'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jun 24, 2012

స్లీపింగ్ పెరాలసిస్ - Sleeping Paralysis

నిద్ర వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనం సరైన సమయానికి నిద్రపోతే శరీరానికి ఆలసట మటుమాయమవుతుంది. ఆ రోజు చాలా ఉత్సాహం గా ఉంటుంది.

కానీ ఈ నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా ఎన్నోఇబ్బందులు తలెత్తుతాయి. 

అందులో ఒకటి స్లీపింగ్ పెరాలసిస్(Sleeping Paralysis).

నిద్రలోకి వెళ్లబోయే ముందు  అయినా  నిద్ర నుంచి మెలకువలోకి వచ్చే ముందు అయినా కొంత సేపు అంటే కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల  వరకు నిస్తేజంగా(పక్షవాతం వచ్చినట్టు) పడి ఉండడం. లేవాలనుకున్నా లేవలేని సందర్భం.శరీరం లో ని అవయవాలు కంట్రోల్ లో ఉండవు.

ఇది నిస్సహాయ పరిస్తితి కాబట్టి కొన్ని terrifying hallucinations కూడా తోడవుతాయి.

మాటలు రావు. చేతులు కదలవు. శరీరం చాలా భరువుగా ఉంటుంది. Breathing కష్టంగా ఉంటుంది.

కానీ ఇలాంటి స్తితిని అధిగమించొచ్చు.

సరైన సమయానికి నిద్రపోవడం. 

ఎటువంటి టెన్షన్స్ అయిన నిద్రపోయే సమయంలో  భగవధ్యానం చేసి ప్రశాంతం గా నిద్రపోవడం లాంటి చాలా ఉపయోగపడుతుంది.


No comments: