'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 31, 2012

మీరు వేసవిని ప్రేమిస్తారువేసవి హడావిడి మొదలైంది. ఎటు చూసినా వేడి గాలులు, ఒళ్ళంతా చెమట ఇవన్ని మనల్ని కొంచెం ఇబ్బంది  పెడుతున్నాయి. వేసవి కాలం వచ్చిందని చెప్పి మన రోజువారీ పనులనుండి తప్పించుకోలేం కదా. అందుకే, కొన్ని జాగ్రత్తలతో మనల్ని మనం ఎండ బాధ నుండి రక్షించుకుందాం.


1 . డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి తగినంత నీరు తీసుకోవాలి. 
2 . ఇంకా తాజా పళ్ళ రసాలు తెసుకోవాలి.

3 . స్పైసీ పదార్ధాలని తీసుకోవడం తగ్గించుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అజిర్నమయ్యే అవకాశం ఉంది. 

4 . భోజనం తీసుకున్న వెంటనే గ్లాసుడు మజ్జిగ తాగడం ద్వారా చల్లగా, హాయిగా ఉంటుంది. 

5 . సమయం దొరికినప్పుడల్లా, ముఖాన్ని, అరికాళ్ళ ని శుబ్రం చేసుకోవాలి.

6 . వేసవి కాలం లో పెరుగుకి ప్రాముఖ్యత\ ఇవ్వాలి.

7 . ఎండ లోంచి ఇంటికి రాగానే చల్లటి నీళ్ళు వెంటనే త్రాగకూడదు. కొంచెం సేపు ఫ్యాన్ కింద రిలాక్ష్ అయ్యాక, కుండలో నీళ్ళు త్రాగితే మంచిది. కుండలో నీళ్ళు చల్ల గ ఉండడానికి తడి టవల్ ని కుండ చుట్టూ కట్టాలి. 

8. వీలైనంత వరకు ఎండనుండి తలని, ముఖాన్ని కవర్ చేసుకోవడానికి గోడుగుని తప్పనిసరిగా వాడండి.

   
విన్నపం:- ఎన్నో ప్రాణులు కూడా మనలాగే ఎండ బాధకి ఇబ్బందులు పడుతూ ఉంటాయి. పక్షులైతే నీరు దొరకక చనిపోయే ప్రమాదం ఉంది. మీ బాల్కనీలో లేదా ఇంటి ముంగిట పక్షుల కోసం కొంచెం నీటి ని ఏర్పాటు చెయ్యండి. వీలైతే, దారిన పోయే దాహార్తుల కోసం కూడా మంచి నీటిని ఏర్పాటు చెయ్యండి. దాహం తీరిస్తే కాశి కి వెళ్ళినంత పుణ్యం అని పెద్దలు చెప్పారు కూడా....

ఇలా చేస్తే మీరు  వేసవిని  ప్రేమిస్తారు :-).

2 comments:

sreenu said...

లాస్య గారు
వేసవి జాగ్రత్తలు బాగా చెప్పారు
చివరన విన్నపం ఇంకా చాలా బాగా చెప్పారు

Lasya Ramakrishna said...

శ్రీను గారు, మీకు నచ్చినందుకు ధన్యవాదములు.