'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Aug 31, 2012

రొటీన్ కి భిన్నంగా "శ్రీమన్నారాయణ"


 ఈ  మధ్యే విడుదలైన బాలకృష్ణ చిత్రం "శ్రీమన్నారాయణ". ఇందులో బాలయ్య టీవీ జర్నలిస్ట్ పాత్రని పోషించారు. పార్వతి మిల్టన్ కూడా టీవీ జర్నలిస్ట్ గా పాత్రని పోషించారు. ఇందులో మరో హీరోయిన్ "ప్రేమకావాలి" ద్వారా సినీ రంగం లోకి అడుగిడిన ఇషా చావ్లా. బాలయ్యకి మరదలుగా నటించింది.

ఈ  సినిమాలో బాలయ్య యంగ్ గా కనిపించారని అభిమానులు అంటున్నారు.స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ తో కూడిన పాటలు ఈ  సినిమాకి ఒక అసెట్ అని భావించవచ్చు. చక్రి మ్యూజిక్ కూడా ఆకర్షణీయంగా ఉందని టాక్.

ఇందులో ప్రతి సినిమాలో లాగా హీరోకి ఇంట్రో సాంగ్ లేదట. ఇంట్రో షాట్ కూడా చాలా సింపుల్ గా ఉందట.

ఇంట్రో సాంగ్ లేదంటేనే బాలకృష్ణ కొంచెం రొటీన్ కి భిన్నంగా ట్రై చేసారని మనం భావించవచ్చు.

- లాస్య రామకృష్ణ No comments: