ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు
ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారా చీరె
ఇది రాముడు కట్టుకోనగా పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఎలేది పాదాలివే
మాయల బంగారు లేడి మాయనీ గురుతులివే
పచ్చగా ఐదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపూ కుంకుమ రాళ్లివే
దాటొద్దని లక్ష్మణుండు గీతని గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాల్లివే
ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి నా రాముడికీడ నిలువనీడ లేదిదేమి
నిలువ నీడ లేదిదేమి
- లాస్య రామకృష్ణ

No comments:
Post a Comment