంటారు.
గ్రీటింగ్ కార్డ్స్
అందమైన భావాలని అక్షరాలలో కూర్చి ప్రియురాలి మనసు దోచే సాధనం.
హార్ట్ షేప్డ్ పెండంట్
'నా హృదయం నీ చేతుల్లో ఉంది' అని అంతర్లీనంగా వివరించే హార్ట్ షేప్డ్ పెండంట్ ఇస్తే ఇంకా మీ ప్రేమకు చింతే లేదు.
డైరీ మిల్క్ చాకొలేట్
నీ ప్రేమలో నీ తీపినంత ఈ చాకొలేట్ లో నింపాను ప్రియా అనండి చాలు జీవితాంతం మీకు ప్రేమ రుచి చూపిస్తూనే ఉంటారు
అంతటి అల్ప సంతోషులండి అమ్మాయిలు......అర్ధమైందా????
-లాస్య రామకృష్ణ
23 comments:
లెస్స పలికితిరి లాస్యగారు...
కాలం తీసుకు వచ్చిన మార్పు?
నిజమేనండి మీరు చెప్పింది , అమ్మాయిలు అల్ప సంతోషులు .
All are not like that
చక్కగా చెప్పారు
మీకు నచ్చినందుకు ధన్యవాదములు పద్మార్పిత గారు.
@గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు - దేని గురించి కాలం తీసుకొచ్చిన మార్పు అన్నారో అర్ధం అవలేదండి...
ధన్యవాదములు మాలా కుమారి గారు.
అవునా అజ్ఞాత గారు:-)
మీకు నచ్చినందుకు ధన్యవాదములు bhavaraju గారు
గులాబీలు : "నాప్రియురాలు గులాబీ తోటలో తిరుగుతోందని, భావుకురాలని పొరబడకండి
ఆమె తనుగాయపర్చిన హృదయాల రుధిరాన్ని గులాబీలలో చూసుకొని సంతోషిస్తున్నది" అన్నాడు గాలిబ్.
గ్రీటింగ కార్డ్: పెళ్ళయ్యాక చీర చిషయంలో టేస్టులు మ్యాచ్ అవుతాయా లేదా అని ఒక ఎస్టిమేషను రావడానికి ఈ గ్రీటిందు పరీక్ష అని నా అనుమానం.
Hert shaoped pendant: Needs no explanation.
Chacolate : జీవితంలోని మధురిమను మాత్రమే కోరుకొనే "అనల్ప" సంతోషులు అమ్మాయిలు.
సరదాకే రాశానండొయ్. విరుచుకుపడకండి. :D
ఏమండోయ్,
ఇలా చెప్పి చెప్పే ( అంటే, అంతటి అల్ప సంతోషుల మండీ అని చెబ్తూనే ) ఈవ్ కాలం నించి ఇప్పటి కాలం దాకా ఆదాము బుట్టలో పడుతూనే వున్నాడు సుమీ !!
చీర్స్
జిలేబి.
జిలేబి గారు చెప్పినట్టు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అమాయకపు భర్తలు ఉన్నారండి. వీళ్లందరూ ఆడవాళ్లు అల్ప సంతోషులు అన్న మాటకి మోసపోతున్నారు:-)
బాగుంది...చాలాబాగుంది..అంటే తక్కువమాట..మరొకమాట దొరకలేదు...ఆలస్యంగాచూశా.
@Indyan Minerva
మాంచి అనుభవం నుంచి వచ్చినట్టున్నాయి మీ వ్యాఖ్యలు :)
@జిలేబిగారు , ఏంటండి మీరు "ఆడం" ని సపొర్ట్ చెస్తున్నారు,ఈవ్ ని కదా సపొర్ట్ చెయ్యాల్సింది :)
@ రామకృష్ణగారు
అమాయకపు భర్త లేకదండి అమాయకపు భార్యలుకూడ ఉన్నరు :)
@కస్టేఫలి గారు
ఛాలా ధన్యవాదలండి. అంతా మీ అభిమానమండి
ఇటు వంటి విషయాల్లో అనుభవజ్ఞులయిన మీరంతా ఏదంటే అదే!
అమ్మాయిలూ అల్ప సంతోషులు అన్నది మాత్రం వాస్తవం!
@లాస్య రామకృష్ణ గారు,
మీరు అడిగినదానికి రేపటి నా టపా చూడవలెను !!
ఆదాము, ఆడం అందులో కూడా ఆడ వున్నది !
చీర్స్
జిలేబి.
laasya...
chalaa baagaa raasaaru....
pvdsprakash
అవును రసజ్ఞ గారు మా అయన నాకు పదివేల రూపాయలు పెట్టి గిఫ్ట్ ఇస్తే ఇట్టే సంతొషపడిపోయాను ఎంత అల్ప సంతోషినో చూడండి :)
నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు ప్రకాష్ గారు.
Post a Comment