'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Feb 19, 2012

వైద్యో నారాయణో "హరీ"

వైద్యులంటే దైవంతో సమానం. వైద్యవృత్తి చాలా గౌరవప్రదమైనది. హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు అందరు కొలిచే దైవం వైద్యుడు. ఇది ఒకప్పటి విషయం. 

వైద్యులంటే భయపడే రోజులు ఇవి. అదేదో సినిమాలో చూపెట్టినట్టు, చనిపోయిన శవానికి కూడా అన్ని రకాల పరిక్షలు చేసి "చాలా కష్టపడ్డాం కానీ బ్రతికించలేకపోయాం. ఫీజు కట్టెయ్యండి" అన్నట్టే ఉంది ఇప్పటి వైద్యుల పరిస్తితి.

నార్మల్ గా వచ్చే జ్వరానికి కూడా రక రకాల స్కాన్నింగ్లు గట్రా చేసి, బిల్లుని తడిసి మోపెడు చేసి రోగులను ఇబ్బంది పెడుతున్నారు.

ఇప్పటి కాలంలో డెడికేటింగ్ వైద్యులు లేరని నేననట్లేదు, కానీ అలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నారు. ఇది కొంచెం బాధాకరమైన స్థితి.

ఎన్నో ఉదాహరణలు నాకు తెలిసిన వాళ్ళు చెప్పినవి, నేను ప్రత్యక్షం గా చూసినవి ఉన్నాయి. 

జ్వరం వచ్చిందని వాళ్ళబ్బాయిని మా పక్కింటావిడ హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. ఆ అబ్బాయికి అయిదేళ్ళు. అదేదో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ అట. వెళ్ళగానే ఏదో ఫార్మ్ ఫిల్ అప్ చేయించుకున్నారు, అదేదో ఆపరేషన్ కి వీళ్ళు వెళ్ళినంత బిల్డ్ అప్  ఇస్తూ. తరవాత వీళ్ళని ఒక అయిదు నిముషాలు వెయిట్ చేయించి ఫలానా డాక్టర్ని కలవండి అని ఒక నర్స్ వీళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళింది. ఆ డాక్టర్ కనీసం ఎం జరిగింది అని కూడా అడగకుండా, తనదైన స్టైల్ లో తన కెరీర్లో నేర్చుకున్న టెస్ట్ లన్ని ఈ అబ్బాయి మీద ప్రయోగించాడు. ఇంతకీ తేల్చింది ఏమంటే ఇది సాధారణ జ్వరం, ఈ టాబ్లెట్స్ వాడండి అని.

బిల్లు ఎంతైందో ఇక వేరే చెప్పనక్కరలేదు....

ఇంకా లేడీ డాక్టర్స్ అంటారా, వీళ్ళ సంగతి వేరే చెప్పకర్లేదు. గర్భవతులకి అవసరం అయినా కాకపోయినా వారానికొకసారి, నెలకొకసారి స్కాన్నింగ్ చేయించుకోవాలంటారు. చేయించుకోకపోతే ఏమవుతుందోనని భయం సృష్టిస్తారు. నాకు తెలిసిన డాక్టర్ సర్కిల్ ద్వారా తెలిసిందేంటంటే, వీళ్ళు సూచించే ప్రతి టెస్ట్ కి వీళ్ళకి కొంత మొత్తం లో కమిషన్ ముడుతుంది. కొంత పెర్సెంటేజ్  అని ఫిక్స్ చేసుకుంటారు.

లక్షలు పోసి చదివాం అవన్నీ ఇలా రాబట్టుకుందాం అనే ఆలోచన లోంచి వైద్యులు బయటపడాలని కోరుకుంటున్నాను. అంటే విద్యావ్యవస్త కూడా పరోక్షం గా ఇలాంటి పరిస్తితికి కారణమేమో.....

వైద్యవృత్తిని దైవంగా భావించిన, భావిస్తున్న వైద్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.  


- లాస్య రామకృష్ణ
   

8 comments:

sreenu said...

చాల చక్కగా చెప్పారండి వైద్యుల గురించి.
నిజంగా ఈ రోజుల్లో వైద్యుల మోసాలకు బలికాని వ్యక్తే వుండక పోవచ్చు.
Doctors అన్నా hospitals అన్నా జనం దడుచుకునే రోజులొచ్చేసాయి.

రాజి said...

"ఇప్పటి కాలంలో డెడికేటింగ్ వైద్యులు లేరని నేననట్లేదు, కానీ అలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నారు."
"Lasya Ramakrishna" గారూ..
మీరు చెప్పింది నిజమేనండీ..
కానీ ఇప్పటి జనాలు కూడా టెస్ట్ లు రాయకుండా, తక్కువ ఖర్చయ్యే మందులు రాసే డాక్టర్లని నమ్మరండీ..
ఎంత డబ్బు ఖర్చయితే వైద్యం అంత బాగా జరిగినట్లు లెక్క కొంతమందికి.

Anonymous said...

నిజంగా జరుగుతున్నదే!

PVDS Prakash said...

vidyo narayana hari...prastuta vaidyula teerutennulu baaga endagattaarandi. article baagundi

Lasya Ramakrishna said...

మీకు నా ఆర్టికల్ నచ్చినందుకు ధన్యవాదములు శ్రీను గారు.

Lasya Ramakrishna said...

అవును రాజీగారు, డబ్బు బాగా ఖర్చుపెడితేనే మంచి వైద్యం వస్తుందనే నమ్మకం కొందరిలో బలంగా నాటుకుపోయింది.

Lasya Ramakrishna said...

నా టపా చదివినందుకు ధన్యవాదములు కష్టేఫలి గారు.

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు ప్రకాష్ గారు.