ఇటీవలే ఒక చానల్ లో Father's Day సందర్భంగా ఒక కార్యక్రమం ప్రసారం చేసారు. అందులో బుల్లితెరలో ప్రాచుర్యం పొందిన కొందరు నటులు వాళ్ళ పిల్లలతో కలిసి పార్టిసిపేట్ చేసారు. తండ్రీ పిల్లల అనుబంధం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
అంతా బాగానే ఉంది. అయితే, ఈ షో ని అనాధ పిల్లలకు ఆశ్రయం కలిపించిన ఒక ప్రదేశం లో కి వెళ్లి తీసారు. చుట్టూ అనాధ పిల్లలు కుర్చుని ఉంటారు. బుల్లితెర సెలబ్రిటీ ల కి వాళ్ళ పిల్లలతో కొన్ని గేమ్స్ ఉంటాయి. ఆఖరున ఆ సెలబ్రిటీ లు వాళ్ళ పిల్లలకు ఒక కానుకని అందిస్తారు.
కాని, నాకు నచ్చని అంశం, అమ్మా నాన్నల ప్రేమకు దూరమైన ఆ పిల్లల ముందు ఆడంభరం గా తయారయి తమ పిల్లలని ముద్దు చెయ్యడం బాగాలేదు. ఆ పసి హృదయాలు ఏమి కోల్పోయాయో వారికీ తిరిగి గుర్తు చెయ్యనవసరం లేదు.
చేయగలిగితే వారికీ సహాయం చెయ్యండి. సహాయం చేసినంత మాత్రాన వాళ్ళ జీవితాలలోని వారు కోల్పోయిన అమూల్యమైన అమ్మా నాన్న ప్రేమ ని మీరు విమర్శించనవసరం లేదు.
ఇటువంటి కార్యక్రమాల బదులు ఆ పిల్లలకే ఏదైనా గేమ్ షో డిజైన్ చేసి వారిలోని ప్రతిభని ప్రోత్సహిస్తే ఎంతో బాగుండేది.
- లాస్య రామకృష్ణ
10 comments:
నేను ఆ కార్యక్రమం చూడలేదు కానీ ,మీరు చెప్పినది అక్షరాలా నిజమే వారికి దొరకని తల్లిదండ్రుల ప్రేమ ను వారి ఎదురుగా తమ పిల్లల పై సెలబ్రెటీలు ప్రదర్శించిడం ,ఘోరం .
ఎంత వెకిలి ఆలోచన!
ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించిన చిట్టిబుర్రను దాన్ని ఆమోదించి ప్రసారంచేసిన మట్టిబుర్రలను ఏం చేసినా పాపం లేదు కాక లేదు.
ఇలాంటి పైత్యపు కార్యక్రమాలనూ, అలాంటి షోలను నిర్వహించే వారిని ప్రోత్సహించే వరుసలో ముందుండేది జీటీవీ. బహుశా ఈ కార్యక్రమం వారిదే అయ్యుండచ్చు.
యెవరూ చేయని విధంగా సరికొత్తగా విడ్డూరంగా వింతగా ఏదో హడావిడిగా చేసేయ్యాలనే తాపత్రయం ఈలాంటి దుందుడుకు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు!అనాధపిల్లలకు అవ్యాజంగా ప్రేమ పంచాలి!
బాగా వ్రాశారండి.
నాగరాణి గారు, మీరన్నది నిజమే.
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను శ్యామలీయం గారు. మీ అమూల్యమైన స్పందనకి కృతఙ్ఞతలు.
ఈ టపాపై మీ అభిప్రాయం వ్యక్తపరిచినందుకు కృతఙ్ఞతలు రవి చంద్ర గారు.
సూర్యప్రకాష్ గారు మీరన్నది నిజమే.
అనురాధ గారు, ఈ టపా మీకు నచ్చినందుకు కృతఙ్ఞతలు.
Post a Comment