'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 28, 2013

ఒక హాస్పిటల్ కిటికీ అవతలఒక హాస్పిటల్ వార్డ్ లో ఇద్దరు రోగులు ఉన్నారు. వారిలో ఒక రోగి ఎల్లప్పుడూ మంచం పై పడుకునే ఉండాలి. మరొక రోగి ఆరోగ్య కారణాల రీత్యా రోజుకు ఒక గంట సేపు లేచి కూర్చోవాలి. ఈ రోగి బెడ్ పక్కనే కిటికీ ఉండేది.

రోజుకొక గంట సేపు లేచి కూర్చునే రోగి ఆ కిటికీ అవతల ఉన్న అందమైన ప్రపంచం గురించి ఎల్లప్పుడూ పడుకుని ఉండే రోగి కి వర్ణించేవాడు. ఆ రోగి మంచం మీదే అందమైన రంగు రంగుల ప్రపంచాన్ని తోటి రోగి మాటల్లో చూసే వాడు.

"కిటికీ అవతల ఒక అందమైన సరస్సు ఉంది. ఈ సరస్సులో బాతులు తిరుగుతూ ఉంటాయి. పక్కనే చిన్న పిల్లలు ఆడుకోవడానికి వస్తున్నారు. సూర్యాస్తమయం ఏంతో అందంగా ఉంది." ఇలా వర్ణిస్తూ ఉండేవాడు.

కిటికీ అవతల ఉన్న అందమైన ప్రపంచాని తనకు కూడా చూడాలని అనిపించేది. ఆ ఒక్క గంట ఎంతో సంతోషంగా ఉండేది.

ఒకా నొక రోజున కిటికీ వద్ద బెడ్ మీద ఉండే ఈ రోగి చనిపోయాడు. అప్పుడు నర్స్ ని ఎల్లప్పుడూ మంచం పైన ఉండే ఈ రోగి తన బెడ్ ని కిటికీ వద్ద ఉండే బెడ్ దగ్గరికి మార్చమని కోరుకున్నాడు.

వెంటనే తన స్థానం కిటికీ వద్ద ఉన్న బెడ్ వద్దకి మారగానే అతి కష్టం మీద లేవడానికి ప్రయత్నించి లేచి కుర్చుని కిటికీ అవతల ఉన్న అద్భుతాలని తిలకించాలని ఆనందంగా చూసాడు.

ఆశ్చర్యం. ఆ కిటికీ అవతల ఎత్తైన గోడ మాత్రమే ఉంది. ఇంకేమీ కనపడలేదు.

- లాస్య రామకృష్ణ