"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాని మల్టీ స్టారర్ మూవీ కాదన్న మహేష్ బాబు.
ఈ మధ్య ఇటువంటి హెడ్డింగ్ తో ఎన్నో వార్తలు న్యూస్ చానళ్లలో ఇంకా న్యూస్ పేపర్స్ లలో చదివాను.
సినిమా చూసాక నేను కూడా మహేష్ బాబు తో ఏకీభవించవలసి వస్తోంది.
వెంకటేష్ ఎందుకో ఇదివరకటి ఈజ్ తో నటించలేదు. మహేష్ బాబు కి ఇచ్చినంత బిల్డ్ అప్ వెంకటేష్ కి కనీసం కొంత శాతం కూడా ఇవ్వలేదు.
అంజలి పాత్రపై వెంకటేష్ కి అభిమానం ఉన్నట్టు ఒక్క సన్నివేశం కూడా లేదు.
ఈ సినిమాలో పాత్రలు ఎప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతాయో అర్ధం కాదు.
ఒక డైలీ సీరియల్ చూసినట్టు అనిపించింది.
వారు నివసిస్తున్న ఇల్లు చూస్తే భారీగా ఉంటుంది. వాళ్ళ కూతురి పెళ్లి కూడా చాలా ఘనంగా చేస్తారు. ఇవన్నీ చూస్తే నాకు సుడిగాడు మూవీ గుర్తొచ్చింది. ఒక సన్నివేశంలో కోవై సరళ ఇంటి వాకిలి ఉడుస్తూ కనిపిస్తుంది. లోపలి వెళ్ళినప్పుడు పెద్ద బంగళా గా ఇల్లు మారిపోతుంది.
ఉద్యోగం లేదు అని బాధ పడుతూ ఉండే పాత్ర లు ఎవరైనా అడిగితే మరింత బాధపడే పాత్ర వెంకటేష్ ది.
ప్రకాష్ రాజ్ కి సినిమా మొత్తం నవ్వు మొహానికి పులుముకునే పాత్ర కొంచెం కృత్రిమంగా ఉంది. ప్రకాష్ రాజ్ మరీ ఓవర్ గా నటించినట్టు అనిపించింది.
మహేష్ బాబు, వెంకటేష్ లు ఒకరిని ఒకరు ఒరేయ్ గా అనిపించడం కూడా సూట్ కాలేదు. (మహేష్ బాబు వెంకటేష్ ని ఒరేయ్, ఏరా అని అనడం కథలో అన్నదమ్ముల మధ్య సఖ్యత గురించి వాడినా ఎందుకో నప్పినట్టు అనిపించలేదు).
అన్నదమ్ముల అనుబంధం అలాగే బాధ్యతలు, చిరునవ్వుతో సంతోషంగా జీవితాన్ని గడిపేయడం వంటి భావోద్వేగాలను తను అనుకున్న రీతిలో దర్శకుడు ప్రెజంట్ చెయ్యలేకపోయినట్లు అనిపించింది.
సారాంశం - ఈ సినిమా చూసాక ఇది మల్టీ స్టారర్ మూవీ కాదు మల్టీ హారర్ మూవీ గా చెప్పుకోవచ్చు.
ఈ సినిమా కంటే ఈ కోవలోకే వచ్చే క్రింది సినిమాలు ఎంతో బెటర్ గా ఉంటాయి.
1.మా అన్నయ్య
- లాస్య రామకృష్ణ
3 comments:
Totally agree! I felt it was a super boring movie and a senseless movie.
Welcome to my blog jalataru vennela garu and thanks for sharing your opinion.
లాస్య గారు,
మీరన్నట్లు ఇది మల్టీ హరరే కాదు మహా బోర్ అని కూడా వినికిడి.
అయితే నచ్చని ఒంకొక అంశం -అన్న గారిని ఒరే అనడం
అసలే అంతంత ఉన్న సంస్కారం భ్యతలు అంతరిచిపోతున్న ఈ కాలంలో ఇలా సంభోదించి ఏమి చెప్పదల్చుకున్నారో
ఈ జనరేసన్ కి నాకర్థం కావడం లేదు.
Post a Comment