'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Apr 28, 2012

మీకు తెలుసా

కొండల్లాంటి ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పడే మంచు నెమ్మదిగా గట్టిపడి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇలా ఇవి పల్లానికి జరుగుతూ నేలను కూడా కోతకు గురి చేస్తాయి. ఇవి కరిగినప్పుడు వీటి నుంచే నదులు ఏర్పడి కిందకి ప్రవహిస్తాయి.

లక్షలాది బరువుండే ఐస్ బర్గ్ లు తేలుతూ సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగగానే ఇవి చిన్న ముక్కలుగా విడిపోయి సముద్రంలో కలిసిపోతాయి. ఐస్ బర్గ్ ల వాళ్ళ ఓడలకు ప్రమాదమే. 

టైటానిక్ ఓడ ఐస్ బర్గ్ ను ఢీ కొట్టే మునిగిపోయిందని తెలుసుకదా. 

ఇన్నాళ్ళు బి-15 అనే ఐస్ బర్గ్ కు అతి పెద్దదిగా రికార్డ్ ఉంది. 2001 లో ఏర్పడిన ఇది ఏకంగా 295 కిలోమీటర్ల పొడవు, 37  కిలోమీటర్ల వెడల్పు ఉండేది. ఇక దీని బరువు 300 బిలియన్ టన్నులుగా అంచనా వేశారు. కొన్నేళ్ళకు ఇది ముక్కలైపోయింది. 

ఐస్ బెర్గ్ ను గమనిస్తే ఎక్కువ శాతం సముద్రభాగంలో ఉంటూ కొంత భాగం మాత్రమే మనకి కనిపిస్తుంది. 

ఈ ఐస్ బెర్గ్ లను ఉదాహరిస్తూ కూడా కార్పోరేట్ కంపెనీస్ లో శిక్షణ తరగతులు మనుషుల మనస్తత్వం గురించి తెలియజేయడానికి తీసుకుంటూ ఉంటారు.

నేను అటెండ్ అయిన మెజారిటీ ట్రైనింగ్ ల లో ఎక్కువ శాతం ఐస్ బెర్గ్ థియరీ ఆ ట్రైనింగ్ కి రిలేట్ చేస్తూ కోట్ చేసారు. 

ఉదాహరణకి ఈ పిక్చర్ చూడండి.


ఒక మనిషి యొక్క ప్రవర్తన (Behaviour ), ఆ వ్యక్తి యొక్క విలువలు(values ), నమ్మకాలూ (Beliefs ), వైఖరి (Attitude ),  ప్రేరణ (Motivation ) మొదలగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 

కానీ కనిపించేది ప్రవర్తన మాత్రమే. ప్రవర్తనని నిర్దేశించిన ఈ సున్నితమైన అంశాలు అంతర్లీనంగా ఉంటాయి.

- లాస్య రామకృష్ణ 
3 comments:

anrd said...

మంచి విషయాలు తెలియజేసారండి.. ఐస్ బర్గ్స్ కొన్నికిలోమీటర్లు అంత పెద్దగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది.

sreenu said...

లాస్య గారు
చక్కటి విజ్ఞానదాయకమైన విషయాన్ని
తెలియచేసారు. ఐస్ బెర్గ్స్ గురించి తెలుసుకాని
ఇంతపెద్ద విస్తీర్ణంలో వుంటాయని తెలియదు నిజంగా.
ధన్యవాదాలు.

Ramakrishna said...

Iceberg మరి మనిషియొక్క వ్యక్తిత్వనికి ఉన్న సౌరుప్యాన్ని చాలా బాగా చెప్పరండి లాస్య గారు