తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా
సాగరమే తల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు
గాంగ జఠాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే
ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
సేకరణ
లాస్య రామకృష్ణ

No comments:
Post a Comment