'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Feb 17, 2012

ఎంత గొప్పది ఈ జీవితం.......


"పుట్టినప్పుడు ఏడుస్తాం. మరణించినప్పుడు ఏడిపిస్తాం. ఈ రెండు ఏడుపుల మధ్య ఎంత మందిని నవ్వించాం అన్నదే జీవితం."

   టీవీ చూసినప్పుడు కరెంటు పోయినా, ఇష్టమైన సినిమా టికెట్స్ దొరకకపోయినా ఇదేం జీవితం రా అని నిట్టూర్చేవాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచం లో. ఒకసారి, ఏ అనాధాశ్రమానికో, కాన్సెర్ ఆసుపత్రికో వెళ్తే మన జీవితం ఎంత గొప్పదో మనకి అర్ధమవుతుంది. అప్పుడు పైవేవి కష్టాలు కావనిపిస్తాయి.

   ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు 'Outing'  పేరుతో రిసార్ట్స్ కి వాటికీ తీసుకెళుతున్నారు. వాటి బదులు ఇంతకూ ముందు చెప్పినట్టు ఏదైనా అనాధాశ్రమానికో, కాన్సెర్ ఆసుపత్రికో తీసుకెళ్ళి అక్కడి రోగులతో ఈ ఉద్యోగులకి సంభాషించే అవకాశం కలిగించాలి. అప్పుడు ఆఫీసు టెన్షన్స్ అని సూసైడ్ చేసుకునే వారు కొంచెం తగ్గుతారు. ఇంకా, టెన్షన్స్ ని తట్టుకునే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

ప్రాణం పై ఎవరికుంది హక్కు...

   ప్రేమ విఫలమై, పరీక్షా ఫెయిలయి ఇలా ఎన్నో కారణాల రీత్యా నేటి యువత ఆత్మహత్య వైపు మొగ్గుచుపుతున్నారు. దేవుడిచ్చిన అమూల్యమైన జీవితాన్ని అంతం చేసుకునే హక్కు ఎవరికీ లేదు.

   ఆ విషయానికి వస్తే "Mercy Killing" అనే ప్రక్రియ కొన్ని దేశాలలో ఆచరణలో ఉంది. నయం కాని జబ్బులున్న రోగులు, మాములు స్తితిలో లేని రోగులు చాలా ఇబ్బంది పడుతుంటే, డాక్టర్స్ మెడికల్ గా వారిని చంపేస్తారు. ఇది కూడా కొన్ని దేశాలలో నిషిద్దం. అంటే, ఎటువంటి స్థితిలో కూడా ఒక ప్రాణాని తీసే హక్కు ఎవరికీ లేదు. 

బ్రతుకు బ్రతికించు.........

   శరీరంలో ఏదో ఒక అవయవలోపం ఉండి కొందరు తమ జీవితాన్ని అస్వాదిస్తూ కూడా ఆపదలో ఉన్నవారికి సహాయపడేవారు ఉన్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారు కూడా జీవితంపై విరక్తితో జీవించేవారు ఉన్నారు. వీరిరువురి మధ్య తేడా ఆలోచన ధోరణి. బ్రతుకు, బ్రతికించు అన్న సూత్రాన్ని నమ్ముకుని సంతోషంగా ఉన్నవారు మొదటివారు. అవయవలోపం ఉన్నవారే పరులకు సాయపడుతున్నప్పుడు, అన్నీఉన్నవారు ఇంకెంత సాయపడగలరో ఆలోచించండి. అద్భుతాలే చేయగలరు. 

"చిత్రం" చేసిన చిత్రం.....

   ఒకానొక సినిమాలో ఏక్సిడెంట్లో ఒక కాలు పోగొట్టుకున్న అమ్మాయి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆ ఆసుపత్రిలోని నర్స్, ఆమె ఆలోచనా ధోరణిని ఒక 'Painting' చూపెట్టి మార్చేస్తుంది. ఆ 'Painting' లో ని అంశం ఏంటంటే, సముద్రం లో ని నీరు ఆకాశంలోకి ఆవిరి రూపం లోకి వెళ్లి మళ్లీ అదే నీరు మబ్బులలోంచి వర్షం రూపంలోకి కిందకి వస్తుంది. ఈ \painting ని వివరిస్తూ 'జీవిత పరమార్ధం అర్ధం చేసుకోవాలి. ఒక కాలు పోయింది అని నిరాశ పడిపోకు. ఇంకొక కాలు ఉండి కదా అని సంతోషించు. పరులకు సహాయం చేయి. వారి జీవితాలలో వెలుగులని నింపు. నీ జీవితమనే దీపంతో వీరే దీపాలను ఆరిపోకుండా కాపాడు" అంటుంది. అంతే , ఆ అమ్మాయి తన ఆత్మహత్య ఆలోచనని విరమించుకుంటుంది. 

మనసుంటే మార్గముంటుంది....

సహాయాన్నందించాలనే ఆలోచనకి వయసుతో సంబంధం లేదు అనడానికి ఈ అమ్మాయే ఉదాహరణ.

ఆ అమ్మాయి లో పాటలు పడే ప్రతిభ చాల అద్భుతంగా ఉంది. అతి చిన్న వయసులోంచే మ్యూజిక్ షోస్ లో పాటలుపాడి డబ్బులు సంపాదించేది. ఒకానొక సందర్భములో ఈ అమ్మాయి మనసును ఒక సంఘటన కదిలించింది. అప్పటినుంచి డొనేట్ చెయ్యడానికే పాటలు పాడేది. సహాయం చేసిన ప్రతి సరి ఒక బొమ్మ కొనేది. ఇప్పుడు తన దగ్గర 500 పైగా బొమ్మలు ఉన్నాయి.

డబ్బుతో సంబంధం లేదు 

కాదేది సహాయనికనర్హం అని రుజువు చేసాడు ఓంకారనాథ్ శర్మ. చిరుజీతగాడైన, పరుల గురించి అలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇతని గురించి ఇంతకూ ముందొకసారి నా బ్లాగ్ లో ప్రస్తావించాను. 

ఇంటింటికి తిరిగి "మీ ఇంట్లో మీరు జలుబుకో, జ్వరనికో మందులు తెచ్చుకుని ఉండుంటారు. మిగిలిపోయిన ఆ మందులు వేరే వారికి ఉపయోగపడతాయి. దయచేసి ఇవ్వండి". అని అడుగుతారు. ఎంతో మంది స్పందించి ఇతనికి మందులు ఇవ్వడం ప్రారంభించారు. వాటిని ఇంటికి తీసుకుని వచ్చి   Expire అవ్వని మందులని ఒక చోట చేర్చి ప్యాక్ చేసి అవసరార్డులకి పంచిపెడతారు. ఇలా ఎంతో మంది పేదల ప్రాణాలను ఇతను కాపాడారు.     

ఇలా, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇతరులకు ఉపయోగపడేలా జీవించాలనుకుంటూన్నప్పుడు, చిన్న చిన్న సమస్యలకు క్రుంగి పోయి జీవితాన్ని అంతం చేసుకోవాలనుకోవడం ఎంత వరకు సమంజసం. ఆంగ్లం లో ఓ కొటేషన్ ఉంది "Difficulties in your life do not come to destroy you, but help you realize your hidden potential" అని. 

అంటే "కష్టాలు మనల్ని నాశనం చెయ్యడానికి రావు. మనలో దాగి ఉన్న సామర్ధ్యాన్ని గుర్తుచెయ్యడానికే వస్తాయి " ఇది అక్షర సత్యం. - లాస్య రామకృష్ణ. 


7 comments:

sandeep said...

"మనసుంటే మార్గముంటుంది.."
Where there ia a will there is a way
Good Post.

Anonymous said...

This is to be followed by all, good and commendable suggestion, which is not followed in our area.

Anonymous said...

బాగుంది,ఆశాజీవులంగా బతకాలి

రాజి said...

నిజమేనండీ "ఎంత గొప్పది ఈ జీవితం......."
కొటేషన్స్ బాగున్నాయి.

Lasya Ramakrishna said...

నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు సందీప్ గారు.

Lasya Ramakrishna said...

మీకు నా టపా నచ్చినందుకు ధన్యవాదములు కష్టేఫలి గారు.

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు రాజీ గారు.