'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jan 27, 2013

విందు ఆరగించండి మరి

మెనూ 
  1. అన్నం 
  2. టమాటో పప్పు 
  3. ములక్కాడ సాంబార్ 
  4. ఆలుగడ్డ వేపుడు 
  5. గుత్తి వంకాయ కూర 
  6. గోంగూర పచ్చడి 
  7. అప్పడాలు 
  8. పెరుగు 
  9. మామిడి పండు 
పాన్ వేసుకోవడం మరచిపోకండి :-)


- లాస్య రామకృష్ణ 

4 comments:

Anonymous said...

పళ్ళు లేవు.. :)

kasi said...

అబ్బాబ్బా ..నిజంగా నోరు ఊరిపోతుంది.
తినండి బాగా తినండి , ఇలా ఫొటోస్ పెడితే నాలా ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించారా ?
మొదట గా టీవీ ముందు కుర్చుని , డైనింగ్ టేబుల్స్ కుర్చీలు వద్దు, అన్నం కంచం లో పెట్టుకుని ముందు పప్పు తో మొదలెడదాం.
కొద్దిగా పప్పు వేసుకుని , పచ్చడి ఉన్నాదా మీ ఇంట్లో కొత్త అవకాయే కదా ? , ఉంటె కొంచెం వేయన్దమ్మ .
వేపుడిని ఆకులో ఒక మూల సర్ది పెట్టుకోవాలి ముందే. ఓ మూడు నలుగు ముద్దలు తినేయాలి , ఓహో గోంగూర ఉంది గా , దాంతో కూడా ఇంకో పది ముద్దలు.
ములక్కాడ సాంబార్ , చెంబు తో తల మీద నీళ్ళు పోసుకున్నట్టు , సాంబార్ గిన్నె ని ఎత్తి అన్నం మధ్యలో హోల్ చేసి అందులో పోసుకుని , చేత్తో కలుపుకుని, తింటూ ఉంటుంటే ...ఉంటుంది ..ఆ ఆనందమే వేరు . తాగడానికి కొంచెం సాంబార్ ఉంచుకోవాలి.
ములక్కాడ ని కసా బిసా నములుతుంటే hmmmm , అసలు ఆ టైం లో యమ ధర్మరాజు వచ్చినా ముందు ములక్కాడ నమిలేసి వస్తానని చెప్పచ్చు.
వీటన్నింటి లోను వేపుడు ఉంటుంది ముద్ద ముద్ద కి.
ఆ తరువాత ....మేళా ల్లో కెల్లా కుంభమేళా వేరన్నట్టు, మన గుత్తి వంకాయ కూర వేరన్నమాట, దీంతోనే ముందు మొదలెట్టాలి మిస్ అయింది, అయినా ఏం పరవాలేదు.
గుత్తి వంకాయ ని చాలా జాగ్రత్త గా పట్టుకుని , నోట్లో పెట్టుకుని తింటుంటే ఉంటుందండి ఆహా ఓహో .. ఈ కూర వండడాన్ని అన్ని కాలేజీ ల్లో ఇంజనీరింగ్ సబ్జెక్టు తో పాటు పెట్టాలి, నేర్పాలి అందరకి.
ఇదేంటి గడ్డపెరుగు ని పెట్టడం మర్చిపోయారు, పెరుగు తోనే కదా మనమంతా భోజనం ముగిస్తాం. పరవాలేదు లెండి. ఈ సారికి ఇలా కానిచ్చేద్దాం.
బాగుందమ్మా .కిళ్ళి వద్దులెమ్మా మనకి పడదు. అన్నదాత సుఖిభావా ..!!!!!!

Lasya Ramakrishna said...

తాత గారు. మర్చిపోయాను. మీరు అడిగాక కొనుక్కొచ్చాను. పళ్ళు పుచ్చుకోండి మరి.

Lasya Ramakrishna said...

కాశీ గారు. ఎంత బాగా వర్ణించారండి. ఈ టపా కంటే మీ కామెంటే నోరూరించేలా ఉంది. మీ ప్రొఫైల్ లోంచి మీ బ్లాగ్ ని సందర్శించడానికి ప్రయత్నించాను. కానీ బ్లాగ్ లంకె కనబడలేదు. దయచేసి మీ బ్లాగ్ లంకె ఇస్తే సందర్శిస్తాను. ధన్యవాదములు.