'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 16, 2013

ప్రతి రోజు మా ఇంటి ముందు నుండి మాయమవుతున్న న్యూస్ పేపర్

గత కొన్ని రోజుల నుండి మా ఇంటి ముందు న్యూస్ పేపర్ నేను రోజు పేపర్ తీసే సమయం లో ఉండట్లేదు. అయితే మధ్యాహ్నం మాత్రం కనిపిస్తుంది. ఉదయాన్నే ఉండాల్సిన పేపర్ మధ్యాహ్నం వస్తుంది. పేపర్ ఏజెంట్ కి ఫోన్ చేసి అడిగితే ఉదయాన్నే పేపర్ వేస్తున్నట్టు చెప్పాడు. 

రోజు లేచే సమయం కంటే కాస్త ముందుగా అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి లేద్దాం అని అనుకున్నాను. తెల్లవారుజామునే లేచి చూసాను. పేపర్ ఇంకా రాలేదు. అలా చూస్తూనే ఉన్నాను. మా డోర్ కి ఉన్న పీప్ హోల్ ద్వారా గమనించడం ప్రారంభించాను. పేపర్ వాడు వొచ్చి మా ఫ్లోర్ లో ఉన్న మూడు ఇళ్ళకి పేపర్ చక చకా వేసి వెళ్ళిపోయాడు. నేను కావాలనే పేపర్ తీసుకోకుండా పేపర్ ఎలా మయమవుతుందో తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాను. వెంటనే మా పక్క ఫ్లాట్ డోర్ ఓపెన్ అయింది. మా ఇంటి ముందున్న పేపర్ ని తీసుకోబోతున్న సమయం లో నేను వెంటనే డోర్ తెరిచాను. "హి హి హి" అని ఒక వెర్రి నవ్వు నోటికి పులుముకుని పేపర్ అక్కడే ఉంచేసి లోపలి వెళ్ళిపోయింది. 

మొత్తానికి అలా రెడ్ హ్యాండెడ్ గా పేపర్ దొంగని పట్టుకున్నాను. కానీ ఏం లాభం పేపర్ దొంగని మానిటర్ చెయ్యడానికి పేపర్ ఉదయాన్నే చదవడానికి నేను త్వరగా నిద్ర లేవాల్సి వస్తోంది. 

- లాస్య రామకృష్ణ 

5 comments:

hema said...

ఈ పేపరు భాద లు అందరికి ఉన్నాయండి
మా పక్కింటి ఆవిడ తన పేపరు తీసినతరువాత
ముందుగా మా పేపరు మెము తీసిన కూడా
అది ఆవిడ పేపరే అని తగువులాడుతుంది

శ్రీనివాసరావు said...

లాస్య గారు
పేపర్ మాయ గురించి చక్కగా రాసారు
మాది కూడా ఒక భాద ఉందండి
మా పేపరు వాకిలి కడిగిన నీళ్ళల్లో తడిసి ముద్దవుతూ వుంటుంది రోజూ ఎన్నిసార్లు పేపరువాడికి చెప్పినకూడా

Lasya Ramakrishna said...

హేమ గారు నా బ్లాగ్ కి స్వాగతం. ఈ పేపరు బాధలు సగటు మనిషి జీవితంలో భాగం అయిపోయాయండి.

Lasya Ramakrishna said...

మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదములు శ్రీనివాస్ గారు.

srinivasarao vundavalli said...

పేపరు భాదలానే పాల ప్యాకెట్ భాద కూడానండి :)