'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

May 23, 2013

అనసూయ అవుట్ రష్మీ ఇన్


అనసూయ 
ఈ టీ వీ లో ప్రసారమవుతున్న "జబర్దస్త్" అనే కామెడీ షో తో ఒక్కసారిగా పాపులర్ అయిన అనసూయను ఆ ప్రోగ్రాం నుండి తొలగించారు. అనసూయ స్థానం లో రష్మీ గౌతం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్దమవుతోంది. 

యువ సీరియల్ లో నటించిన రష్మీ గౌతం, "ఎవరైనా ఎపుడైనా", "గణేష్" వంటి చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ లు చేసింది. 

జీ తెలుగు లో సంగీతకి షాక్ ఇచ్చిన అనసూయ కు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మరొక యాంకర్ ని సెలెక్ట్ చేసుకుని అనసూయకు షాక్ ఇచ్చారు. 
రష్మీ గౌతం 

మరోవైపు అనసూయకు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని వినికిడి. ఎక్కువగా ఐటెం సాంగ్స్ చెయ్యమని ఆఫర్స్ వస్తున్నాయట. 

మరి రష్మీ గౌతం అనసూయకు ఏ రేంజ్ లో పోటీ ఇస్తుందో చూడాలి.... 

- లాస్య రామకృష్ణ No comments: