'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jun 25, 2013

సంథింగ్ సంథింగ్ మూవీ రివ్యూ (సినిమా చూడాలా వద్దా??)నటీనటులు 

సిద్దార్థ్ నారాయణ్   -  కుమార్ 
హన్సిక మోత్వాని  -   సంజన 
బ్రహ్మానందం          -   ప్రేం జీ 
గణేష్ వెంకట్రామన్ -   జార్జ్ 
రాణా                    -   స్పెషల్ అప్పియరన్స్ 
సమంత                -   స్పెషల్ అప్పియరన్స్ 

కథేంటి 

కొన్ని చిన్ననాటి సంఘటనల వల్ల ప్రేమంటే పడని కుమార్ ఆఫీస్ లో కి కొత్తగా జాయిన్ అయిన సంజన ప్రేమలో పడతాడు. ఆల్రెడీ సంజన కోసం తన ఆఫీస్ లో పని చేసే జార్జ్ ప్రయత్నాలని ఆపాలని ప్రేం జీ సూచనల మేరకు వారి మధ్య ఎఫైర్ ఉందని గాసిప్ క్రియేట్ చేస్తాడు. అనుకోని విధంగా వారు ఆ గాసిప్ వల్లే కలిసిపోతున్నప్పుడు కుమార్ తన ప్రేమను దక్కించుకునేందుకు వేసే ఎత్తుగడలే మిగతా సినిమా. ఈ లోపు ప్రేమ్జీ కి సంజన తన మేనకోడలు అన్న విషయం తెలిసిన తరువాత కథ కొత్త మలుపు తిరుగుతుంది. 

ఎలా నటించారు ???

సమంతా లో ఇదివరకు ఉన్న గ్లో లేదు. రెండు సీన్లలో కూడా మెప్పించలేకపోయింది. హన్సిక తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. సిద్దార్థ్ మాత్రం జబ్బు పడి రికవర్ అయిన మనిషిలా కనిపిస్తాడు. పాటలలో తన డ్రెస్సింగ్ కూడా అంతగా బాగోదు. గణేష్ వెంకట్రామన్ అందంగా కనిపించాడు. సిద్దార్థ్ కి సలహాలు ఇచ్చే పాత్రలో బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది. 

సంగీతం పరవాలేదా ???

పాటల చిత్రీకరణ అందంగా ఉంది. పాటలు కూడా సాఫ్ట్ గా బాగున్నాయి. 

దర్శకత్వం ఎలా ఉంది ???

సుందర్ సి అటు తమిళ ఇటు తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ద్వారా ఆకట్టుకున్నాడు. అశ్లీల సన్నివేశాలు, భయానక సన్నివేశాలకు తావు లేకుండా కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కామెడీ మూవీ ని అందించాడు. 

ఓవరాల్ గా 

క్లీన్ అండ్ లవ్లీ స్టొరీ. మస్ట్ వాచ్ మూవీ

రేటింగ్ - 4/5
- లాస్య రామకృష్ణ 

1 comment:

surya prakash apkari said...

తెలుగు మూవీలమీద లోతు అయిన విమర్శ అవసరం,ఎందుకంటే మన పత్రికలు ఎటూ చేయడంలేదు కదా!