'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Aug 20, 2012

అర్ధం కాని 'జులాయి ' లాజిక్

అసలు లాజిక్ ఆలోచిస్తే సినిమాని మనం ఎంజాయ్ చెయ్యలేం. అందుకే టికెట్ కొని ధియేటర్ లోకి వెళ్ళాక లాజిక్ అంత మేజిక్ ల మారిపోతుంది. 

అసలు ఈ  లాజిక్ టాపిక్ ఎందుకొచ్చిందంటే, జులాయి సినిమా చుసాకన్నమాట .

విలన్ కష్టపడి చాలా తెలివి తేటలతో బ్యాంకు లాకర్ తెరవడానికి చాలా ఏర్పాట్లు చేసుకుని మొత్తానికి ఓపెన్ చేస్తాడు.

మరోపక్క ఆ గదిలోని గోడని చీళ్చుకుని ఒక క్రేన్ ఈజీ గా లోపలి వస్తుంది. అది విలన్ ఏర్పాటు చేసుకున్నదే. మరి లాకర్ తెరవడానికి ఎందుకు విలన్ కష్టపడతాడో అర్ధం కాదు.

అప్పుడు నేను సరదాగా లాజిక్ ల గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. కొన్ని తెలుగు సినిమాలు కొన్ని డబ్బింగ్ సినిమాలు గుర్తొచ్చాయి.

అవేంటంటే...

1. ఒక హీరో తొడ కొట్టగానే సుమోలు పేలిపోతాయి.
2.ఒక హీరో చిటిక వెయ్యగానే ఉయ్యాలా కిందగి దిగుతుంది హీరో కూర్చోడానికి.
3.ఒక సినిమాలో చాలా బుల్లెట్స్ తగిలినా రెండు పేజీల డైలాగ్ చెప్పాక   గాని చావడు ప్రేక్షకులను  చంపక మానడు.
4.ఒక సినిమాలో హీరో బిల్డింగ్స్ పై నుంచి పరిగెత్తుకుంటూ హెలికాఫ్టర్ ఎక్కుతాడు.

ఆలోచిస్తూ ఉంటె మన సినిమాల్లో ఇలాంటి మేజిక్ లకి అంతే లేదు.

మరి మీకేమైనా గుర్తోచ్చాయా ఇలాంటివి ....

- లాస్య రామకృష్ణ 

4 comments:

Ramana said...

:-)
good logics

Ramana

నిరంతరమూ వసంతములే.... said...

వేరే సినిమలవి ఎందుకండీ...ఈ సినిమాలోనే..విలన్ని చేజ్ చేస్తూ హీరో వున్నట్టుండి ఒక బిల్డింగులోకి దూరి ఏదో పార్కులో నడుపుతున్నట్టు లోపల కారు నడిపి ఇంకొక వైపు నుండి బయటకు రావడం...ఇలాంటివి మన తెలుగు సినిమాలకే సాద్యం!

Lasya Ramakrishna said...

Thanks ramana gaaru. I apologize for the late reply.

Lasya Ramakrishna said...

avunu suresh gaaru telugu cinemalu logic alochinchakunda chustene baguntundi.