'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Feb 10, 2012

మనసు మూగదే కానీ భాషుంది దానికి


"మనసు మూగదే కానీ భాషుంది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుంది అది". 

"మనసుగతి ఇంతే 
మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికి సుఖము లేదంతే"

"ఎక్కడ ఉన్న ఏమైనా, ఎవరికీ వారే వేరైనా 
నీ సుఖమే నే కోరుకున్న, నిను వీడి అందుకే వెళుతున్నా"

"చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు 
నీవు లేక దిక్కు లేని చుక్కలైనాము"


*   *   *   *   *   *


"నేనొక ప్రేమ పిపాసిని, నీ వొక ఆశ్రమవాసివి అనే భగ్న ప్రేమికుడి బాధనైన, తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము" అనే కొంటె ప్రేమికుడి చిలిపితనాన్నైన, 'అది ఒక ఇదిలే' లాంటి మత్తెక్కించే పాటలనైన రాయడానికి అత్రేయకి సాటిరారెవరు.

మనసు, ప్రేమ, జీవితం, విరహం లాంటి అంశాలను చాలా చిన్న పదాలతో ఎంతో బాగా వ్యక్తం చేసారు ఆత్రేయ. ఎక్కువ పాటలు మనసు మీదే రచించారు. అందుకే ఆయనకి మనసు కవి అని బిరుదు. 

ఆత్రేయ గురించి.... 

ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. అయన 7th May, 1921 లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన గోత్రం పేరునే కలం పేరుగా పెట్టుకున్నారు.

సినీ జీవితం...

"దీక్ష" అనే చిత్రం ద్వారా ఆత్రేయ సినీ జీవితం ప్రారంభమైంది. ఈ చిత్రం 1950 లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన రచించిన 'పోరా బాబు పో' పాటని పెండ్యాల నారాయణరావుగారు స్వరపరచగా, M.S. రామారావుగారు పాడారు.

'సంసారం' అనే చిత్రానికి ఆత్రేయ మొట్టమొదటి సారి స్క్రిప్ట్ వ్రాసారు. కేవలం పాటలకే పరిమితమవకుండా, మాటలు, దర్సకత్వం, నిర్మాణం లో కి కూడా ఆయన తనదైన ప్రతిభ చూపెట్టారు. 

1961 లో విడుదలైన "వాగ్దానం" చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. 

డాక్టరేట్....

తెలుగు సాహిత్యంలో ఆత్రేయ సేవని గుర్తించి డా.B.R.Ambedkar Open University వారు అత్రేయకి డాక్టరేట్ ని అందించారు.

విమర్శలు.....

ఆత్రేయ సమయానికి పాటలు ఇచ్చేవారు కాదని ప్రసిద్ది. అందుకే విమర్శకులు 'పాటలు రాయక నిర్మాతలని, రాసి ప్రేక్షకులని ఏడిపిస్తారు' అని అనేవారు. వాటికీ స్పందించిన ఆత్రేయ 'రాసేటప్పుడు నేనెంత ఏడుస్తానో ఎవరికీ తెలుసు' అని అనేవారు. 

"చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు నీవు లేక దిక్కు లేని చుక్కలైనాము"

13 Sep 1989 లో ఆత్రేయ మద్రాసులో కన్ను మూసారు. కానీ అతని పాటలు మాత్రం మనందరి హృదయాలలో  కలకాలం నిలిచి  ఉంటాయి.

- లాస్య రామకృష్ణ 


2 comments:

రాజి said...

"మనసు, ప్రేమ, జీవితం, విరహం లాంటి అంశాలను చాలా చిన్న పదాలతో ఎంతో బాగా వ్యక్తం చేసారు ఆత్రేయ."

నిజమేనండీ ...

Lasya Ramakrishna said...

మీకు నచ్చినందుకు ధన్యవాదములు రాజీ గారు.